హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag Special: వైజాగ్ ను ఈ యాంగిల్ లో ఎప్పుడైనా చూశారా..? వావ్ అనకుండా ఉండలేరు..!

Vizag Special: వైజాగ్ ను ఈ యాంగిల్ లో ఎప్పుడైనా చూశారా..? వావ్ అనకుండా ఉండలేరు..!

X
విశాఖకు

విశాఖకు స్పెషల్ అట్రాక్షన్‌గా కైలాసగిరి రోప్ వే

Vizag: ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఆకర్షణ నగరంగా విశాఖపట్నంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే పర్యటక ప్రాంతాలకు నిలయం విశాఖ నగరం. విశాఖ వచ్చిన ప్రతి పర్యాటకులు తిరిగి ప్రయాణం అయ్యే వరకూ ఇక్కడ అన్ని ప్రదేశాలు ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam | Andhra Pradesh

Setti Jagadeesh, News 18, Visakhapatnam

ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఆకర్షణ నగరంగా విశాఖపట్నం (Visakhapatnam) కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే పర్యటక ప్రాంతాలకు నిలయం విశాఖ నగరం. విశాఖ వచ్చిన ప్రతి పర్యాటకులు తిరిగి ప్రయాణం అయ్యే వరకూ ఇక్కడ అన్ని ప్రదేశాలు ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. ఈ నగరంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఎంతో అద్బుతంగా ఉండేది కైలాసగిరి  (Vizag kailasagiri)ఒకటి. పేరుకు తగినట్లే కొండపై శివ పార్వతులు వుండే ప్రాంతం ఇది. నగరం లో ఎక్కడ నుండి చూసినా ఈ కైలాస గిరి పర్వత ప్రాంతం కనిపిస్తుంది. విశాఖ వచ్చే పర్యాటకులు కైలాసగిరి వినోదానికి కేరాఫ్ గా అందరూ చెబుతారు. ఈ శిఖరం సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో 380 ఎకరాల విస్తీర్ణంలో వుంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎంతో సరదాగా , ఎక్కువ సమయాన్ని గడుపుతారు.

ఈ కొండపై ఎత్తైన తెల్లని శివ పార్వతుల విగ్రహలు వుంటాయి. ఇవి ఎంతగానో ఆకట్టుకుంటాయి. హుద్ హుద్ తుఫాన్ (Hud Hud Cyclone) ప్రభావంతో లో కైలాసగిరిలో అనేక చెట్లు నేలకూలాయి..కొన్ని ప్రదేశాలు దెబ్బతిన్నా సరే శివ పార్వతుల విగ్రహాలు మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఈకైలాసగిరి పైకి వెళ్లేందుకు మెట్లు, రోడ్డు, రోప్ వే మార్గం ద్వారా పర్యాటకులు చేరుకోవచ్చు. వీటిలో రోప్ వే ప్రయాణం అనేది పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వచ్చే ప్రతి పర్యాటకులుకి మరపురాని విధంగా చేస్తుంది. విశాఖ నగర అందాలను చూడాలి అనుకునే వారు కైలాసగిరి తప్పక ఆస్వాదించి తీరాలి. ఇందులో రానూ పోను పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.80 రుసుము వసూలు చేస్తారు.

ఇది చదవండి: మన్యంలో ఆ తరహా దుస్తులకు గిరాకీ.. ఏడాదికి 9 నెలలపాటు డిమాండ్..!

కైలాసగిరిలో చాలా వరకు పిల్లల కోసం పార్కులు, ఆట పరికరాలు అన్ని ఉంటాయి. కొండపై పెద్దలు, పిల్లలు ఎక్కేందుకు గుర్రపు స్వారీను కూడా ఎంజాయ్ చేయవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంజాయ్ చేయడానికి ఇది అనువైన ప్రదేశం అని కైలాసగిరి చూసే సందర్శకులు మాటల్లో చెప్తున్నారు. ఇతర మార్గాల కంటే రోప్వే ఎంతో అద్భుతంగా ఉందంటూ వర్ణిస్తున్నారు.

ఎలా చేరుకోవాలి

విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 10.5 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి 11.7 కిలోమీటర్లు దూరంలో కైలాసగిరి పర్యాటక ప్రాంతం ఉంటుంది.ఇక్కడికి బస్సు, ఆటో సౌకర్యం కలదు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు