హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఇకపై రిషికొండ బీచ్‌లో అడుగు పెట్టాలంటే ఈజీ కాదు..! ఎంట్రీ ఫీ కట్టాల్సిందే..!

Vizag: ఇకపై రిషికొండ బీచ్‌లో అడుగు పెట్టాలంటే ఈజీ కాదు..! ఎంట్రీ ఫీ కట్టాల్సిందే..!

రిషికొండ

రిషికొండ బీచ్‌లో ఎంట్రీ ఫీజు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ‌లోని మంచి పర్యాటక ప్రాంతం విశాఖపట్నం (Visakhapatnam) లోని రుషికొండ బీచ్. ఈ బీచ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంతో నిర్వహించబడుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ‌లోని మంచి పర్యాటక ప్రాంతం విశాఖపట్నం (Visakhapatnam) లోని రుషికొండ బీచ్. ఈ బీచ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంతో నిర్వహించబడుతోంది. అందమైన బీచ్ లలో రుషికొండ బీచ్ (Rishikonda Beach) ఒకటి. ఈ బీచ్ వైజాగ్ (Vizag) నగరంలో ప్రాచూర్యం పొంది పర్యాటకులను, స్థానికులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. రుషికొండ బీచ్‌కు భారతదేశ బ్లూ ఫ్లాగ్ బీచ్స్ మిషన్ నుండి ఎకో లేబుల్ ‘బ్లూ ఫ్లాగ్’ వచ్చింది. దీంతో విశాఖ నగరంలో అన్ని బీచ్ ల కన్నా కూడా ఈ రుషికొండ బీచ్‌ ఇప్పుడు గ్లోబల్ టూరిజం మ్యాప్‌లో స్థానం లభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏపి పర్యాటక అభివృద్ధి సంస్థ 2017లో రుషికొండ బీచ్ నామినేట్ చేయబడగా, 2018 ఫిబ్రవరిలో ఈ బీచ్ ‌ని ఖరారు చేశారు. ఫిట్ ‌నెస్ పరికరాలు, నిరంతరం బీచ్ శుభ్రపరిచే యంత్రాలు, సిసిటివి కెమెరాలు, లైఫ్ గార్డ్లు వంటి భద్రతా పరికరాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ బీచ్ ‌కు అందించబడ్డాయి.

  రుషి కొండ బీచ్‌లో ఈతకొట్టడం, వాటర్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్ వంటి ఆటలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఆడుకోవడానికి ఈ బీచ్ అనువైన ప్రదేశం. వీటితో పాటు అదనంగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఈ బీచ్ చుట్టూ రెస్టారెంట్లు, ఇతర సౌకర్యాలతో ఆకర్షణీయమైన , అందమైన పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుతుంది.

  ఇది చదవండి: రోజా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..! ఎడ్లబండిపై మంత్రి హల్ చల్..

  రుషికొండ బీచ్ ఎప్పుడు పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ఇకపై ఈ బీచ్‌లో అడుగుపెట్టాలంటే ప్రవేశ రుసుం చెల్లించక తప్పదు. ఈ వసూలు విధానం త్వరలో అమలుకానుంది. ఈ బీచ్‌లో ఇప్పటి వరకూ ఇక్కడ కేవలం పార్కింగ్ రుసుం మాత్రమే పర్యాటక అభివృద్ధి సంస్థ వసూలు చేస్తున్నారు. అయితే ఇకపై ఇవన్నీ మారనున్నాయి. బీచ్ నిర్వహణపై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) త్వరలో ఈ తీర ప్రాంత బాధ్యతను అంతా ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించనుంది. దీనికి సంబంధించి టెండర్‌ ప్రకటన గత శుక్రవారం అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు.

  ఇది చదవండి: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పురమందిరం..! దీని హిస్టరీ తెలిస్తే షాకవ్వాల్సిందే..!

  'బ్లూ' ఫాగ్ గుర్తింపు ఉన్న ఈ రుషి కొండ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యాటకులను ఆకట్టుకునే స్థాయిలో ప్రమాణాలు పాటించాలి. ఏపీటీడీసీ ఈ బీచ్ కి సంబంధించి నిర్వహణ చేపట్టడంలో విఫలమవుతోంది. ప్రతి ఏటా భారీగా వ్యయం అవుతున్నా ఆ బీచ్ లో తగిన ప్రమాణాలు పాటించలేకపోతోంది. అందుకే ఆదాయం చేకుర్చుకునేలా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని పర్యాటకశాఖ నిర్ణయించుకుంది.

  ఇది చదవండి: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట..!

  ఇప్పుడు ఈ బీచ్ వద్ద పార్కింగ్ రుసుం కింద ద్విచక్ర వాహనాలకు రూ. 10, కార్లకు రూ.30, బస్సులకు రూ.50 వసూలు చేస్తున్నారు. గతంలో బ్లూఫ్లాగ్ బీచ్ ను బీవీజీ అనే సంస్థ నిర్వహించే సమయంలో టాయిలెట్స్‌, దుస్తులు మార్చుకునే రూమ్స్‌కు డబ్బులు వసూలు చేసేవారు. తదుపరి ఏపీటీడీసీ నిర్వహణ బాధ్యత స్వీకరించాక కూడా డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఈ వసూలు పై అప్పట్లో పర్యాటకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

  ఈ బీచ్ నిర్వహణ కోసం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఎంత రుసుములు విధిస్తారోననే చర్చ సాగుతోంది. బీచ్ ప్రైవేటీకరణ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే మంచిగా బీచ్ ‌లను అభివృద్ధి చేయాలని పర్యాటకులు, నగరవాసులు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు