Setti Jagadeesh, News 18, Visakhaptnam
Banana Crop damaged: అక్కడ ఎప్పుడు అరటి పంట (Banana Crops) వేసిన అన్నదాతకు లాభాల పంట పండించేది.. కానీ ఏడాది అరటి రైతులకు చేదు అనుభవాలను మిగులుస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి లాభాలు వస్తాయని అన్నదాతలు (Farmers) ఆశ పడ్డారు. కానీ తీవ్ర నష్టాలకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా (Anakapalli District) లో ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో.. పంటకు నష్టాలు తప్పలేదు. ముఖ్యంగా ఈదురు గాలులతో పంట పూర్తిగా దెబ్బ తింది. పోనీ దెబ్బ తిన్న గెలలను వదిలేసి.. మిగిలిన అరటి గెలలు అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా అరటి పంట ఆశించినంతగా రైతులకు లాభాలు అందివ్వడంలేదు. నర్సీపట్నం మండలం (Narsipatnam Mandal) నుండే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా అరటి గెలలు సరఫరా అవుతాయి. ఈ జిల్లాలో ఎవరికి అవసరం వచ్చినా నర్సీపట్నం వెళ్లాల్సిందే.. కానీ ఇటీవల అకాల వర్షాలకు తక్కువ పంట రావడంతో కొనుగోలుదారులకు కావలసినంత సరుకు ఎగుమతి చేయలేకపోతున్నారు. దీంతో ఈ గ్రామాల్లో పంట లేదనే ప్రచారం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఈ గ్రామాలకు కొనుగోలుదారులు రావడం తగ్గుముఖం పట్టారు.
ద్విచక్రవాహానాలపై పంట అమ్ముతున్న రైతులు
కొనుగోలుదారులు తమ ప్రాంతానికి రాకపోవడంతో పండిన కొద్ది పంటనైనా అమ్ముకోవాలని రైతులు అరటి గెలలను ద్విచక్రవాహనాలపై తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. మరి కొంతమంది శుభకార్యాలు ఎక్కడ జరిగితే అక్కడకి వెళ్లి స్వయంగా అమ్ముకునే పరిస్థితి. ఇంకా మిగిలిన పంటను దళారులు తమకు నచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
450 నుంచి 250 రూపాయలకు పడిపోయిన రేటు
ఒక్కో గెల 12 నుంచి 15 కిలోల వరకు ఉంటుంది. దీని ధర గతంలో .400 నుంచి 450 రూపాయల వరకు పలికేది. ఈ ఏడాది కనిష్ఠంగా 250 రూపాయలకు ధర పడిపోయింది. సగానికి తక్కువ ధర పలకడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో ఎక్కువ పంట ఉండటంతో ఇతర ప్రాంతాలకు ఇక్కడి అరటి పంటను తరలించేవారు.
ఇదీ చదవండి : సేవ చేసే అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు.. మూడేళ్ల పాలనపై సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్
ప్రకృతి వైపరీత్యాల వలన భారీ నష్టం
ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ పంటకు నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఈ పరిహారం కూడా అంతంతమాత్రమే. 33 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట దెబ్బతింటేనే ఈ పరిహారం వర్తిస్తుంది. ఈ ఏడాది కొంత మోతాదులో పంట దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కల చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే రైతులు చెప్పిన ప్రకారం ఈ నష్టం ఇంకా ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. తమను ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని అరటి రైతులు కోరతున్నారు.
ఇదీ చదవండి : ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే చాలదా? అభివృద్ధి చేయాలా? మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్
క్షేత్రస్థాయిలో పరిశీలించాకే...
ఏప్రిల్, మే నెలల్లో ఈదురుగాలులు, అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేశారు. ఉద్యాన అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం సబ్సిడీ మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Farmers, Visakhapatnam