No Humanity: సమాజంలో స్వార్థం పెరిగిపోతోంది. పక్కవారు ఏమైతే నాకేంటి అనే భావన పెరిగిపోతోంది. అయ్యో పాపం.. అనే మాటే మరిచిపోతున్నారు. మనం మనుషుల.. ఒక మనసు ఉంటుంది. ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలనే సంగతి కూడా పక్కన పెట్టేస్తున్నారు. మానవత్వం (Humanity) నశించిది అని చెప్పడానికి నిత్యం ఎన్నో ఉదహరణలు కనిపిస్తుంటాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పార్వతీపురం మన్యం జిల్లా (Parvatipuram Manyam District) లో అమానవీయం (Inhumanity) ఘటన చోటు చేసుకుంది. మరణించిన ఒక వృద్ధురాలి దహన సంస్కారాలు (Cremation) నిర్వహించటానికి స్మశానానికి వెళ్లిన కుటుంబ సభ్యులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దహన సంస్కారాలు నిర్వహించటానికి వీల్లేదంటూ వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే. పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొమరాడ మండలం కొత్తకల్లి కోట గ్రామం నాగావళి నది ఉప్పొంగటంతో నాగావళి వరదలతో వరద ముంపులో చిక్కుకుంది. ఇదే సమయంలో ఆ గ్రామంలో ఓ వృద్ధురాలు మరణించింది. ఇక మరణించిన వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించడానికి వీలులేని పరిస్థితి స్మశానం పూర్తిగా వరదలో చిక్కు కుంది. అక్కడ దహన సంస్కారాలు చేయడానికి ఏ మాత్రం అనుకూలంగా లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు కుటుంబ సభ్యులు.
ఇదీ చదవండి : ఏపీ మాజీ మంత్రికి కేజీఎఫ్ డైరెక్టర్ ఏమవుతాడో తెలుసా? ప్రశాంత్ నీల్ అసలు పేరేంటంటే?
ఏం చేయాలని మధనపడుతున్న సమయంలో కొందరు.. పక్క ఊరిలో దహన సంస్కారాలు చేయాలి అని సలహా ఇచ్చారు. దీంతో మరణించిన వృద్ధురాలి మృత దేహానికి దహన సంస్కారాల కోసం ఆమె బంధువులు, గ్రామస్తులు పాత కల్లికోట స్మశాన వాటికకు వెళ్లారు. అయితే ఆ విషయం స్థానికులకు తెలియడంతో.. వారంతా స్మశాన వాటికికకు చేరుకున్నారు. మీ ఊరి మృతదేహాన్ని.. మా ఊరిలో దహనం చేయడం ఏంటని నిలదీశారు.. అందుకే మత గ్రామం ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోదన్ని భీష్మించారు.
ఇదీ చదవండి : పిడుగుపాటుతో నలుగురు కూలీల దుర్మరణం.. ఆ సమయంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?
మొదట అక్కడికి వచ్చిన బంధువులు.. ఆ గ్రామస్థులను ఒప్పించే ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోలేదు.. ఘర్షణకు దిగారు. దీంతో రెండు గ్రమాల మధ్య ఘర్ణణ పెద్దదైంది. పక్క గ్రామం వారు తమ గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించడానికి వీల్లేదని పాత కల్లికోట గ్రామస్తులు, కొత్త కల్లికోట గ్రామస్తులను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. శవాన్ని తమ గ్రామంలోని స్మశానవాటికలోకి అనుమతించేది లేదని పాత కల్లికోట గ్రామస్తులు, మృతదేహాన్ని వెనక్కి తీసుకు వెళ్ళేది లేదని, అక్కడే వదిలి పెట్టి వెళతామని కొత్త కల్లికోట గ్రామస్తులు గొడవకు దిగారు.ఇక శవాన్ని పక్కన పెట్టి ఇరు గ్రామాల ప్రజలు గొడవకు దిగటంతో గందరగోళం నెలకొంది.
ఇదీ చదవండి : ఏపీలో అధికారం ఆ పార్టీదే.. జాతీయ ఛానెల్ సంచలన సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?
దీంతో చాలాసేపటి వరకు ఆ మృతదేహం అక్కడే ఉంచాల్సి వచ్చింది. ఒకర్ని ఒకరు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. అయితే సమచారం స్థానిక అధికారులకు వరకు వెళ్లింది. వెంటనే అక్కడ చేరుకొని.. చొరవ తీసుకొని ఇరు గ్రామాల వారితో మాట్లాడారు. వరద ముంపుకు గురైన కొత్త కల్లికోట గ్రామంలో పరిస్థితిని వివరించి, వారికి సర్దిచెప్పి, అధికారుల సమక్షంలో పాత కల్లికోట గ్రామంలో వృద్ధురాలి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇదీ చదవండి : వైసీపీ-జనసేన మధ్య పేలుతున్న పంచ్‌లు.. కేటీఆర్ ట్వీట్ తో ప్రారంభం.. రంభల రాంబాబు అంటూ బండ్ల ఎంట్రీ
ఇరుగు పొరుగు గ్రామాలు కష్టాల్లో సహాయం చేసుకోవాలని చెప్పిన అధికారులు ఒక గ్రామంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, పొరుగు గ్రామ ప్రజలు కాస్త సహకారం అందిస్తే, ఒకరికొకరు చేదోడువాదోడుగా నిలిస్తే బాగుంటుందని, వారి గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటే, ఈ గ్రామానికి ఎందుకు వస్తారు అని అధికారులు పాత కల్లికోట గ్రామస్తులకు నచ్చజెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizianagaram