Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM HUSBAND COMMITS SUICIDE AFTER WIFE RAN AWAY WITH HER LOVER IN ANAKAPALLI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP

Cheating Wife: ప్రియుడితో లేచిపోయిన భార్య.. అవమానంతో కుంగిపోయిన భర్త ఏం చేశాడంటే..!

మృతుడు దుర్గాప్రసాద్, భార్య (ఫైల్)

మృతుడు దుర్గాప్రసాద్, భార్య (ఫైల్)

Cheating Wife: పవిత్రమైన వివహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు, ఇందులో పురుషులు, మహిళలు అన్న బేధమే లేదు. అనసవర సుఖాల వంటపడుతూ చీ అనిపించుకుంటున్నారు. భర్త, అందమైన కుటుంబాన్ని వదిలేసి పక్కదారి పట్టిందో మహాతల్లి.

    పవిత్రమైన వివహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు, ఇందులో పురుషులు, మహిళలు అన్న బేధమే లేదు. అనసవర సుఖాల వంటపడుతూ చీ అనిపించుకుంటున్నారు. భర్త, అందమైన కుటుంబాన్ని వదిలేసి పక్కదారి పట్టిందో మహాతల్లి. పరాయి పురుషుడి మోజులో కుటుంబ వ్యవస్థను అవమానించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) ప్రస్తుతం అనకాపల్లి జిల్లా (Anakapalli) లో ఓ భార్య చేసిన పనికి భర్త బలైపోయాడు. నర్సీపట్నంలోని కొత్తవీధికి చెందిన కామిరెడ్డి దుర్గాప్రసాద్ కు ఓ మహిళో కొంతకాలం క్రితం పెళ్లయింది. అంతాబాగుందనుకున్న సమయంలో భార్య వేరొకరి మోజులో పడింది. ఎంతచెప్పినా వినకుండా.. ప్రియుడితో లేచిపోయింది. భార్య కోసం పోలీస్ కంప్లైటంట్ చేసినా ఫలితం లేకపోవడం, అవమానం భరించలేక దుర్గా ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకొని తన బాధనంతా చెప్పుకున్నాడు. ఆ వీడియోలో ప్రియుడితో కలిసి భార్య చేసిన మోసం.. తనకు ఎదురైన అవమానాలు, పోలీస్ కంప్లైంట్ చేసినా న్యాయం జరగకపోవడం వంటి విషయాలు చెప్పాడు. తన ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు.

    ఇది చదవండి: ఫ్రెండ్ భార్య, ప్రియురాలితో ఎఫైర్.. ఆ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. ఓ రాత్రి నమ్మకంగా పిలిచి..


    ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. గత నెలలో మధురవాడకు చెందిన మృదుల అనే మహిళ.. ప్రియుడితో కలిసి ఆమె భర్తను దారుణంగా హత్య చేసింది. అర్ధరాత్రి భర్తను కుక్కర్ మూతతో కొట్టి హతమార్చింది. అనంతరం భర్త మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి.. మారికవలస వద్ద హైవే వంతెన కింద పడేసింది. రెండు రోజుల తర్వాత డెడ్ బాడీని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అనంతరం తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో ఆమె భర్తను చంపినట్లు వెల్లడైంది. అంతకుముందు విజయనగరం జిల్లాలో తులసీ అనే మహిళ.. భర్త రామును ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయింది.


    ఇది చదవండి: యువతితో గ్రామ సచివాలయ ఉద్యోగి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. వీడియో వైరల్


    అలాగే జూలై 25న సాయి ప్రియాంక అనే మహిళ.. పెళ్లి రోజు భర్తతో కలిసి షికారుకెళ్లింది. తిరిగి ఇంటికెళ్లె సమయానికి భర్త ఫోన్ చూసుకుంటుండగా.. వెనుక నుంచి ప్రియుడితో పారిపోయింది. ఆమె సముద్రంలో గల్లంతయిందని భావించి పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా గాలించారు. ఐతే ఆమె ప్రియుడితో బెంగళూరు వెళ్లిపోయి అతడ్ని పెళ్లి చేసుకుంది. పోలీసులు ఆమెను బెంగళూరు నుంచి తీసుకురాగా.. ప్రియుడితోనే వెళ్లిపోయింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు