VISAKHAPATNAM HUSBAND COMMITS SUICIDE FOR WIFE REJECTING TO GIVE MONEY TO DRINK IN SRIKAKULAM DISTRICT FULL DETAILS HERE PRN
Wife And Husban: అతడు 7th క్లాస్.. ఆమె ఇంజనీరింగ్.. ప్రేమ పెళ్లి.. కానీ వారి లైఫ్ అనుకున్నట్లుగా లేదు..!
ప్రతీకాత్మక చిత్రం
Wife and Husband: అతడు ఏడో తరగతి చదివాడు. పెయింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆమె మాత్రం సివిల్ ఇంజనీరింగ్ చదివింది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసి ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు చిహ్నంగా ఓ బాబు పుట్టాడు. కానీ వారి జీవితం అనుకోని మలుపు తిరింది
అతడు ఏడో తరగతి చదివాడు. పెయింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆమె మాత్రం సివిల్ ఇంజనీరింగ్ చదివింది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసి ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు చిహ్నంగా ఓ బాబు పుట్టాడు. కానీ వారి జీవితం అనుకోని మలుపు తిరింది. ఇద్దర్నీ శాశ్వతంగా విడదీసింది. వివరాల్లికి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) కొత్తవలస మండల కేంద్రానికి చెందిన కొటాన ప్రవీణ్ ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. చదువు మానేసి పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న కోట తనూజ ఇంజనీరింగ్ చదవుతోంది. ఇద్దరివీ ఇళ్లు దగ్గరే కావడంతో ఒకర్నొకరు ఇష్టపడ్డారు.
కొన్నాళ్లకే వీళ్ల లవ్ మేటర్ పెద్దల వరకు వెళ్లింది. గ్రామ పెద్దల వద్ద పంచాయతీ కూడా జరిగింది. ఆ తర్వాత తనూజ కుటుంబం విశాఖపట్నం వెళ్లిపోయింది. అయినా కూడా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగింది. పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత తనూజను అత్తింటివారు బాగానే చూసుకున్నారు. పెళ్లైన కొత్తలో ఎంతో ప్రేమగా ఉన్న ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రవీణ్ క్రమంగా మద్యానికి బానిసవడంతో కాపురంలో చిచ్చురేగింది.
తాను చేసే పనికి మించి అప్పులు చేస్తూ తాగుడుగు బానిసైన ప్రవీణ్.. డబ్బుల కోసం నిత్యం భార్యను, తల్లిని వేధిస్తుండేవాడు. డబ్బులివ్వకుండే చనిపోతానని బెదిరించడం అలవాటు చేసుకున్నారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి మరోసారి ప్రవీణ్ గొడవపడి చనిపోతానంటూ బెదిరించాడు. ఐతే ఎప్పటిలాగే బెదిరిస్తున్నాడనుకొని అంతా నిద్రపోయారు. ఐతే ఉదయం లేచి చూసేసరికి ప్రవీణ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. దీనిని గమనించిన పక్కింటి వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రవీణ్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తనకంటే తక్కువ చదువుకున్నవాడైనా సరి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇలా చేసే సరికి తనూజ కన్నీరుమున్నీరవుతోంది. పుట్టింటివారిని వదిలేసి వచ్చిన తాను బిడ్డతో కలిసి ఇప్పుడెలా బ్రతకాలని రోదిస్తోంది. గతంలోనే ప్రవీణ్ కుటుంబాన్ని తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి తల్లే అతడ్ని పెంచి పెద్దచేసింది. ఇప్పుడు కొడుకు కూడా దూరమవడంతో అత్తాకోడళ్లిద్దరూ దిక్కులేనివారయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చక్కగా చూసుకోకుండా వ్యసనాలకు బానిసై ఇప్పుడువారిని ఒంటరివారిని చేశాడంటూ చుక్కుపక్కల వారు అంటున్నారు. ఇటీవల కృష్ణాజిల్లా గూడవల్లిలో ప్రేమించిన వ్యక్తి కోసం ఇల్లు వదిలి వచ్చేసిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.