Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM KG SKINLESS CHICKEN 300RUPEES IN VISAKHAPATNAM SNR

Visakhapatnam: కొండెక్కిన కోడి కూర ధర..కిలో స్కిన్‌లెస్ చికెన్ 300రూపాయలు

(కొండెక్కుతున్న కోడి కూర ధర)

(కొండెక్కుతున్న కోడి కూర ధర)

chicken rate: వేసవిలో ఎండలు మండిపోతున్నట్లుగానే మాంసం ధరలు మండిపోతున్నాయి. విశాఖపట్నంలో కిలో చికెన్‌ ధర రికార్డ్‌ స్థాయికి చేరుకుంటోంది. వారం రోజుల క్రితం కిలో స్కిన్‌లెస్‌ చికెన్ 180రూపాయలు పలికిన చికెన్ ధర ఇప్పుడు వంద రూపాయలకుపైగా పెరిగింది.

ఇంకా చదవండి ...
సమ్మర్‌ వచ్చిందో లేదో చికెన్ రేటు సర్రున పెరిగిపోయింది. ఫిబ్రవరి నెలలో కనీసం రెండు వందలు దాటని కిలో స్కిన్‌లెస్ చికెన్‌ ధర ఇప్పుడు విశాఖపట్నం(Visakhapatnam)లో 300రూపాయలకు చేరుకుంది. వాస్తవంగా వేసవిలో ఎక్కువగా కోళ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. త్వరగా పెరుగుతాయి. ఇలాంటి సీజన్‌లో తక్కువ ధర ఉండాల్సిన చికెన్‌ రెండు వారాల వ్యవధిలోనే వంద రూపాయలు పెరగడంతో మాంసప్రియులు ఆశ్చర్యపోతున్నారు. ఏటా సమ్మర్‌ (Summer)లో చికెన్‌ ధరలు సాధారణ రోజుల కంటే కాస్త తగ్గుతాయి. కాని ఈసారి అందుకు పూర్తి భిన్నంగా వేసవి వచ్చిన వారం రోజులకే చికెన్‌ ధరలు అమాంతం పెరిగిపోవడంతో స్టీల్‌ సిటిలో నివసిస్తున్న ప్రజలు తప్పేది లేక కొనుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. గత వారం స్కిన్‌ లెస్‌ చికెన్ (Skinless chicken)కిలో 180రూపాయలు, విత్ స్కిన్ 120రూపాయలకు విక్రయించారు మాంస వ్యాపారులు (Meat merchants). కాని ఇప్పుడు సీన్‌ పూర్తిగా రివర్స్ అయింది. కిలో స్కిన్‌ లెస్ చికెన్‌ 290(costs Rs 300)రూపాయలకు చేరుకుంది. విత్‌ స్కిన్‌ (With skin)280కి విక్రయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సండే నాన్‌వెజ్‌ మస్ట్‌గా ప్రెఫవర్ చేస్తారు. ఇది కూడా మాంస వ్యాపారులకు బాగా కలిసొస్తుంది. అయితే సాధారణంగా శుభముహుర్తాలు, పెళ్లిళ్లు, ఇతర వేడుకలు ఉంటే హోల్‌సేల్ బిజినెస్‌పై ఆధారపడే వ్యాపారులు ఇప్పుడు రిటైల్‌ అమ్మకాలతోనే కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నారు. నాన్‌ వెజ్ ప్రియులు మార్కెట్‌లో చికెన్‌ ధరలు చూసి వామ్మో అంటుంటే..చికెన్‌ షాపు వ్యాపారులు మాత్రం ప్రతి ఏడాది సమ్మర్‌లో చికెన్ ధరలు పెరుగుతాయి..కాకపోతే ఈసారి మరింత ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సాధారణంగా కిలో చికెన్ స్కిన్‌ లెస్ 220రూపాయలు ఉంటుంది ఇప్పుడు కిలోకి 50-60రూపాయలు అధికంగా పెరిగిందని వ్యాపారులే ఒప్పుకుంటున్నారు. అంతే కాదు బేరాలు లేకపోవడం వల్లే చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయనే విషయాన్ని కొందరు వ్యాపారు బాహాటంగా చెబుతున్నారు.

ఇప్పట్లో తగ్గేదేలే ..
విశాఖపట్నంలో డిమాండ్‌కి తగ్గట్లుగా కోళ్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఇంతగా ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అంతే కాదు కోళ్లకు వేసే దాణా కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగిందని ఆ ప్రభావమే చికెన్‌ ధరలపై పడిందంటున్నారు. వారం రోజుల్లోనే చికెన్ ధరలు ఈ స్థాయిలో పెరగడానికి బేరాలు లేకపోవడం ఒక కారణమైతే..షాపుల్లో పని చేస్తున్న సిబ్బంది, మెయిన్‌టెనెన్స్‌ ఖర్చులను తట్టుకోవాలంటే చికెన్‌ ధరలు పెంచక తప్పడం లేదని మరికొందరు వ్యాపారులు చెబుతున్న మాట.

గిరాకి తగ్గడం వల్లే పెరిగిన ధర..
అన్‌సీజన్‌లో తగ్గాల్సిన చికెన్‌ ధరలు పెరగడంపై పెదవి విరుస్తున్నారు వినియోగదారులు. పెరిగిన చికెన్‌ ధరలు తగ్గాలంటే కోళ్ల ఉత్పత్తి పెరగాలని. కోళ్లకు వేసే దాణా ధరలు కూడా తగ్గిస్తే తప్ప చికెన్‌ రేటు కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదని పౌల్ట్రీ వ్యాపారులు నిర్మోహమాటంగా చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా కరోనా కారణంగా ఇమ్యునిటి లెవెల్స్‌ పెంచుకునేందుకు నాన్‌ వెజ్‌ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచనలను గట్టిగా పాటిస్తున్న వినియోగదారులు వారంలో ఒక్కరోజు తినే పౌష్టికాహారం కోసం 50రూపాయలు ఎక్కువైనా పర్వాలేదని సర్దుకుపోయి చికెన్‌ కొనుగోలు చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Andhra Pradesh, Chicken rate, Vishakaptnam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు