• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM HUGE TURTLE CARCASS REACHED AT VISAKHAPATNAM BEACH IN ANDHRA PRADESH NGS

Andhra Pradesh: సాగరతీరానికి కొట్టుకువచ్చిన భారీ తాబేలు.. ఆ తాబేలు వయసు ఎంతో తెలుసా?

Andhra Pradesh: సాగరతీరానికి కొట్టుకువచ్చిన భారీ తాబేలు.. ఆ తాబేలు వయసు ఎంతో తెలుసా?

విశాఖ సాగర తీరానికి కొట్టుకొచ్చిన వందేళ్ల తాబేలు

విశాఖ సాగర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలును చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఇంత పెద్ద భారీ తాబేళును ఎప్పుడు చూడలేదని.. దీని వయసు ఎంత ఉంటుందో అంటూ చూసేందుకు భారీగా జనం ఎగబడుతున్నారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో భారీగా గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు.

  • Share this:
    భారీ తాబేళ్లు అప్పుడప్పుడూ సముద్ర తీరానికి కొట్టుకొస్తూ ఉంటాయి. గుడ్లు పెట్టే సమయంలోనో, అనారోగ్యం కారణంగానో తాబేళ్లు ఇలా ఒడ్డుకు వస్తూ ఉంటాయి. తాజాగా విశాఖలోని సాగర‌ నగర తీరానికి భారీ తాబేలు కళేబరం కొట్టుకుని వచ్చింది. సాధారణంగా ఈ తరహా తాబేలు సాగర జలాల్లో లోతుగా ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తుంటాయి. అయితే గర్భం దాల్చిన సమయంలో అక్కడే ఉన్నా.. ఇవి గుడ్లు పెట్టేందుకు సముద్రపు ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అయితే ఆ సమయంలో వలలో చిక్కుకుని లేదా పడవ చక్రాలకు తగిలి మృత్యువాత పడుతూ ఉంటాయి అని మత్స్యకారులు అంటున్నారు. అయితే ఒక్కోసారి సముద్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు అవి మరణిస్తూ ఇలా ఒడ్డుకు కొట్టుకుంటూ వస్తాయి.

    విశాఖలోని సాగర్‌ నగర్‌ తీరానికి భారీ తాబేలు కళేబరం ఒకటి కొట్టుకు వచ్చినట్టు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన మత్య్సకారులు.. ఆ తాబేలును చూసి దాని వయసు వందేళ్లు పైగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దాని బరువు చూస్తే వందపైనే వయసు ఉంటుందని చెబుతున్నారు. గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు వచ్చే ప్రయత్నంలో కాలుష్యం కారణంగా మృత్యువాత పడి ఉంటుంది అంటున్నారు.

    మృత్యువాత పడినా.. చూసేందుకు భారీగా ఉన్న ఆ తాబేలును చూడటానికి సాగర తీరానికి ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి ఉదృతమవుతున్న నేపథ్యంలో అలా వచ్చిన వారిని ఆ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. అయితే అంతా భారీ తాబేలును చూసేందుకు మాత్రం జనం ఎగబడుతున్నారు.

    కేవలం ఒడ్డుకు తాబేళ్లు కొట్టుకు రావడమే కాదు. సముద్రంలోకి భారీగా తాబేళ్లును వదలడం కూడా విశాఖలో ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల బంగాళాఖాతంలో అరుదుగా ఉన్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల పరిరక్షణకై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం కట్టాయి. అందులో భాగంగానే తాబేళ్ల ప్రత్యుత్పత్తి సమయంలో వాటిని పరిరక్షించి తాబేలు పిల్లలను సురక్షితంగా విశాఖ సముద్రంలో వదిలి పెడుతూ ఉంటారు. సాధారణంగా ఒడ్డున గుడ్లను పొదిగిన తాబేళ్లు తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. అలా వచ్చే ప్రయత్నంలోనే ఆ తాబేలు మృత్యువాత పడి ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.

    అయితే తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళ్లేటప్పుడు.. పక్షులు, ఇతర జీవుల నుంచి వాటి ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. అందుకే వాటిని పరిరక్షించే బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు, అటవీశాఖ తీసుకున్నాయి. అలా పరిరక్షించిన తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెడతారు. ఇటీవలే
    విశాఖ సాగర తీరంలో పరిరక్షించిన తాబేళ్ల పిల్లలను అటవీ శాఖ అధికారులు సముద్రంలోకి విడిచిపెట్టారు. వందలాది ఆలివ్ రిడ్లే తాబేళ్లను సాగర జలాల్లోకి వదిలారు. తీర ప్రాంతాల్లో సముద్ర తాబేళ్ల గుడ్లను సంరక్షిస్తున్న అటవీ శాఖ.. పిల్లలను సాగరంలోకి విడిచిపెడుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.
    Published by:Nagesh Paina
    First published: