• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM INTER STUDENT GOT PREGNANCY WHILE STAYING AT HOME DURING LOCKDOWN AND COLLEGE PRINCIPAL FACING CRITICISM IN VIZIANAGARAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VZM

Andhra Pradesh: ఇంటర్ విద్యార్థినిలో అనూహ్య మార్పులు... తీరా ఆరా తీస్తే షాకింగ్ నిజాలు..

Andhra Pradesh: ఇంటర్ విద్యార్థినిలో అనూహ్య మార్పులు... తీరా ఆరా తీస్తే షాకింగ్ నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం

తెలిసీ తెలియనితనం.. అంతలోనే ఆకర్షణ.. ఆపై ప్రేమ..అది అక్కడితో ఆగదు. తప్పటడుగులు వేసేవరకు వెళ్తుంది.

  • Share this:
    తెలిసీ తెలియని తనం.. అంతలోనే ఆకర్షణ.. ఆపై ప్రేమ..అది అక్కడితో ఆగదు. తప్పటడుగులు వేసేవరకు వెళ్తుంది. ఆ తర్వాత జీవితం అనూహ్య మలుపులు తిరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని శివన్నపేట గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల తరచూ వివాదాస్పదమవుతోంది. గుట్టుగా సాగుతున్న విద్యార్ధినుల ప్రేమ వ్యవహారాలు, ఇతర ఘటనలు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాజాగా కొమరాడ  మండలం పాలెం పంచాయతీలోని కుంబుకోట గిరిజన గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని తమ గ్రామానికే చెందిన యువకుడితో ప్రేమలో పడి గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది కరోనా సెలవుల్లో కళాశాల మూసేయడం, విద్యార్ధినులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో గురుకులంలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని తన గ్రామానికే చెందిన యువకుడితో ప్రేమలో పడడం, పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్దమయ్యారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో మైనారిటీ తీరాక పెళ్లిచేసుకునేందుకు ఇరు కుటుంబాలు సిద్దమయ్యాయి.

    ఇక గత ఏడాది నవంబర్ నెలలో గురుకులాలు తెరవడంతో పాఠశాలకు వచ్చిన విద్యార్ధినిలో మార్పులు రావడం మొదలయ్యాయి. దీంతో కళాశాల ప్రిన్సిపల్ కు అనుమానం వచ్చి ఫిబ్రవరి నెలలో నిలదీయడం, స్ధానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. విద్యార్ధిని కరోనా కారణంగా ఇంట్లో ఉన్న సమయంలోనే గర్భం దాల్చిందని, ప్రస్తుతం 8వ నెల గర్భవతి అని తేలింది. దీంతో ప్రిన్సిపల్ విద్యార్ధిని కుటుంబ సభ్యులను పిలిచి మొత్తం విషయంపై ఆరా తీసారు.

    ఇది చదవండి: సెకండ్ వేవ్ లో ఇదే గుడ్ న్యూస్... ఒక్కరోజులో 11వేల మంది డిశ్చార్జ్


    దీంతో నిజం ఒప్పుకున్న తల్లిదండ్రులు .. తమ అమ్మాయి గర్భం దాల్చడానికి యువకుడు తమ బంధువేనని, ఇద్దరికీ పెళ్లి చేసేందుకు నిర్ణయించామని చెప్పడంతో విషయం బయటకు రాకుండా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు జాగ్రత్తపడ్డారు. అమ్మాయి ప్రస్తుతం మైనర్ కావడంతో.. మైనారిటీ తీరాక ఇద్దరికీ వివాహం చేసేందుకు అంగీకారానికి అందరూ వచ్చారు. ఇక ఈ మొత్తం విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న గిరిజన సంఘాలు గురుకుల కళాశాల ప్రిన్సిపల్, పోలీసులను కలిసి జరిగిన విషయంపై ఆరా తీశారు. తమ కళాశాలకు చెందిన విద్యార్ధిని గర్భం దాల్చిన విషయం నిజమేనని, విద్యార్థిని తల్లిదండ్రులను పిలిచి విషయం తెలియజేశామని ఆ విద్యార్థిని ఆమె బావే కావడంతో.. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, పెద్దల సమక్షంలో వివాహం చేసుకునేందుకు అంగీకరించారని ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. విషయం తెలియగానే.. ఆ విద్యార్ధినిని కళాశాల నుంచి పంపించేసామని చెప్పారు.

    ఇది చదవండి: కరోనా టైమ్ లో ఇతడే రియల్ హీరో... చిన్నవాడైనా పెద్దమనసు...


    ఘటన జరిగి కొన్ని నెలలు అవుతుందని, ప్రస్తుతం విద్యార్ధిని 8 నెల గర్భవతి అని, విషయం తెలుసుకుని.. తాము వెళ్లి ప్రిన్సిపల్ ను కలిస్తే తప్ప విషయం బయటకు రాకుండా దాచిపెట్టారని మండిపడుతున్నారు గిరిజన సంఘాల నేతలు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడంతో వివరాలు మీడియాకు చేరాయి. ఈ గురుకులంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయిని, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది విద్యార్ధినులను పట్టించుకోవడం లేదంటూ గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని ప్రేమ పేరుతో వంచించి గర్భం చేసిన ఘటన కూడా చోటుచేసుకుందని గిరిజన సంఘాల నేతలు చెబుతున్నారు. ఆ తరువాత ఆ ఉపాధ్యాయుడికి, అదే అమ్మాయితో వివాహం జరిగిందని, ఉద్యోగం పోయిందని గిరిజన సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.

    ఇది చదవండి: అత్తతో అల్లుడి ఎఫైర్.. ఇది తెలిసిన మామ ఏం చేశాడంటే..!


    ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నా, విద్యార్థుల పర్యవేక్షణలో విఫలమైన పట్టించుకోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. గతంలో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని గతంలో ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకున్న ఘటన తెలిసిందేనని.. ప్రిన్సిపల్, ఇతర సంక్షేమ అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published: