Setti Jagadesh, News18, Visakapatnam
శీతాకాలం ప్రారంభంతో అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju District) లోని మన్యం ప్రాంతం అంతా పర్యాటకులతో కిటకిటాలాడుతోంది. పాడేరు ఏజెన్సీ లో వుండే వంజంగి కొండ (Vanjangi Hill) మేఘాల కొండగా బాగా పేరొందింది. ప్రతి ఏటా ఈ శీతాకాలంలో ఏజెన్సీలోని అన్ని పర్యాటక ప్రాంతాలు కూడా పర్యటకులతో సందడి సందడిగా ఉంటుంది.
వంజంగి కొండలు లో వేకువ జామున అక్కడ కురిసే దట్టమైన పొగ మంచుకి గిరి శిఖరాలు పాల సముద్రాన్ని తలపిస్తుంటాయి. సూర్యోదయం మెుదలు అక్కడి కొండలపై ప్రకృతి అందాలకు పర్యటకులు మైమరిచి పోతుంటారు. పైగా ఆయా దృశ్యాలను మొబైల్ ఫోన్లలో బంధించి సందడి చేస్తారు. వంజగి గిరి శిఖరాలను తాకుతూ దట్టమైన పొగమంచు అందాలను వీక్షించడానికి…స్థానికులే కాక ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.
ఈ వంజంగి కొండపైకి ప్రతి ఏటా శీతాకాలంలో పర్యాటకులు రాత్రి వేళలో చలి నీ ఎంజాయ్ చేయడానికి వస్తూ వుంటారు. కొండపై గుడారాల ఏర్పాటు చేసి , మంటలు వేసుకుని వెచ్చదనం పొందుతారు. ఇటీవల కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం,మద్యం మత్తులో పర్యాటకులను ఇబ్బంది పెట్టడం జరగడం తో పోలీసులు ఆంక్షలు విధించారు.
కొండపైకి సాయంత్రం 5 గంటల తర్వాత మరియు తెల్లవారుజామున 3 గంటల వరకు అనుమతి లేదంటూ ఎస్సై లక్ష్మణ్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరానికి ట్రాఫిక్ బాగా తగ్గింది అంటూ తెలిపారు. కొత్తవలస వెళ్లే మార్గంలో వాహనాలన్నీ కూడా పార్కింగ్ చేయాలని ఆయన తెలిపారు. పోలీసులు తెలిపిన విధంగా రాత్రిపూట నిషేధంతోపాటు పర్యవరణం కాలుష్యం కాకుండా… వంజంగి కొండపైన విందు చేసేందుకు కూడా రద్దు చేశారు. కొండపైకి మద్యం సీసాలు, ప్లాస్టిక్‌ని తీసుకెళ్లకుండా నిషేధించారు. మేఘాలు చూడాలనుకునేవారు ఆ రోజు రాత్రికి పాడేరులో బస చేసి… తెల్లవారుజామున మూడు గంటలకి వెళ్లాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam