VISAKHAPATNAM INSPIRATIONAL MAN WHO STANDS AS AN IDEAL PERSON OVERCOMING DISABILITY NGS VSJ NJ
Inspiration story: 6 ఏళ్లకే పోలియో.. ఇప్పుడు రూ. 25కోట్ల టర్నోవర్ బిజినెస్..! ఎలా సాధ్యమైందంటే?
చిన్నప్పుడో పోలియో.. అయినా ఎందరికో ఆదర్శం
nspiration story: ఆరేళ్లకే కష్టాలు అంటే ఏంటో తెలిసి వచ్చాయి. మహమ్మారి పోలియోతో అంగవైకల్యం వెంటాడింది. అయితే అందరిలా జీవితం ముగిసిపోయింది అనుకోలేదు.. ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.. కొందరికి ఉపాధి కల్పిస్తున్నాడు.
S jagadesh, visakhaptnam, News 18. Inspiration story: జీవితంలో ఎన్నో అటు పోట్లు ఎదుర్కొన్నాడు. అతి చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించాడు.. అయితే గెలుపు తలుపు తెరవాలని పట్టుదలతో ఎదిగాడు.. కష్టపడాలన్న తపన ఉంటే చాలు, వయస్సుతో పనిలేదు, పైగా ఆ తపన మరింత బలంగా ఉంటే అంగవైకల్యం ఉన్న, కష్టమైన పనిని ఇష్టంగా చేయవచ్చునని నిరూపిస్తున్నాడు నర్నీపట్నం (Narsipatnam)కు చెందిన లాలం రాజు (Lalam Raju).రెండు కాళ్ళు లేకున్నా కోట్లలో బిజినెస్ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. విధి వంచించినా కూడా దృఢ సంకల్పంతో జీవితాన్ని జయించిన లాలం రాజు..నేటి తరానికి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కు చెందిన 45 ఏళ్ల లాలం రాజు కు పుట్టిన ఆరు నెలల వరకు అవయవాలన్నీ సక్రమంగానే ఉన్నాయి.
తరువాత పోలియో (Polio) మహమ్మారి అతని జీవితాన్ని చిదిమేసింది. రెండు కాళ్లు చచ్చుబడి అచేతనంగా మారాయి. మంచానికే పరిమితమైన అతని తల్లి ఎత్తుకొని పాఠశాలకు తీసుకు వెళ్ళేది. అలా అతను ఇంటర్ (Intermediate) వరకు విద్యాభ్యాసం చేశాడు. నాన్న, అన్నయ్య సహకారంతో బిజినెస్‌లో తొలి అడుగు అంగవైకల్యం శరీరానికే కానీ గుండెకు కాదని తన, గుండె దైర్యంముతో వ్యాపారం చేయాలనుకున్నాడు.
ఓ వ్యాపారం (Business) పెడితే తమ జీవనానికి బాగుంటుందని, మంచి గుర్తింపు వస్తుందని అన్నయ్య , నాన్న సహకారం తో మొదట్లో చిన్న చికెన్ పాయింట్ ప్రారంభించాడు. దానికి జయశ్రీ చికెన్ పాయింట్ అని పేరు పెట్టాడు లాలంరాజు. అతని సంకల్పబలం ముందు అంగవైకల్యం దాసోహం అయింది. ఇప్పుడు నర్సీపట్నంలో ఏ రెస్టారెంట్ కి అయినా తానే చికెన్ సప్లై చేసే విధంగా లాలంరాజు ఎదిగాడు. రాజు ఇప్పుడు వంద మందికి పైగా ఉపాధి కల్పించి, వారికి జీవనోపాధి కల్పించాడు. సంవత్సరానికి 25 కోట్లు టర్నోవర్ సాగిస్తున్నాడు. పోలియో వచ్చి కాళ్ళు చచ్చుపడిపోయాయని బాధ పడకుండా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని అతనికి ఉన్న దృడ సంకల్పంతో ఇంత స్థాయికి చేరుకున్నాడు రాజు.
అతను నడవలేడు ప్రత్యేకంగా ఒక వ్యక్తి మోయడానికి ఉంటాడు. అన్ని లావాదేవీలు తానే దగ్గర ఉండి మరి చూసుకొని ఇంటికి వెళతాడు. ఊరి దాటి బయటకు వెళ్తేనే కారు.. లోకల్‌గా తన స్కూటర్‌నే వాడుతున్న రాజు లాలం రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నర్సీపట్నం దాటి బయటకు వెళ్లాలంటే తనకున్న కారు వాడతారు. లోకల్‌గా తిరగడానికి మాత్రం తనకున్న స్కూటర్‌నే వాడతారు.
కోళ్లను ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి బొలేరో వాహనాలు, మినీలారీలు తానే సొంతంగా కొన్నాడు. వికలాంగుల కోటాలో బాడీ బిల్డింగ్‌లో అవార్డులు పొందాడు. వ్యాపారం పక్కన పెడితే శరీర దృఢత్వం , బాడీ బిల్డింగ్ లో కూడా తనకంటూ ఓ గుర్తింపు సాధించాడు.. వికలాంగులు కోటాలో కూడా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనవచ్చు అని విషయం తెలుసుకున్న రాజు శరీర దృఢత్వం మీద దృష్టిపెట్టాడు. ఇప్పటికే మూడు రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఇటీవల ప్రమాదవశాత్తు చేయికి దెబ్బ తగలడంతో బాడీ బిల్డింగ్ పోటీలకు విరామం ఇచ్చాడు. తనతో పాటు మరో నలుగురికి సాయపడటమే జీవితం అంటున్నాడు లాలం రాజు. అదే స్ఫూర్తితో ఆర్మీకి వెళ్లాలనుకునే కొందరికి ఆర్థికంగా సహాయం చేశాడు. చదువుకోవాలని ఉన్నా..ఆర్థికంగా వెనకబడిన వారికి సైతం తనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నాడు. అన్ని అవయవాలు ఉండి పని చేయలేని వారికి లాలం రాజు ఒక ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.