హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam: ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు దాహం తీరుస్తున్న రిజర్వాయర్ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకత ఏంటంటే..?

Visakhapatnam: ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు దాహం తీరుస్తున్న రిజర్వాయర్ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకత ఏంటంటే..?

X
కణతి

కణతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ 

Visakha Patnam: ఆంధ్రుల హక్కుగా గుర్తింపు పొందిన విశాఖ ఉక్కు దాహాన్ని తీరుస్తోంది కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌.. నీటి అవసరాలను తీర్చడమే కాదు..? సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూసేందుకు కూడా అక్కడకు భారీగా సందర్శకులు వస్తారు.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  Neelima Eaty, News18, Visakhapatnam

  Vizag Steel Plant:  విశాఖ ఉక్కు (Vizag Steel) అంటే ఆంధ్రుల హక్కుగా గుర్తింపు పొంది.  దేశంలోనే చాలా ప్రత్యేక గుర్తింపు ఉన్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) నిర్వహణ కోసం నిత్యం లక్షల లీటర్ల నీరు అవసరం అవుతుంది.  ఆ నీటి కోసం భారీగా నిల్వ సామర్ధ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే తప్ప, నీటి నిల్వ సాధ్యం కాదు. అలా విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం నిర్మించిందే కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (KBR). విశాఖపట్నం (Visakhapatnam) లోని ఉక్కునగరంలో ఉన్న ఈ రిజర్వాయర్, మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్లాంట్ టౌన్‌షిప్‌ వాసులకు ప్రధాన నీటి వనరుగా మారింది. ముఖ్యంగా స్టీల్‌ ప్లాంట్‌ అవసరాల కోసం 90 రోజుల పాటు సరిపడే నీరు నిల్వ ఉంచేందుకు కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌–1 (KBR-1) ను మూడు దశాబ్దాల కితం నిర్మించారు. రిజర్వాయర్‌-1కు తూర్పు గోదావరి జిల్లాలో ప్రవహించే ఏలేరు నది నుండి ప్రత్యేకంగా నిర్మించిన ప్రత్యేక కాలువ ద్వారా నీరు వచ్చి చేరుతుంది. ఈ రిజర్వాయర్ 0.5 Tmcft నీటి నిల్వ సామర్థ్యంతో 2.0 km నుండి 2.2 km విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

  స్టీల్ ప్లాంట్ లోపల ఇప్పటికే ఉన్న KBR-1 రిజర్వాయర్ లీకేజీలు, మరికొన్ని నిర్మాణ లోపాల వల్ల తగినంత నీటిని నిలుపుకోలేకపోయింది. అంతేకాదు హుద్‌హుద్‌ దెబ్బకు కూడా ఈ రిజర్వాయర్‌ ధ్వంసమైంది. ఫలితంగా స్టీల్‌ ప్లాంట్‌కు నీటి కొరత ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో హుద్‌హుద్‌ వంటి విలయాలు వచ్చినా తట్టుకునే విధంగా రిజర్వాయర్‌ పునర్నిర్మాణం పకడ్బందీగా చేపట్టింది స్టీలు ప్లాంట్‌ యాజమాన్యం. 

  వాస్తవానికి, KBR-1 గరిష్టంగా 20 రోజులు మాత్రమే నీటిని నిలుపుకోగలదు, ఇది ఆ స్టీల్‌ప్లాంట్‌కు ప్రతిపాదించుకున్న నీటి నిలుపుదల సామర్థ్యంలో సగం కంటే తక్కువ. ఇది RINL ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో మరో రిజర్వాయర్‌ను నిర్మించాలనుకున్నారు. అందులో భాగంగా కణతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌-2 వచ్చింది.

  ఇదీ చదవండి : వైసీపీ ట్రాప్ లో పవన్..! బాబు డైలమాకు కారణం అదేనా..? మరి జరగబోయేది ఏంటి..?

  ప్లాంట్‌ అవసరాల కోసం రిజర్వాయర్‌-2 నిర్మాణం

  రిజర్వాయర్‌-1 ద్వారా నిల్వచేసే నీరు సరిపోవడం లేదని మరో రిజర్వాయర్‌ను నిర్మించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి అందుబాటులో ఉన్న ఈ రిజర్వాయర్-2… ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌కు నీటి కష్టాలు లేకుండా చేసింది. గతంలో ఉన్న కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్-1కి అనుబంధంగా.. రెండేళ్ల క్రితం కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్-2ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఉక్కు ఉత్పత్తికి సరిపడా నీటిని నిల్వ చేసుకునే వీలుంది.

  ఇదీ చదవండి : కన్యకాపరమేశ్వరి శతాబ్ధి ఉత్సవాల్లో పవన్.. ప్రత్యేకత ఏంటంటే?

  రిజర్వాయర్‌-2 ప్రత్యేకతలు..!

  7.2 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయగలిగే విశాఖ ఉక్కు కర్మాగారం... నీటి అవసరాలు తీర్చుకునేందుకు కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్-2ను సిద్ధం చేశారు. గతంలో కేబీఆర్-1 ద్వారా అర టీఎంసీ నీటిని నిల్వ చేసుకుంటున్న స్టీల్ ప్లాంట్... ఇప్పుడు మరో అర టీఎంసీ నీటి నిల్వసామర్ధ్యాన్ని పెంచుకుంది.

  ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌కు ప్రతి రోజు 45 మిలియన్‌ గ్యాలన్ల నీరు అవసరం. గతంలో 43 మిలియన్‌ గ్యాలన్ల నీరు ఏలేరు రిజర్వాయర్ నుంచి సరఫరా అయ్యేది. ఈ మేరకు కూర్మన్నపాలెం జాతీయ రహదారిని ఆనుకుని కేబీఆర్-2 నిర్మాణం కోసం రూ. 465 కోట్లు స్టీల్ ప్లాంట్ వెచ్చించింది. 225 ఎకరాల భూమిలో (KBR-1లో 1/3వ వంతు) నిర్మించబడిన KBR-2 …. 24 మీటర్ల లోతుతో 12.32 మిలియన్ క్యూబిక్ మీటర్ల వైశాల్యంతో ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ (L&T) ఈ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేసింది.

  ఇదీ చదవండి : వైజాగ్ వెళ్తున్నారా..? తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది.. పచ్చని కొండపక్కనే అలల హోరు..

  ర్యాటక ప్రాంతంగా మారిన రిజర్వాయర్‌-2

  ఈ రిజర్వాయర్ ఉక్కు పరిశ్రమకు నీళ్లు ఇవ్వడమే కాదు, పర్యటక ప్రాంతంగానూ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కణితి జలాశయం వద్ద సూర్యాస్తమయం, సూర్యోదయాన్ని చూడటానికి నగరవాసులు వస్తుంటారు. ఉదయం వాకింగ్‌, జాగింగ్‌లకు స్థానికులకు ఇది చక్కని ప్రదేశం. పచ్చని చెట్లు, పక్షులు కిలకిలా రావాలు వింటూ అక్కడ వాకింగ్‌ చేస్తుంటే ..మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఫ్యామిలీలు పిల్లలతో కలిసి ఇక్కడకు సరదాగా వస్తుంటారు.

  ఇదీ చదవండి : మట్టి మాఫియాను వదిలి.. ప్రశ్నించిన వారి అరెస్టులా..? ఉద్రిక్తంగా మారిన ఛలో అనుమర్లపూడి

  తక్కువ నీటితో ఉక్కు ఉత్పత్తిలో అవార్డు

  దేశంలోనే అతి తక్కువ నీటిని వినియోగించి ఉక్కు ఉత్పత్తి చేస్తున్న కర్మాగారంగా విశాఖ స్టీల్ ప్లాంట్... ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు అందుకుంది. కేబీఆర్-2 రిజర్వాయర్ విశాఖ స్టీల్ ప్లాంట్కి అందుబాటులోకి రావటంతో... స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ నీటి అవసరాలతోపాటు, జీవీఎంసీకి అవసరమైన నీరు అందుతోందని విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


  అడ్రస్‌ : కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నెహ్రూ పార్క్ పక్కన, స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం - 530032

  ఎలా వెళ్లాలి?

  వైజాగ్‌ స్టీల్ ఫ్లాంట్‌ ఏరియాలో ఉన్న ఈ రిజర్వాయర్‌కు వెళ్లాలంటే బస్టాండ్‌ నుంచి 38k బస్సు ఎక్కితే చాలు స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్తుంది. బస్టాండ్‌ నుంచి ఆటోలు, క్యాబ్‌లలో వెళ్తే 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. బైక్‌లు, కార్‌లలోనే ఎక్కువగా స్థానికులు వస్తుంటారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag Steel Plant

  ఉత్తమ కథలు