VISAKHAPATNAM IN TOURIST CITY VISAKHAPATNAM MD TREATS BAKERY IS THE BEST PLACE FOR FOOD LOVERS JUST TRY IT HOW TO GO NGS VSJ NJ
Best Place for Food Lovers: మిస్ మాక్‌టైల్… ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నయువతి..! ప్రత్యేకత ఏంటంటే?
మాక్టైల్స్..!
Best Place for Food Lovers: ఫుడ్ లవర్స్ ఎప్పుడు కొత్త కొత్త రుచులను ఆహ్వానిస్తారు.. కేవలం రుచిలోనే కాదు.. తయారీ విధానం కూడా కొత్తగానే ఉండాలి అనుకుంటారు. కొత్తదనం కోరుకునే ఫుడ్ లవర్స్ కు.. అందాల సాగర తీరంలో ఉన్న ఆ బేకరీ ఆహ్వానం పలుకుతోంది. అక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసా..?
MB Treats Bakery: ప్రపంచవ్యాప్తంగా వ్యాపారంలో మహిళల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మారుతుంది. ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితం అనే భావన నుంచి.. ఇప్పుడు విశ్వప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే స్థాయికి చేరుతున్నారు. అలాంటి వారిలో ఒకరే ఎంబీ ట్రీట్స బేకరి (MB Treats Bakery) ఓనర్ భార్గవి. విశాఖపట్నం (Visakhapatnam)కి చెందిన టి. భార్గవి (Bhargavi) హోటల్ మేనేజ్మెంట్ ( Hotel management) కోర్సు చేసింది. ఆ తర్వాత పలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా తన మనసులో ఏదో వెలితి. సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఎప్పుడూ తపనపడుతూ ఉండేది. దానికి ఈ జాబ్ సరైన దారి కాదు అనుకుంది. తాను చేస్తున్న కొలువుకు సలాం కొట్టి.. తానే స్వయంగా బిజినెస్ (Business) స్టార్ట్ చేసింది.
బిజినెస్ మొదలుపెడితే తన లక్ష్యంతో పాటు మరొకరికి ఉపాధి కల్పించవచ్చని ఆలోచించింది. ఏ వ్యాపారం పెట్టాలని నెల రోజులు పాటు కొందరిని సలహాలు అడుగుతూ, యూట్యూబ్ (Youtube) లో కూడా చూసింది. ప్రస్తుత యూత్ వెరైటీ, కొత్తదనం కోరుకుంటున్న తరుణం లో మిల్క్ సేక్స్(Milk shakes), మాక్ టైల్ (Mocktails) యూత్ ఎక్కువ సేవిస్తున్నారని గ్రహించిన భార్గవి.. అదే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంది. కానీ, ఆ వ్యాపారం పెట్టడానికి వైజాగ్ లాంటి సిటీలో చాలా ఖర్చవుతుంది. తన దగ్గర పెద్ద మొత్తంలో లేవు. ఆ సమయంలో స్నేహితులు, బంధువుల సహాయంతో 5 లక్షల రూపాయల వరకు సేకరించి ఎంబీ ట్రీట్స్(MB. TREATS) ప్రారంబించింది.
MB TREATSలో జనాల తాకిడి
మిల్క్ షేక్స్కి , మాక్ టైల్స్‌కి అలవాటు పడ్డ యువత ఇప్పుడు సమ్మర్ కావడంతో..ఆ వేడిని తట్టుకునేందుకు వీటిని రోజు తాగుతున్నారు. డిఫరెంట్ డ్రింక్స్‌ను సమపాళ్లలో కలిపి.. అందులో రెండు ఐస్ ముక్కలు వేసి పైన డెకరేషన్‌గా నిమ్మ ముక్కలు పెడుతూ సర్వ్ చేస్తున్నారు. చదువుతుంటుంటేనే నోరూరుతోంది కదా మరి చూస్తే..!
మాక్టైల్స్లో ఎన్నో రకాల ఫ్లేవర్స్‌ను కస్టమర్లకు అందిస్తున్నారు. మాక్టైల్స్ అంటే ఎండీ ట్రీట్స్కు వెళ్లాల్సిందే అనేంతగా పాపులర్ అయింది. పిల్లలైతే ఈ కలర్‌ఫుల్ మాక్‌టైల్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వాటితో పాటు చాక్లెట్స్ , బేకరి ఐటమ్స్ కూడా పెట్టి పిల్లలను, వారితో పాటు వచ్చే కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.
మాక్టైల్స్ మాత్రమే కాదు వెరైటీ కేక్స్..!
ఈ బేకరిలో కేవలం మాక్టైల్స్ మాత్రమే కాదు.. ఎన్నో ఫ్లేవర్స్ తో పసందైన కేకులను తయారుచేస్తారు. ముఖ్యంగా కుకీస్ కూడా చేస్తూ కస్టమర్లకు అన్ని రకాల ఫుడ్స్‌ను అందించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. అందులోనూ ఈ బేకరి ఐటమ్స్‌లో వాడేవన్నీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్సే(Organic Ingredients).
నో కాంప్రమైజ్..!
కస్టమర్లకు వెరైటీ రుచులను అందించడంలో తామెప్పుడు ముందుంటాం అంటుంది భార్గవి. రుచిలో గానీ, క్వాలిటీలో గానీ కాంప్రమైజ్ అవ్వమని..కస్టమర్లను సంతృప్తి పరచడమే తమ లక్ష్యమంటున్నారు భార్గవి.
ప్రజల నుంచి అద్భుత స్పందన
పిల్లలతో వచ్చే ఫ్యామిలీలకు కానీ, ఫ్రెండ్స్ బ్యాచ్‌కి కానీ ఇది మంచి చిట్‌చాట్ స్పాట్. ఇక్కడ ఫుడ్ చాలా క్వాలిటీగా ఉంటుందని..మాక్టైల్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయని కస్టమర్లు చెబుతున్నారు. కస్టమర్లు ఇక్కడకు మళ్లీ మళ్లీ వస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ కానీ, డ్రింక్స్ కానీ వాళ్లకు ఎంతలా నచ్చాయో.
తనతో పాటు మరికొందరికి ఉపాధి
వీలైనంత వరకు తక్కువ ధరలకు అధించే దిశగా ముందు ముందు ప్రణాళికలు రూపొందిస్తామని భార్గవి తెలిపారు. ఈ బిజినెస్ ప్రారంభించిన కొద్దీ నెలల్లోనే ముగ్గురికి ఉపాధి కల్పించింది.
Timings: వారంలో ప్రతి రోజు ఈ MB TREATS బేకరి తెరిచే ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.
Door No: 10, 51-1, Sampath Vinayaka Temple Rd, near Vinis, opposite Road, CBM Compound, Asilmetta, Visakhapatnam, Andhra Pradesh 530003
ఎలా వెళ్లాలి?
విశాఖపట్నం బస్ స్టేషన్‌కు దగ్గరలోనే ఈ బేకరి ఉంటుంది. లోకల్ ఆటోలో లేదా నడుచుకుంటూ కూడా వెళ్లొచ్చు. బస్టాండ్ నుంచి 300 మీటర్లు దూరంలో ఉన్న ఆశిలమెట్ట వద్ద ప్రముఖ దేవాలయం సంపత్ వినాయక ఎదురుగా ఈ ఎమ్.బి ట్రీట్స్ వుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.