Setti Jagadeesh, News 18, Visakhapatnam
విశాఖపట్నం (Visakhapatnam) మన్యం ఏజెన్సీ ప్రాంతాల్లో సుగంధ ద్రవ్యాల సాగుకు నిలయం. సుగంధ ద్రవ్యాల సాగుకు విశాఖ, పాడేరు మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharamaraju District) కేరళ (Kerala) ను మించి పోతుంది. గిరిజనులు అడవిపై ఆధారపడి జీవిస్తుంటారు. విపత్తు వాతావరణ పరిస్థితుల్లో మిరియాలు, పసుపు, తేనె, కాకరకాయ పలు రకాల అటవీ ఉత్పత్తులను సేకరించి గత్యంతరం లేక దళారులను ఆశ్రయించవలసి వస్తుంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీడీఏ సహకారంతో అంతర్జాతీయ ఖ్యాతిను పొందే విధంగా సేంద్రీయ కాపీ, మిరియాలు సాగు చేస్తున్నారు. గిరిజనుల జీవితాలు అటవీ ఉత్పత్తులతో ముడిపడి ఉంది. అటవీ ఉత్పత్తులుపై గిరిజనులు అధిక శాతం దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వాటి పైన అధిక లాభాలు వస్తాయని గిరిజనులకు తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు గిరిజన రైతులకు మార్కెటింగ్ సదుపాయాల కల్పనలో వాటిని అనుగుణంగా సహాయ సహకారాలు అందిస్తామని కొనుగోలుదారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
రైతులు అటవీ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మిరియాలు కాఫీ, తేయాకు పసుపు ఇలా అనేక రకాల ఉత్పత్తులు పండిస్తే మంచి లాభాలు వస్తాయని కలెక్టర్ సూచించారు. ఎక్కువగా మిరియాలకు , కాఫీకి అధిక ధర లభిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో 4800 మెట్రిక్ టన్నుల మిరియాలు, 90 వేల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అందుబాటులో వుంది. కాఫీ పళ్ళను గ్రేడింగ్ చేస్తే రూ.60లకు విక్రయించవచ్చు అన్నారు. మిరియాలకు కిలో 400 నుండి 450 వరకు మార్కెట్ ధర పలుకుతుందనీ ఆయన పేర్కొన్నారు. అధిక శాతం ఈ పంటలపై దృష్టి సాధస్తేమంచి ధర పలుకుతుందని అన్నారు.
ప్రస్తుతం కాఫీ మిరియాలు అధిక ధరలో ఉన్నాయి కాబట్టి వాటి ఉత్పత్తి పెరిగేలా వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చేస్తామని తెలిపారు.అటవీ ఉత్పత్తులపై దృష్టి సాధించి తమ జీవనానికి మంచి మాట వేసుకోవాలని గిరిజనులకు కలెక్టర్ సూచనలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam