Setti Jagadeesh, News 18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఉన్న అందమైన సాగర నగరం విశాఖపట్నం (Visakhapatnam). ఈ మహానగరానికి వాణిజ్యపరంగానే కాదు పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం ఉంది. విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ప్రతిష్టాత్మకమైన జీ-20 సదస్సు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. విశాఖ వేదికగా ఈనెల 28, 29, 30 తేదీలలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జి-20 సదస్సు గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖ రామకృష్ణ బీచ్ (Vizag RK Beach) లో బోట్ రైడింగ్, కైట్ ఫెస్టివల్స్ లను విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లిఖార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో నిర్వహించే ప్రతిష్టాత్మమైన జీ-20 సదస్సు పట్ల ప్రజలను భాగస్వాములను చేయడానికి వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బోట్ రైడింగ్, కైట్ ఫెస్టివల్ అన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
విశాఖలో జీ-20 సదస్సు ప్రచారంలో భాగంగా ఆర్కేబీచ్ లో జీ-20 సదస్సు సెక్సెస్ అయ్యేందుకు నిర్వహించిన గాలి పటాలు (పతంగులు) పండుగ అంగరంగ వైభంగా సాగింది. సందర్శకులు, స్థానికులు, పర్యాటకులు తమతో తీసుకొచ్చిన గాలిపటాలు ఎగరేయడంతో విశాఖ నగరం అంతా మరోసారి సంక్రాంతి శోభను సంతరించుకున్నట్లు కన్పించింది.
చిన్నా, పెద్దా వయస్సుతో తారతమ్యం లేకుండా గాలిపటాలను ఎగురవేయడంతో ఆకాశంలో సంక్రాంతి ముగ్గు వేసిన మాదిరిగా ఎక్కడ చూసినా రంగు రంగులు గాలిపటాలు ఎగురుతూ కనిపించాయి. జీ-20 సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి విభిన్న వర్గాల చెందిన ప్రతినిధులు విశాఖకు విచ్చేస్తున్న నేపథ్యంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేందుకు ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సాగరతీరానికి విచ్చేసిన యువకులు కేరింతలు కొడుతూ ఉల్లాసంగా ఉత్సహంతో తమతో పాటు తీసుకొచ్చిన రంగురంగుల గాలిపటాలను ఆకాశంలో ఎగరవేసి వారు కూడా సంతోషాన్ని పంచుకున్నారు. ఆదే విధంగా నేవీ హెలికాప్టర్ జి-20 ఫ్లాగ్ తో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఇది ప్రజలను మరింత ఉత్సాహపరచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam