• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM IN VISAKHAPATNAM NAVAL MARCHENT SEA MAN COMMITTED SUICIDE IN COVID HOSPITAL NGS

Andhra Pradesh: కరోనా చికిత్స పొందుతూ నేవి ఉద్యోగి ఆత్మహత్య. కారణం తెలిసి పోలీసులకు షాక్

Andhra Pradesh: కరోనా చికిత్స పొందుతూ నేవి ఉద్యోగి ఆత్మహత్య. కారణం తెలిసి పోలీసులకు షాక్

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సోకి కొందరు మరణిస్తున్నారు. భయంతో మృతి చెందుతున్నవారు కొందరు. మరికొందరు కరోనా సోకిందనే మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా సెకెండ్ వేవ్ వైరస్ ఏపీలో పెను విషాదం నింపుతోంది.

  • Share this:
    కరోనా కలకలం రేపుతోంది. తీరని విషాదం నింపుతోంది. కరోనా వైద్యం అందక కొందరు. సరైన సమయానికి చికిత్స చేయకపోవడంతో మరికొందరు. ఆక్సిజన్ కొరతతో మరికొందరు. కరోనా తీవ్ర ప్రభావం కారణంగా కొందరు.. ఇలా చాలామందిని బలి తీసుకుంటోంది. గతంతో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ మరింత ప్రమాదకారిగా మారింది. మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇదే సమయంలో కరోనా నిర్ధారణ అని తెలియడంతో భయపడి గుండెపోటుకు గురై మరణిస్తుంటే.. మరికొందరు మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి విషాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా కరోనా చికిత్స పొందుతూ ఓ యువకుడు ఆస్పత్రిలోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. మర్చంట్‌ నేవీలో సీ మెన్‌గా పనిచేస్తున్న సునీల్‌కు ఇటీవల కరోనా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఎక్కువగా ఉండడంతో అతడ్ని విశాఖ కలెక్టరేట్‌ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు బంధువులు. అయితే ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి అతడు తీవ్ర మనాసిక క్షోభలో ఉన్నట్టు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. అయితే కరోనా సోకిందనే భయంతో అలా ఉంటున్నాడని ఎవరూ పట్టించుకోలేదు.

    కానీ అనుకోని ఘటన ఆస్పత్రిలో చోటు చేసుకుంది. చికిత్స పొందుతున్న స్థానంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆస్పత్రి సిబ్బంది యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే సునీల్ కొద్ది రోజులుగా ఓ అమ్మాయి విషయంలో వేధింపులు ఎదుర్కొంటున్నట్టు అతడి స్నేహితులు బంధువులు చెబుతున్నారు. ప్రేమించిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావించిన.. తిరిగి వేధిస్తున్నట్టు ఆమె సునీల్‌పై కేసు పెట్టిందని అంటున్నారు. దీంతో ఇప్పటికే తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనయ్యాడని.. అదే సమయంలో కొవిడ్‌ రావడంతో మరింత మనోవేదనకు గురయ్యాడని సునీల్‌ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.

    అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కరోనా రోగులకు అక్కడ చికిత్స అందిస్తున్నారంటే నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. కానీ చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నా ఎవరూ ఎందుకు గుర్తించలేకపోయారు అన్నది అనుమానంగానే ఉంది. దీంతో నిజంగానే అమ్మాయి వేధింపుల కారణంగా ఒత్తిడికి గురయ్యాడా? వైద్య సిబంది వేధింపులు ఏమైనా ఉన్నాయా? వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: