Setti Jagadeesh, News 18, Visakhapatnam
విశాఖపట్నం (Visakhapatnam) లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharath Express) పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. బుధవారం కంచరపాలెంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసమయ్యాయి. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం విశాఖ రైల్వే స్టేషన్ కి ఈ రైలును రప్పించారు. సిబ్బంది, రైల్వే అధికారులు పరిశీలించిన అనంతరం సాయంత్రం విశాఖ స్టేషన్ నుంచి కోచ్ కాంప్లెక్స్ కి ట్రైన్ వెళ్తుండగా కంచరపాలెం రామ్మూర్తి పంతులు పేట వద్దకు రాగానే కొందరు ఆకతాయిలు రైలు పై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్ రైలు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. వందే భారత్ ట్రైన్ పై రాళ్ల దాడిని వాల్తేర్ డివిజన్ అధికారులు ధ్రువీకరించారు.
ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు..
నగరానికి వచ్చిన వందే భారత్ రైలుపై కంచరపాలెం రామ్మూర్తి పంతులు గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరి రైలు అద్దం ధ్వంసం చేసిన విషయంలో తక్షణమే విశాఖ నగర పోలీసులు స్పందించారు. జి.ఆర్.పి.ఎఫ్ కు, ఆర్. పి. ఎఫ్ కు పూర్తిగా సహకరిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ వెంటనే స్పందించి నిందితులు గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఎంతో.. ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ రైలు పై ఇటువంటి సంఘటన జరగడం. పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి తగు చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతుంది.
రైలుపైదాడి జరిగిన ప్రదేశాన్ని వెస్ట్ ఏసిపి అన్నపు నరసింహమూర్తి ఆర్పిఎఫ్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు సిసి ఫుటేజ్ ఆధారంగా నలుగురు నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితులనుపట్టుకునేందుకు జి ఆర్ పి ఎఫ్ , ఆర్ పి ఎఫ్ పోలీసులు ఒక టీంగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పదిమంది సిటీ పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్, అలాగే ఇద్దరు డిసిపిలు, ఒక క్రైమ్ డిసిపిలు కూడా వెళ్లారు.
పోలీసులు అదుపులో అనుమానితులు!
సిసి ఆధారంగా నలుగురు అనుమానితులను గుర్తించిన పోలీసులు, వెంటనే వారిని పట్టు కోవడం కోసం ఆ రంగులోకి దిగారు. నిందితుల కోసం కంచరపాలెం ప్రాంతంతోపాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. అయితే నలుగురు అనుమా IR నితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని కంచరపాలెం పోలీసు స్టేషన్లో విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vande Bharat Train, Visakhapatnam