Andhra Pradesh: పెళ్లైన 30ఏళ్ల తర్వాత భార్యపై అనుమానం... కోపంతో ఆ భర్త ఏం చేశాడంటే..!

ప్రతీకాత్మక చిత్రం

Extramarital Affair: పెళ్లై 30 ఏళ్లుదాటింది.. పిల్లలకు కూడా పెళ్లిళ్లై సెటిల్ అయ్యారు. ఈ వయసులో కూడా భర్తకు.. భార్యపై అనుమానం మొదలైంది. చివరకి..

 • Share this:
  P.భానుప్రసాద్, విజయనగరం ప్రతినిధి, న్యూస్18

  కట్టుకున్న భర్త.., కడవరకు తోడుంటాడనుకుంటే.., భార్యపైనే అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం కాస్తా.. పెనుభూతమై ఆ భార్యనే గొడ్డలితో నరికి మట్టుబెట్టాడు. కొత్తవలస మండలం కొత్తూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఆమె తరచూ ఆ గ్రామంలో ఎవరితోనో మాట్లాడుతోందని, తనను మోసం చేస్తోందంటూ పలుమార్లు దాడి చేసి చంపేందుకు ప్రయత్నించి చివరకు అదే అనుమానంతో హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. విజయనగరం జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన ఇనపసప్ప చింతాలు, ఇనపసప్ప దుర్గ (55)లు భార్యాభర్తలు. వీరిది ప్రేమ వివాహం. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. వారికి పెళ్లిళ్లుకావడంతో ఎవరి కుటుంబంతో వారు వేరే గ్రామాల్లో ఉండగా చింతాలు, దుర్గమ్మలు కొత్తూరులో నివసిస్తూన్నారు. ఆ గ్రామానికి చింతాలు కాటికాపరిగా వ్యవహరిస్తూ వచ్చిన డబ్బులతో పాటు అప్పడప్పుడు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

  కాగా.. ఎప్పటి నుంచో చింతాలుకి భార్య దుర్గమ్మ మీద అనుమానం ఉంది. వేరే వ్యక్తితో మాట్టాడుతుందంటూ భార్యతో తరచూ గొడవపడుతూ ఉంటాడు. ఇలా గొడవ పడిన ప్రతీసారి స్థానికులు కల్పించుకుని సర్ది చెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగేది. ఇదే క్రమంలో గతంలో రెండు సార్లు దుర్గమ్మ మీద దాడి కూడా చేశాడు చింతాలు. అప్పట్లో చిన్నచిన్న గాయాలతో తప్పించుకున్న దుర్గమ్మ ఈ సారి మాత్రం తప్పించుకోలేక పోయింది. కరడుగట్టిన ద్వేషం, భార్యపై అనుమానం, ఎలాగైనా తన భార్యను హతమార్చాలన్న ఆలోచనలు చింతాలులో బలంగా నాటుకున్నాయి. అదును కోసం ఎదురుచూసిన చింతాలు ఈనెల 11న తన బార్య దుర్గమ్మపై దాడి చేశాడు. కానీ ఈ సారి మాత్రం తన లక్ష్యం తప్పకూడదని.. గొడ్డలితో ఆమెపై విరుచుకుపడ్డాడు.

  ఇది చదవండి: 'అగ్గిపెట్టి మచ్చా' జోరు మాములుగా లేదుగా.. ప్లే స్టోర్లో మచ్చా రికార్డ్


  అయితే ఇది గమనించిన స్థానికులు గాయపడిన దుర్గమ్మను వెంటనే విశాఖ కేజీహెచ్ కు వైద్యం నిమిత్తం తరలించారు. దుర్గమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఈనెల 15న ప్రాణాలు విడిచింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మొదట దాడి కేసుగా నమోదు చేసారు. ఇక హత్య చేసిన చింతాలును కేసు నుండి తప్పించేందుకు స్ధానిక పత్రికా విలేఖరి ఒకరు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి నిందితుడు పరారీలో వున్నాడంటూ చెప్పేందుకు ప్రయత్నించారు. విషయం కాస్త పెద్దది కావడం, పోలీసులపై ఒత్తిడి పెరగడంతో.. దాడి కేసుగా నమోదైన కేసును కాస్తా హత్య కేసుగా మార్చి నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా చూపించారు.

  దాడి చేసి పరారైన నిందితుడు చింతాలును గాలించి రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నామని.. రిమాండుకు తరలించామని కొత్తవలస పోలీసులు తెలిపారు. ఏభై ఐదు ఏళ్ల వయసు ఉన్న భార్యపై అనుమానం పెంచుకోవడమే కాకుండా మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కడతేర్చిన ఆ కిరాతకుడికి కఠిన శిక్ష విధించాలని స్థానికులు కోరుతున్నారు.
  Published by:Purna Chandra
  First published: