Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM INDIAN NAVY MUSEUM IN VISAKHAPATNAM HAS MODELS OF NAVAL SHIPS AND SOME NAVAL GUNS AND WEAPONS NGS VSJ NJ

Navy Museum: మ్యూజియంలలో ఈ మ్యూజియం వేరయా..? అక్కడికి వెళ్తే సరికొత్త అనుభూతి

ఆకట్టుకుంటున్న

ఆకట్టుకుంటున్న నేవీ మ్యూజియం

Navy Museum: నేవి కమాండర్స్‌ ఎలా ఉంటారు? సముద్రంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్‌ అవుతారు..? ఇలా మనకు తెలియని ఎన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే.. నేవీ మ్యూజియంకు వెళ్లాల్సిందే..? దీని ప్రత్యేకత ఏంటంటే..?

  Setti Jagadeesh, News 18, Visakhaptnam.

  Navy Museum: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందులో అత్యంత ప్రసిద్ధి చెందింది విశాఖపట్నం. అయితే అందాల సువిశాల సముద్ర తీరం ఉన్న విశాఖ నగరంలో ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. వీటికి తోడు ఎన్నో మ్యూజియాలు (Museum) కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. అందులో నావల్ మ్యూజియం (Navy Museum) అన్ని వయసుల వారు ఇష్టపడే మ్యూజియంలలో ఒకటి. భారతీయ సముద్ర నౌకాదళం అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని ఈ మ్యూజియం మనకు అందిస్తుంది. 260 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖపట్నం (Visakhapatnam) ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందింది. వైజాగ్‌  (Vizag) నగర చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు పలు రికార్డులను భద్రపరిచే పనిని చేపట్టింది. అందులో భాగంగా టూరిస్టులను అట్రాక్ట్‌ చేసేందుకు విశాఖ మున్సిపల్‌ కార్పోరేషన్‌(VMC) వైజాగ్‌ బీచ్‌ రోడ్‌లో కొన్ని మ్యూజియాలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటే ఈ నేవీ మ్యూజియం.

  నేవీ మ్యూజియం
  సముద్రంలోని నౌకల పనితీరు ఎలా ఉంటుంది? కళింగ ఆంధ్ర ప్రాంతంలోని చారిత్రక సంపద, కళాఖండాలను చూడాలనుకున్న వారికి వెల్‌కమ్‌ చెబుతోంది RK బీచ్ రోడ్డులో ఉన్న విశాఖ మ్యూజియం. ఒకప్పుడు బీచ్ రోడ్డులో శిథిలమైన డచ్ బంగ్లా, దానిని పునర్నిర్మించి గొప్ప ప్రాముఖ్యత కలిగిన మ్యూజియంగా మార్చారు.

  ఇదీ చదవండి : రేపు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని, అమిత్ షా లతో భేటీ.. అజెండా అదేనా..?

  మ్యూజియం లోపల!
  1989లో ప్రారంభించబడిన ఈ నౌకాదళ మ్యూజియంలో అనేక రకాలైన యుద్ధనౌకలు, తుపాకులు, ఆయుధాలు, యూనిఫారాలు. ఇతర పరికరాల నమూనాలు ఉన్నాయి, ఇవి భారత నౌకాదళం గురించి లోతైన జ్ఞానాన్ని అందిస్తాయి. అంతే కాకుండా, ఈ మ్యూజియంలో హరప్పా, సింధు లోయ, లోథల్ నాగరికతలకు చెందిన అనేక కళాఖండాలు కూడా ఉన్నాయి. ఈ మ్యూజియంలో సముద్ర చరిత్ర, నౌకాదళ ఆర్కైవ్‌లు, అక్వేరియా, ఓషన్ రిసోర్సెస్, తూర్పు సముద్ర తీర స్థాపనలు, ఓడరేవులు అనే ఐదు విభాగాలు ఉన్నాయి.

  ఇదీ చదవండి : పనస తొనలతో వీర్య వృద్ధి... సంతాన భాగ్యం.. ఆంధ్రా పనసకు ఫుల్ డిమాండ్.. ఎందుకంటే?

  జలాంతర్గాముల చిత్ర ప్రదర్శన
  అనేక యుద్ధాలలో ఉపయోగించిన జలాంతర్గాముల గురించి మరింత తెలుసుకోవడంలో మీకు సహాయపడే అనేక ఆసక్తికరమైన చిత్రాలను కూడా మీరు చూడవచ్చు.ఈ నేవల్ మ్యూజియం నావికాదళ నౌకలకు సంబంధించిన సమాచార కేంద్రం.నావల్ మ్యూజియాన్ని సందర్శించడానికి, ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.30 ప్రవేశ రుసుము చెల్లించాలి.

  ఇదీ చదవండి : తీయగా ఆహ్వానం.. తరువాత బెదిరింపులు.. మాసాజ్ మాఫియాకు యువకుడి బలి

  మ్యూజియం టైమింగ్స్‌
  వారంలోని అన్ని రోజులలో ఈ మ్యూజియం తెరిచే ఉంటుంది. ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు దీన్ని పర్యాటకుల కోసం తెరిచి ఉంచుతారు. పర్యాటకులు ఒక్కసారి లోపలికి వెళితే అక్కడ ఉన్న వాటిని చూస్తూ బయటకు రావడానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది.

  ఇదీ చదవండి : ఆయన మాయల పకీర్.. ఈయన తాగుబోతు.. టీడీపీ నేతలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

  నావల్‌ / స్వర్ణ జ్యోతి మ్యూజియం
  ముఖ్యంగా నావల్ మ్యూజియం లేదా స్వర్ణ జ్యోతి మ్యూజియంగా అధికారికంగా గుర్తింపు పొందిన ఇది చరిత్ర ప్రియులకు మాత్రమే కాకుండా నౌకాదళ ప్రేమికులకు కూడా ఒక అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. విశాఖపట్నంలోని ENC కాంప్లెక్స్‌లో ఉన్న ఈ మ్యూజియం ఇండియన్ నేవీకి అంకితం చేశారు.

  ఇదీ చదవండి : మాజీ మంత్రి గంటా పయనం ఎటు..? మహానాడుకు ఎందుకు డుమ్మా కొట్టారు..?

  ఎలా వెళ్లాలంటే..?
  వైజాగ్ RK బీచ్‌ రోడ్డులోనే ఈ మ్యూజియం ఉంది. బీచ్‌లో ఎంజాయ్‌ చేయడానికి వచ్చే పర్యాటకులు సాయంత్రం సమయంలో ఈ మ్యూజియాన్ని సందర్శిస్తూ ఉంటారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు