విశాఖపట్నంలోని ఉగాది సందర్భంగా హ్యుందాయ్ వెర్నా కొత్తవెర్షన్ కారును మార్కెట్లోకి విడుదల చేయటం హర్షనీయమని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు (స్కిల్ ట్రైనింగ్ & జాబు ఫెయిర్) గాది శ్రీధర్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంలోని లక్ష్మి హ్యుందాయ్ షో రూమ్ నందు హ్యుందాయ్ మోటార్ ఇండియా 6వ తరం కొత్తవెర్షన్ వెర్నా కారును శ్రీధర్ రెడ్డి బుధవారం మార్కెట్లోకి విడుదల చేశారు.
ప్రయాణికులకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ కారుకు మార్కెట్లో మంచి ఆదరణ వస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం లక్ష్మి హ్యుందాయ్ సి.ఈ.వో Dr.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆధునిక టెక్నాలజీతో వెర్నా కొత్తవెర్షన్ కారును మార్కెట్లోకి విడుదల చేయటం జరిగిందని పేర్కొన్నారు.
హైహ్యాండ్ కార్ల వెర్షన్లో కల్పించే అన్నిరకాల సదుపాయాలు తక్కువ ధరకు వెర్నాలో రూపొందించటం జరిగిందన్నారు. అధ్బుతంగా తీర్చిదిద్దిన ఈ కారును ఐదు రంగుల్లో స్పోర్టి లుక్తో మార్కెట్లోకి విడుదల చేసినట్లు చెప్పారు. డ్రైవింగ్ ప్రేమికులు తప్పకుండా నూతన కారును ఆదరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో కస్టమర్స్, శ్రేయోభిలాషులు, లక్ష్మి హ్యుందాయ్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Vishakaptnam, Vizag