VISAKHAPATNAM KONDAKARLA LAKE IS ONE OF THE VISUAL BEAUTY PLACE IN VIZAG FULL DETAILS HERE PRN VNL NJ
Visakhapatnam: అదో భూతల స్వర్గం.. ఒక్కసారి వెళ్తే వెనక్కి రావాలనిపించదు.. అంత అందంగా ఉంటుంది..
కొండకర్ల ఆవ
Vizag News: ఓ పక్క సరస్సు... అందులో తెల్లని, గులాభి తామరపూలు.., తామరాకుల మీద వాలే రంగు రంగుల పక్షులు.., వీటన్నిని మధ్య.. అలా ఆ పడవలో వెళ్తుంటే... లాహిరి లాహిరి లాహిరిలో... అంటూ పాట పాడుకోవాల్సిందే. ఇటువంటి అందమైన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..?
ఓ పక్క సరస్సు... అందులో తెల్లని, గులాభి తామరపూలు.., తామరాకుల మీద వాలే రంగు రంగుల పక్షులు.., వీటన్నిని మధ్య.. అలా ఆ పడవలో వెళ్తుంటే.. లాహిరి లాహిరి లాహిరిలో.. అంటూ పాట పాడుకోవాల్సిందే. ఇటువంటి అందమైన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..? ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) లో ఉన్న కొండకర్ల పక్షుల అభయారణ్యం మిమ్మల్ని ప్రకృతి ఒడిలోకి తీసుకువెళుతుంది, వివిధ రకాల వృక్షసంపద, పక్షులు, కొండలు మరియు స్వచ్ఛమైన గాలి మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. కొల్లేరు సరస్సు తర్వాత రెండవ పెద్ద మంచి నీటి సరస్సు ఈ కొండకర్ల. కొండలు, కొబ్బరి చెట్లు ఆవకు ప్రత్యేక అందాన్ని చేకూర్చుతున్నాయి.
కొండకర్ల అవ పక్షుల అభయారణ్యం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం . విశాఖపట్నం జిల్లా, అచ్యుతాపురం మండలం కొండకర్ల వద్ద ఉన్నపెద్ద మంచి నీటి సరస్సునే “కొండకర్ల ఆవ”గా పిలుస్తారు. మునగపాక నుండి అచ్యుతాపురం మండలాల వరకు సుమారు 1,832 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
రాజులు, బ్రిటీషర్లు విహార యాత్ర చేసేవాళ్లు..!
కొండకర్ల ఆవా సరస్సు భారతదేశానికి స్వాతంత్ర్యానికి ముందు విజయనగరం రాజులు మరియు బ్రిటీష్ వారికి ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్. వారు విశ్రాంతి తీసుకోవడానికి అభయారణ్యం వరకు ప్రయాణించేవారు. ఈ సరస్సు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శారదా నది వెంబడి ఉన్న మొత్తం ఇరవై ఒక్క గ్రామాల అవసరాలను తీరుస్తుందని నమ్ముతారు. ఇది అంతరించిపోతున్న, సతత హరిత అడవులకు నిలయం.
1. పక్షులను వీక్షించడం: కొండకర్ల ఆవా సరస్సు సంవత్సరం పొడవునా అనేక రకాల పక్షులను నివాసంగా ఉంటుంది. బర్డ్ లవర్స్‌కు ఇది బెస్ట్ ప్లేస్ అనొచ్చు. గ్రే హెరాన్స్, రెడ్ విస్కెర్డ్ బుల్బుల్, బ్లాక్ డ్రోంగో వంటి దాదాపు వంద రకాల పక్షులను సరస్సు చుట్టూ చూడవచ్చు. ఈ ప్రదేశం నెమలి తోక జకానాకు ప్రసిద్ధి చెందింది. డిసెంబరు నెలలో సైబీరియా మొదలగు అనేక దేశాల నుండి పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. ఇది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణీయం.
2. బోట్ రైడ్: కొండకర్ల ఆవా సరస్సు మీదుగా బోటింగ్ చేయడం ఒక అద్భుతమైన అనుభవం. పడవలో కూర్చుని విహరించేందుకు వీలుగా…చెక్క పలకలతో రెండు తాటి దుంగలతో పడవలను నిర్మించారు. ఈ సరస్సులో దాదాపు ఇరవై ఐదు రకాల చేపలు ఉన్నాయి. అలా సరస్సు లో పడవ లో వెళ్తూ ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. తామరపూల కొలనులో పడవప్రయాణం ఎవరికైనా మధుర జ్ఞాపకమే..!
బోటింగ్ ఫీజు : ఐదేళ్ల వయసు లోపు వాళ్లకు ఉచితమే.. ఐదేళ్లు దాటిన వాళ్లందరి దగ్గర నుంచి మనిషికి రూ.100 తీసుకుంటారు.
3. ప్లే ఏరియా: సందర్శనకోసం వచ్చే పిల్లలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ప్లే ఏరియా నిర్మాంచారు. కొండకర్ల పక్షుల అభయారణ్యం మీ కుటుంబంతో కలిసి సందర్శించడానికి ఒక అద్భుతమైన ప్రదేశం, ముఖ్యంగా పిల్లలు విస్తృత శ్రేణి వృక్షజాలం మరియు జంతుజాలం గురించి ఆసక్తి కలిగి ఉంటారు. వాళ్లకు నేచర్‌తో మమేకమయ్యేందుకు మంచి ప్రదేశం.
ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మీకు అరుదుగా కనిపిస్తుంటుంది. పచ్చని పల్లెటూరులో నుంచి ఈ ప్రాంతంలోకి వెళ్ళాలి. తెల్లవారుజామున 6 గంటలకు సన్ రైస్ మరియు సాయంత్రం సన్ సెట్‌ను అస్సలు మిస్ కాకండి. మీరు ఇంటి నుంచి బోజునము తీసుకువెళ్ళి పచ్చని పొలాల మధ్యలో తినవచ్చు.
ఇక్కడ ఎక్కువగా ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తుంటారు. చిన్న చిన్న సినిమాలని, షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇక్కడ చిత్రీకరిస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరలో చాలా రిసార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకాలస్యం మీరు ఓ సారి ఈ ప్రకృతి రమణీయ దృశ్యాలను వీక్షించి..మీ మొబైల్స్‌లో బందించుకుని రండి.
అడ్రస్: కొండకర్ల ఆవ, అచ్యుతాపురం మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 531033
ఎలా వెళ్లాలి..?
అచ్చుతాపురానికి సరిగ్గా 4 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడికి వెళ్ళాలి అంటే విశాఖపట్నం బస్టాండ్ నుంచి 400y బస్సు ఎక్కితే కొండకర్ల ఊరులోకి వెళ్తుంది. కానీ అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అంటే మాత్రం ఆటోలో వెళ్లాల్సిందే. అనకాపల్లి నుంచి కూడా ఇక్కడికి వెళ్లొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.