Setti Jagadesh, News18, Visakapatnam
సెలబ్రేషన్ ఏదైనా కేక్ (Cake) అనేది ట్రెండింగ్ మారిపోయింది ప్రస్తుత సమాజంలో. న్యూ ఇయర్ (New Year) , పుట్టినరోజు (Birth Day), పెళ్లిరోజు (Wedding Aniversery).. ప్రేమికులరోజు (Valentin Day), స్నేహితులు రోజు (Frindship Day) ఇలా వేడుక ఏదైనా సరే మనకి ముందుగా గుర్తొచ్చేది బేకరి లో దొరికే కేక్. ఏ కార్యక్రమం అయినా కేక్ కట్ చేసి తింటూ సెలబ్రేషన్స్ చేసుకోవడం ప్రస్తుతం యూత్ అలవాటే. బేకరి లో దొరికే భిన్నమైన ఫ్లేవర్లు అందరికీ చాలా ఇష్టం. ప్రస్తుతం ఏ సందర్భం అయినా కేక్ కట్ చేయడం సాధారణంగా మారిపోయింది అందరికీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లో ఎమ్.మంగీలాల్ స్వీట్స్ , బెంకరీ చాలా ఫేమస్. నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా ఏజెన్సీ అయిన లంబసింగి వరకు కూడా కొనుగోలుదారులు వచ్చి కేక్స్ తీసుకెళ్తుంటారు.
రకరకాల కేకులను అందుబాటులో ఉంచిన బేకరీ యజమానులు కస్టమర్లు కి అందుబాటు ధరలలో అందిస్తూ వుంటారు. 40 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ బేకరీ దినదిన అభివృద్ధి చెంది కస్టమర్లు తగ్గట్టు నార్మల్ కేకులు నుండి కూల్ కేక్ లకు కూడా అప్డేట్ అయినట్లు నిర్వహకులు ఎమ్.మహేష్ కుమార్ తెలుపుతున్నారు.
ముందుగా స్వీట్స్ బిజినెస్ చేసేవాళ్ళమని తర్వాత కస్టమర్లు ఎక్కువగా కేక్స్ అడగడంతో కేక్స్ పెట్టడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం అన్ని రకాల కేక్స్ కస్టమర్లకు అభిరుచులు తగ్గట్టు ఏ కేక్ అడిగిన సరే తమ వద్ద రెడీగా ఉందంటూ నిర్వాహకులు మహేష్ చెప్తున్నారు. మిగతా బిజినెస్ లతో పోల్చుకుంటే స్వీట్స్ మరియు బేకరీపై లాభాలు బాగా వస్తాయని అంటున్నారు.
ఇదీ చదవండి : అక్కడ ఈ స్వీట్ లేనిదే ఫస్ట్ నైట్ జరగదట.. అంత స్పెషల్ ఏంటబ్బా..?
కేక్ మృదువుగా తయారు అవ్వాలి అంటే ఏమి చేయాలో చూద్దాం..
కేక్ కి ఎంత మోతాదులో ఏఏ పదార్ధాలు వెయ్యాలో తమకు తెలుసుకుంటే , ఏది ఐటెం ఎప్పుడు వెయ్యాలో అనేది తెలుసుకుంటే బేకింగ్ అనేది అంత కష్టం కాదు అని మహేష్ చెబుతున్నారు. ఏ కేక్ అయినా మొత్తం కేక్ తయారు చేసేటటువంటి విధానంలో బేకింగ్ ఒక భాగం మాత్రమే అంటున్నారు. ఫ్రాస్టింగ్ లేదా టాపింగ్స్ ద్వారానే అన్ని కేకుకు సరైన ఆకృతి మరియు రుచి వస్తుంది అంటున్నారు. కేక్ తయారి చేయడానికి రెండే రెండు పదార్థాలు అయిన బటర్, షుగర్ లను ఉపయోగించి ఫ్రాస్టింగ్ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం.
ఇదీ చదవండి: త్వరలో జనసేనలోకి మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు.. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు..!
బటర్ మరియు షుగర్ లను సరైన ఉష్ణోగ్రత వద్ద ఆటోమేటిక్ మిషన్ లో కలిపి క్రీమ్ లాగా బాగా చేస్తే మీకు అద్భుతమైన మెత్తటి మరియు నిగనిగలాడే మనకు కావాల్సిన బటర్క్రీమ్ ఫ్రాస్టింగ్ చెయ్యడానికి అంతా రెడీ అవుతుంది. కేక్స్ ఫ్లేవర్డ్ అయిన వెనీలా, చాక్లెట్ లేదా మీకు కావలసిన ఏ ఫ్లేవర్ ను ఈ బటర్క్రీమ్ లో కలిపి చాలా రకాలుగా మీరు ఫ్రాస్టింగ్ చేయవచ్చు.
ఇదీ చదవండి : ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసుండాలి.. రాష్ట్ర విభజనను వెనక్కు తిప్పాలన్న సజ్జల
ఎవరైనా ఈ రెసిపీ కోసం ఐసింగ్ షుగర్ మాత్రమే వాడాలి అంటున్నారు. ఐసింగ్ షుగర్ కాకుండా వేరే షుగర్ గానీ వాడితే బటర్క్రీమ్ అంతా మెత్తగా కాకుండా ఉండలు ఉండలుగా వస్తుంది అంటున్నారు.కేక్ పై ఫ్రొస్టింగ్ చేయాలంటే కావాల్సిన బటర్క్రీమ్ బాగా నిగనిగలాడుతూ, చాలా మృదువుగా ఉండాలి అప్పుడే నోటిలో వేసుకుంటే కరిగిపోవాలి. ఈ బటర్ క్రీమ్ కేక్ పై పూసి అలంకరణ చేస్తే టేస్టీ టేస్టీ చాక్లెట్ కేక్ రెడీ అవుతుంది. ఎలా వెళ్లాలి..విశాఖపట్నం కాంప్లెక్స్ నుండి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకోవాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు శారద నగర్ వద్ద ఈ ఎమ్.మంగీలాల్ స్వీట్స్ షాప్ కనిపిస్తుంది.
అడ్రస్.. Door No:20-1-17, Narsipatnam, anakapalli - 531116 (Near RTC Complax Main Road.) Mangilal Sweet Shop
Phone. No ..9948266437
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.