Kidney Disease: మరో ఉద్ధానంగా మొండిపాలెం.. ఇంటికి ఓ కిడ్నీ బాధితుడు..

మొండిపాలెం గ్రామం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీ సమస్య గురించి అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి సమస్యే మొండిపాలెం‌ను కూడా వెంటాడుతోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీ సమస్య గురించి అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి సమస్యే విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయితి మొండిపాలెంలో నెలకొని ఉంది. ఈ గ్రామానికి కిడ్నీ జబ్బు చేసింది. 2018 జూన్‌లో వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు కిడ్నీ వ్యాధితో చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా, మరికొందరు వ్యాధి ముదిరిపోయి, మరణశయ్యపై ఉన్నారు. ఊళ్లో ఎక్కడ చూసినా కిడ్నీ బాధితులే కనిపిస్తున్నారు. గ్రామ జనాభా దాదాపు 500 ఉంటుంది. 130 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తుల్లో చాలా మంది సమీపంలో ఉన్న క్వారీలలో రోజు వారీ వేతనం మీద కూలి పనులకు వెళుతుంటారు.

    గత 10 ఏళ్ల నుంచి కిడ్నీ సమస్య ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 50 మంది చనిపోయారు. గతేడాది 20 మంది చనిపోగా, మరో 30 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చాయి.  క్వారీల వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కొందరు గ్రామస్తులు అంటున్నారు. మొండిపాలెం గ్రామానికి 10 ఏళ్ల కిందటి వరకూ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కానీ, 10 ఏళ్ల కిందట ఇక్కడ క్వారీలు, క్రషింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. మొదట రెండు క్వారీలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 5కు పెరిగింది. దానితో పాటుగా 5 మెటల్ క్రషింగ్ యూనిట్లు వచ్చాయి. గ్రామస్తులలో ఎక్కువ మంది ఈ క్రషింగ్ ప్లాంట్ లలోనూ, క్వారీలలోనూ పనిచేస్తున్నారు.

    మొండిపాలెం గ్రామాన్ని తరలించాని గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. 2019 ఎన్నికల ముందు అచ్చయ్యపేట సమీపంలో 22 ఎకరాలు సేకరించి గ్రామస్తులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇప్పటికి అవి జరగలేదు..
    మరోపక్క గ్రామస్థులు ఆందోళన చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. ఇంటికి ఒక వ్యక్తి మంచాన పట్టినా.. ఆదుకోవాలని అరిచి, వినతులు ఇచ్చినా యంత్రాంగం నుండి స్పందన లేదు.మొండిపాలెం గ్రామాన్ని తరలించాని గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. 2019 ఎన్నికల ముందు అచ్చయ్యపేట సమీపంలో 22 ఎకరాలు సేకరించి గ్రామస్తులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇప్పటికి అవి జరగలేదు..

    మరోపక్క గ్రామస్థులు ఆందోళన చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. ఇంటికి ఒక వ్యక్తి మంచాన పట్టినా.. ఆదుకోవాలని అరిచి, వినతులు ఇచ్చినా యంత్రాంగం నుండి స్పందన లేదు.
    Published by:Sumanth Kanukula
    First published: