హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: సూర్యుడైనా ఆలస్యంగా వస్తాడేమో కానీ.. వీళ్లు మాత్రం అస్సలు లేటవ్వరు..! ఎందుకంటే..!

Vizag: సూర్యుడైనా ఆలస్యంగా వస్తాడేమో కానీ.. వీళ్లు మాత్రం అస్సలు లేటవ్వరు..! ఎందుకంటే..!

విశాఖలో

విశాఖలో బారులు తీరుతున్న అడ్డా కూలీలు

విశాఖపట్నం (Visakhaptnam) సాగరతీరంలో తెల్లవారుజామున సూర్యుడు రావడం కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ.. ప్రధాన కూడళ్లలో చేరే రోజువారి కూలీ ముఠా సభ్యులు మాత్రం కచ్చితంగా ఆరుగంటలకల్ల వచ్చేస్తారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  విశాఖపట్నం (Visakhapatnam) సాగరతీరంలో తెల్లవారుజామున సూర్యుడు రావడం కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ.. ప్రధాన కూడళ్లలో చేరే రోజువారి కూలీ ముఠా సభ్యులు మాత్రం కచ్చితంగా ఆరుగంటలకల్ల వచ్చేస్తారు. వలస వచ్చిన కూలీలు. ముఠా కార్మికులుగా ఇసుకతోట, ఎన్.ఏ.డి ఇలా ఎన్నో ప్రాంతాల్లో వందలాది మంది కార్మికులు పనులు కోసం ఇక్కడ కనిపిస్తారు. ఆ రోజు వారికి కూలి దొరికితే వారి పొట్ట నిండినట్లే లేకపోతే కుటుంబంతో సహా పస్తులే ఉండాలి. వర్షం పడితే అందరికీ సంతోషం.. అయితే వారికి మాత్రం కష్టాలే. రోడ్డు మీదకి వచ్చినా పనులు కూడా దొరకవు. భవన నిర్మాణ రంగంపై ఆధారపడి రోజువారీ పనులు చేసుకునే వాళ్లు విశాఖ నగర పరిధిలో సుమారు నాలుగు లక్షల మంది వరకు జీవనం సాగిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Vizianagaram), విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే.

  వీరందరిది రెక్కాడితేగానీ.. డొక్కాడని పరిస్థితి. ఏ రోజుకారోజు వచ్చే కూలీయే ఇంటిల్లపాది అందరికి జీవనాధారం. ఒక్కరోజు పని లేకపోయినా కుటుంబమంతా పస్తులుండాల్సిందే. ఏళ్ల తరబడి విశాఖలో ఇదే పనులను చేసుకుంటున్నప్పటికీ .. ప్రతిరోజూ పని వెతుక్కోవాల్సిన పరిస్థితి వారిది.

  ఇది చదవండి: జ్ఞాపకాలను తరతరాలకు అందించే సజీవ సాక్ష్యం ఆ అక్షరాలు..! కాలాలు మారినా చెరగని చిహ్నం..!

  అలా జీవనం గడుపుతున్న వీళ్లు గత రెండేళ్ల నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల కిందట ఇసుక కొరతతో కొన్ని నెలలపాటు భవన నిర్మాణ పనులు దొరక్క అన్ని కుటుంబాలు పస్తులున్నారు. గత ఏడాది కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌తో ఏడు నుంచి ఎనిమిది నెలలపాటు పనుల్లేక చాలా ఇబ్బందిపడ్డారు. గత ఆరు నెలల నుంచి పరిస్థితులు చక్కబడుతున్నాయి.

  ఇది చదవండి: పెద్దాపురంలో తయారయ్యే ఆ స్వీట్ ఒక్కసారి తిన్నారంటే.. ఆహా ఏమిరుచి అనాల్సిందే..!

  ఈ వలస కూలీల్లో ఎక్కువ శాతం ప్రజలు కొండవాలు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. 70 శాతం మంది ప్రజలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తుండగా, మరో 15-20 శాతం మంది నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో గల మెస్‌లలో జీవనం సాగిస్తూ పనులకు వెళుతుంటారు. అద్దె ఇళ్లలో కుటుంబ సభ్యులతో జీవనం సాగించే వాళ్లకు అద్దె, ఇతర నిత్యావసర సరకులు వంటి కనీస అవసరాలకి వారికి కనీసం నెలకు రూ.10 వేల నుంచి 12 వేలు అవసరమవుతాయి. మెస్‌లలో, గుడారాలలో ఉండే వారికి రూ.8 వేల వరకు అవుతున్నాయి.

  ఇది చదవండి: బిర్యానీలో వేసే జాజికాయ పంటను ఎప్పుడైనా చూశారా..? మంచు ప్రాంతంలో పండేది మన కాకినాడలో ఎలా..?

  విశాఖలో సాధారణ రోజుల్లో మహిళా కూలీకి రూ.300-350, పురుషులకు రూ.500, తాపీమేస్ర్తీలకు రూ.700-రూ.800, ఇతర పనులు చేసేవారికి రూ.500-700 ఇక్కడ చెల్లిస్తుంటారు. భార్య,భర్తలు ఇద్దరూ కలిసి నెలలో ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా పని దొరికినా 10,000 వేల నుంచి రూ.20 వేల వరకు సుమారుగా సంపాదించుకుంటారు. ఇప్పుడు, పూర్తిగా పనుల్లేకపోవడం వారానికి రెండు రోజులు పని ఉండటం వల్ల ఇంటి నిర్వహణకు అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

  ఇప్పటికే వారికి ఉన్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక, కొత్త అప్పులు పుట్టక విశాఖ నగరంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు. అన్ని రంగాల వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదుకొని డబ్బులు వేయడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికులకు మాత్రం ఆదుకోవడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు వారి పని దొరక్క అప్పులు చేసుకొని జీవనం సాగిస్తున్నామని తమని ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు వాపోతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు