Setti Jagadesh, News18, Visakapatnam
మన్యం లో కురుస్తున్న మంచు తుంపరులు… మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు , అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడాలంటే ఆంధ్రా కశ్మీర్ లంబసింగి వెళ్లాల్సిందే. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ ప్రాంతం కి అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తున్నారు.
ఈ ఏడాది కూడా అతి కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో ఇతర రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అక్కడి మంచు అందాలను ఆస్వాదిస్తూ మెుక్కజొన్న పొత్తు తినకుండా ఎవరు రారు.. పల్లపు ప్రాంతంలో పండే మొక్క జొన్న కంటే ఏజెన్సీ లో పండే జొన్న పొత్తు కి చాలా రుచి వస్తుంది. చిరు చినుకులు పడుతున్నప్పుడు , చల్లని మంచులో విహరిస్తూ వున్నపుడు , వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తినడానికి మనసు పరుగు పెడుతుంది.
Read Also : Visakhapatnam: అక్కడ క్యాలీఫ్లవర్ రూ.5 మాత్రమే
మంచు కురిసే వేళలో ఘాట్ రోడ్డు వెళ్లేటప్పుడు మొక్కజొన్న పొత్తులు కమ్మగా తింటే ఆ మజా మాటల్లో చెప్పలేనిది అంటున్నారు పర్యాటకులు. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం వున్నాయి. మన్యంలో గిరిజనులు అధిక శాతం ఘాట్ రోడ్లో ఈ మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. శీతాకాలం అంతా కూడా మొక్కజొన్న పొద్దున అమ్ముకొని జీవిస్తూ మిగతా సమయంలో కొండ ప్రాంతంలో పనులకు వెళ్లి జీవనం సాగిస్తారు గిరిజనులు.
ఒక్క జనపద 20 రూపాయలకు ఉడకబెట్టి ఇవ్వడం జరుగుతుంది. చల్లని మంచి ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకలు ఈ మొక్కజొన్న పొత్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సిటీలో తేనె మొక్కజొన్న పొత్తు కంటే మన్యంలో పండించే మొక్కజొన్నపొత్తు చాలా టేస్టీగా ఉందంటే పర్యాటకులు అంటున్నారు. చల్లని వాతావరణంలో మొక్కజొన్న సరదా తో పాటు ఎన్నో లాభాలు కూడా ఉంటాయి.
రోజూ మొక్కజొన్న తినేవారికి జుట్టు బలంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి జుట్టును స్మూత్‌గా, మంచి షైనింగ్‌గా ఉండేలా చేస్తుంది.మొక్కజొన్న తక్షణ శక్తిని ఇచ్చే ఆహారపదార్ధం. దీనిని తినడం వలన ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.
ఇందులో ఖనిజాలు పోషకాల శాతం కూడా ఎక్కువగానే
మొక్కజొన్న తరచుగా తినడం వల్ల హైపర్టెన్షన్ కూడా దూరం అవుతుంది. బీపీ షుగర్ గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న. అందుకే వర్షాకాలంలో సరదాకి తినడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే మొక్క జొన్నను మీ ఆహారంలో భాగం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Visakhapatnam, Vizag