VISAKHAPATNAM KA PAUL SLAMS ON AP CM JAGAN HE DEMAND EDUCATION MINSTER WILL RESIGN ON 10TH INTER EXAMS ISSUE NGS VZM
AP Inter Exams: మూడో తేదీన తేల్చుకుందాం. అరెస్ట్ చేస్తారా? హత్య చేస్తారా? దేనికైనా రెడీ
కొనసాగుతున్న కేఏ పాల్ ఆమరణ దీక్ష
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలపై దుమారం ఆగడం లేదు. ఓ వైపు ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి తీరుతాము అంటే. ఆ నిర్ణయాన్ని వ్యతిరికేస్తూ కేఏ పాల్ ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. మే మూడో తేదీన కోర్టు తీర్పు వచ్చేంతవరకు తాను దీక్ష కొనసాగిస్తానని.. తనను అరెస్ట్ చేసినా.. హత్య చేసినా భయపడేది లేదన్నారు కేఏ పాల్.
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలపై దుమారం ఆగడం లేదు. ఓ వైపు ప్రభుత్వం పరీక్షలను నిర్వహించి తీరుతామని పదేపదే చెబుతోంది. తాజాగా సీఎం జగన్ సైతం పరీక్షలపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. దీంట్లో మరో ఆలోచనకు తావే లేదన్నారు. పరీక్షల నిర్వహణ నిర్ణయం సైతం కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందన్నారు. పరీక్షలను రద్దు చేయడం చాలా సులభమని.. కానీ పరీక్షలు నిర్వహించడమే కష్టంతో కూడుకున్న పని అన్నారు. అయితే విద్యార్థులకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని మరోసారి స్పష్టత ఇచ్చారు.
అయితే పది, ఇటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలపై పునారాలోచించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 30 లక్షల మంది విద్యార్థుల జీవితానికి సంబంధించిన అంశంలో పునఃపరిశీలన చేసుకోవాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు విచారణపై ప్రజాశాంతి పాల్ స్పందించారు. బుర్రవున్న వారెవరైనా ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తారా? అని ఏపీ ప్రభుత్వం తీరుపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు రద్దు కోరుతూ పాల్ చేపట్టిన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి మతిలేదా? అని ప్రశ్నించారు. కేబినెట్ లో ఉన్న పనికిమాలిన విద్యాశాఖ మంత్రి మాటను.. జగన్ వినవద్దన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి? అని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
సీఎం జగన్ తన సొంత కూతుర్లును అయితే కరోనా టైంలో ఇలా పరీక్షలు రాయడానికి కోవిడ్ హాల్లోకి పంపిస్తారా? అని పాల్ నిలదీశారు. తాను చేస్తోన్న దీక్షకు, జీవించి వుంటే రాజశేఖర్ రెడ్డి వచ్చి ఉండేవారని తెలిపారు. తాను వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించిందని.. తన వాదనతో ఏకీభవించింది అన్నారు. మే 3న జరిగే వాయిదాలో పరీక్షలు వాయిదా పడతాయన్న విశ్వాసం తనకుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు తాను ఆమరణ దీక్ష కొనసాగిస్తానని తెలిపారు.
పట్టుదల కోసం పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. పరీక్షల రద్దు కోసం మీకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు తనను అరెస్టు చేస్తారా? లేక హత్య చేస్తారా?, ఏది చేసినా తను భయపడను అన్నారు. దేనికీ తాను భయపడనని.. న్యాయం కోసమే తన పోరామన్నారు. లక్షాలది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు కేఏ పాల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.