హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Power Holiday: పరిశ్రమలు మూత పడాలి అనుకుంటున్నారా..? ప్రభుత్వ నిర్ణయంతో పారిశ్రామిక వేత్తల ఆందోళన

Power Holiday: పరిశ్రమలు మూత పడాలి అనుకుంటున్నారా..? ప్రభుత్వ నిర్ణయంతో పారిశ్రామిక వేత్తల ఆందోళన

ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టం రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగిందని నివేదిక పేర్కొంది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించాయి. ఇది నేరుగా ఈ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. అయితే వాటితో పోలిస్తే టారిఫ్‌లను పెంచడంలో వారు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టం రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగిందని నివేదిక పేర్కొంది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించాయి. ఇది నేరుగా ఈ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. అయితే వాటితో పోలిస్తే టారిఫ్‌లను పెంచడంలో వారు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Power Holiday:ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కష్టాలతో ఆర్థిక నష్టాలు తప్పేలా లేదు. ముఖ్యంగా పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడంతో పారిశ్రామిక వేత్తలు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కరోనా కష్టాలతో నష్టాల్లో పరిశ్రమలు నడిచాయని.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సమయంలో పరవ్ హాలిడే అంటే.. నడిపేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...

    Power Holiday: విశాఖ (Visakha) అంటే కేవలం పర్యాటక ప్రాంతమే కాదు.. ఇండస్ట్రియల్, ఐటీ హబ్ గా కూడా గుర్తింపు పొందింది. అయితే విశాఖను గత రెండేళ్లుగా ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి ( కారణంగా కుదేలై.. ఇప్పుడిప్పుడే విశాఖ పారిశ్రామిక రంగం కుదుటపడుతోంది. ఇలాంటి సమయంలో ఏపీఈడీసీఎల్ (APEPDCL) తాజా నిర్ణయం కలవరానికి గురి చేస్తోంది. దీంతో పారిశ్రామిక వేత్తలు, కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం పవర్ హాలిడే (Power Holida)పై తమను సంప్రదించకుండా అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై పారిశ్రామికవేత్తలు (Industrialists) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భారీస్థాయిలో ఆందోళనలను సిద్ధమవుతున్నారు. అయితే గత కొంతకాలంగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అనధికారికంగా కోతలు తప్పడం లేదు. కానీ ఇప్పుడు అధికారికంగా కోతలు అమలులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా విద్యుత్‌ కొరత వున్న నేపథ్యంలో గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు 24/7 సరఫరా ఇస్తూ పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ అమలు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా నిరంతరాయంగా నడిచే పరిశ్రమలన్నీ వారి విద్యుత్‌ డిమాండ్‌లో 50 శాతం మాత్రమే వినియోగించాలని అధికారులు ఆదేశించారు. అలాగే మిగిలిన పరిశ్రమలు వారానికి ప్రస్తుతం ఇస్తున్న ఒక రోజు సెలవుకు అదనంగా మరోరోజు సెలవు ప్రకటించాల్సి వస్తుంది. అంటే తాజా పరిస్థితుల నేపథ్యంలో రోజుకు ఉత్పత్తి మూడో వంతుకు తగ్గించుకోవాల్సి ఉంటుందని పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెస్తున్నారు.

    ఈ పవర్ హాలిడే ఉమ్మడి విశాఖ జిల్లాపై అధిక ప్రభావం పడుతోంది. దీంతో విశాఖలో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విశాఖ ఆటోనగర్ లో పవర్ హాలిడేపై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమై తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. పారిశ్రామికవేత్తలను సంప్రదించకుండా ప్రభుత్వం ఆకస్మాత్తుగా పవర్ హాలీడే ప్రకటించడాన్ని పారిశ్రామిక వేత్తలు తప్పుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, ఏపీఈపీడీసీఎల్ అధికారులను కలిసి పవర్ హాలిడే నుండి కొంతైనా సడలింపు కోరుతూ రిప్రజి౦టేషన్ ఇవ్వాలని విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది.

    ఇదీ చదవండి : సొంతవారిని కూడా బలితీసుకుంటున్న అధికార పార్టీ.. చంద్రబాబు బహిరంగ లేఖ

    విశాఖలోని ఆటోనగర్, పరవాడ, క౦చరపాలె౦, గంభీరం లలో పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ఆటోనగర్ లోనే 12వ౦దల వరకు పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ పదివేల మ౦దికి పైగా సిబ్బంది ఉపాధి పొ౦దితున్నారు. ఇక అనకాపల్లి సబ్‌ డివిజన్‌లో బుధవారం, అచ్యుతాపురం, పాయకరావుపేట, ఎలమంచిలి సబ్‌ డివిజన్లకు గురువారం; జోన్‌-2 డివిజన్‌కు శుక్రవారం, జోన్‌-1, జోన్‌-3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లకు శనివారం పవర్ హాలిడే ప్రకటించారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే.. పరిశ్రమలు నడిచే పరిస్థితి ఉండదని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు.

    ఇదీ చదవండి : చంద్రబాబుకు ఆ సమస్య.. దేవుడు కరుణిస్తే వచ్చే ఎన్నికల వరకు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు

    విద్యుత్ కు బదులు ప్రత్యామ్నాయంగా జనరేటర్ల సాయంతో కంపెనీ నిర్వహిద్దామన్న పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో అది సాధ్యం కాదంటున్నారు పారిశ్రామిక వేత్తలు. పారిశ్రామిక వేత్తల ఆందోళన ఎలాగున్నా.. ఈపీడీసీఎల్‌ పరిధిలో ఎమర్జన్సీ లోడ్‌ రిలీఫ్‌ను ఈ నెల 22వ తేదీ వరకు అమలు చేయాలని నిర్ణయించింది. ఆ తరువాత పరిస్థితులను బట్టి మార్పులు, కొనసాగింపు ఉంటుందని అధికారులు తెలిపారు. మరి పారిశ్రామిక వేత్తలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Power cuts, Power problems

    ఉత్తమ కథలు