VISAKHAPATNAM KAKINADA MISSING TIGER FOUND IN ANAKAPALLI SAME TO SAME TIGER NGS
Tiger Tension: అది ఇదే.. కాకినాడ పులి, అనకాపల్లి పులి ఒకటేనా..? పాదముద్రలతో నిర్ధారించామంటున్న అధికారులు..
కాకినాడ జిల్లాలో పులి (ఫైల్)
Tiger Tension: బెంగాల్ టైగర్ ఏపీ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు నెలన్నర దాటినా దానిలో బోనులో బంధించే అవకాశం ఇవ్వడం లేదు.. పైగా అందరి కళ్లు కప్పి.. కాకినాడ నుంచి అనకాపల్లికి షిప్ట్ అయ్యింది. అయిత అది ఇదీ ఒకటేనా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం అద ఇదే ఇది అంటున్నారు.
Tiger Tension: బాబోయ్ బెంగాల్ టైగర్ అనుకునేలా చేస్తోంది. ఒకటి రెండు కాదు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అన్నింటినీ తిప్పి కొట్టింది.. అధికారులు చాకిచక్యంగా పన్నిన వ్యూహాలను అంతే చాకిచక్యంగా చిత్తు చేసింది. దమ్ముంటే టచ్ చేసి చూడండి అంటూ సవాల్ విసిరింది. ఎన్ని రకాల ఎరలు వేసినా. బోను దగ్గరకు వచ్చి చిక్కినట్ట చిక్కి.. చిటికెలో తప్పించుకుంది. ఇలా ఐదు, పది రోజులు కాదు.. దాదాపు నెలన్నర రోజుల పాటు అధికారులకు చుక్కలు చూపించిన బెంగాల్ టైగర్ ఇప్పుడు రూటు మార్చింది. గత నెలన్నర రోజులుగా కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు నియోజకవర్గంలో అదిగో పులి (Tiger).. ఇదిగో పులి అన్న మాటలే ఎక్కువగా వినిపించాయి. అదిగో ఆ దారిలో నేను పులిని చూశానంటే.. ఇదిగో ఇటువైపు రోడ్డు దాటుతుంటే నేను చూశానంటూ ఇలా ఎవరి నోట విన్నా అదే భయం. ఇప్పుడు అక్కడ నుంచి మెల్లగా అనకాపల్లి జిల్లా (Anakapalli District) లో ఎంట్రీ ఇచ్చింది. దీంతో అనకాపల్లి జిల్లా వాసులకు నిద్ర కరువు అవుతోంది. శ్రీరాంపురం వద్ద నిన్న గేదెను చంపి పాక్షికంగా తిన్న పులి.. మళ్లీ అక్కడికి వస్తుందని అధికారులు భావించారు. ఈ క్రమంలో పెద్దపులి నక్కపల్లి మండలంలోకి వచ్చే అవకాశం ఉందంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి జాడ (Tiger) తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పెద్దపులి మాత్రం అధికారుల ట్రాప్ కు చిక్కడం లేదు. తాజాగా తిరుపతిపాలెం సమీపంలో పులి అడుగు ముద్రలు ఉన్నాయంటూ మరికొందరు అధికారులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకుని స్థానికులను అడిగి సమాచారం తీసుకున్నారు. చీడిక, రేబాక, తిరుపతిపాలెం మీదుగా ఇటు వచ్చి ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే మొదట అసలు ఆ పులి.. ఈ పులి ఒకటేనా.. రెండు వేరు వేరు పులులా అనే అనుమానాలు ఉండవి. కానీ దాని పాదముద్రల కొలతలు తీసి కాకినాడ ప్రాంతంలో, ఇక్కడ ఉన్నది ఒకే పులి అని నిర్ధారించారు.
గత నెల 28న నర్సీపట్నం మండలం వేములపూడి శివారు అప్పనపాలెంలో రెండు ఆవుదూడలపై పులి దాడి చేసి చంపేసిన ఆ పులి.. రెండు రోజుల తరువాత నాతవరం మండలం గాంధీ నగరం సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది. అక్కడ నుంచి జిల్లా సరిహద్దు దాటి కాకినాడ జిల్లాకు చేరింది. అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. దీని జాడ కనిపెట్టేందుకు అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయించారు. బోనువరకు వచ్చి వెనక్కి వెళ్లిపోవడంతో అధికారులు ఉసూరుమన్నారు. ఇప్పుడు అదే పులి కోటవురట్ల మండలంలో సంచారించడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటివరకు కాకినాడ జిల్లాలోనే తిరుగుతూ అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన పెద్దపులి, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. కాకినాడ జిల్లాను విడిచిపెట్టిన పెద్దపులి అనకాపల్లి జిల్లాలోకి ఎలా ఎంటరైంది అన్నది అంతుచిక్కడం లేదంటున్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినా.. ఏ కంటికి చిక్కడకుండా ఎలా తప్పించుకుంది అని ఆలోచిస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో పులిజాడ తెలియడంతో కోస్తా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే పులి జాడను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అనకాపల్లి ఏజెన్సీ ఏరియాలో పులికోసం వెతుకులాట ప్రారంభించారు. పులి కోటవురట్ల అటవీ ప్రాంతంలో కొండపైకి వెళ్లి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా సీసీ కెమెరాలను అమర్చారు. పులి దాదాపు 30కి.మీ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుందని భావిస్తున్న అధికారులు, ఆ మేరకు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.