P Anand Mohan, Visakhapatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంక్రాంతి వేడుకలు (Sankranthi Festival) ముగిశాయి. మూడు రోజుల పాటు జనం ఆనందోత్సాహల మధ్య పెద్ద పండుగను జరుపుకున్నారు. అలాగే పందెం రాయుళ్లు కోడిపందేలతో ఎంజాయ్ చేశారు. కోడి పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఏడాదంతా ఎంతో జాగ్రత్తగా పెంచిన పుంజులు.. పందెం రాయుళ్లకు డబ్బులు మిగిల్చాయి. ఐతే పందెంలో ఓడిన కోళ్లు, చనిపోయిన కోళ్లకు మంచి గిరాకీ వచ్చి పడింది. పందెం కోడి మాంసానికి జనం ఎగబడ్డారు. ఎంతైనా ఇచ్చేందుకు వెనుకాడలేదు. ఉభయ గోదావరి జిల్లాలలో సంక్రాంతి మూడు రోజుల పాటు ఇదే సీన్లు కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా కనుమ రోజు కూడా కోడిపందాలు జోరుగా సాగాయి. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కనుమ రోజు జిల్లాలో కోడిపందాలు, గుండాటలు జోరుగా సాగాయి.
ఒక పక్క జూదాలు మరో పక్క కోడి పందాలు నడుస్తుంటే.. పందెంలో డీలాపడ్డ కోడిని (కోస) అధిక ధరకు విక్రయిస్తున్నారు. కొన్ని నెలల పాటు పుష్టిగా పెంచిన కోడిపుంజు.. పందెంలో ఓడిపోవడంతో కోస పేరుతో దానిని విక్రయిస్తారు. ఇప్పుడు కోడిపుంజును దాదాపు 4000 నుండి 5000 వరకు డిమాండ్ పలుకుతూ ఉంది. పందెం అవ్వగానే స్పాట్ లో కోస కోసం ఎగబడుతున్నారు మాంసం ప్రియులు.. కోనసీమలో కోసకు ఉన్న డిమాండ్ మరి దేనికి లేదంటున్నారు ప్రజలు.. ఈ కోస మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారని పేర్కొంటున్నారు.
అదిరే ధర
ఓ పక్క పందాలు జరుగుతున్న సమయంలోనే కోస కోసం మాంసం ప్రియులు వేచి ఉంటున్నారు. పందెం ముగిసిన వెంటనే కోస కావాలంటూ పెందెం గెలిచిన వారి చుట్టూ చేరుతున్నారు. దీంతో పందెం రాయుళ్లు అక్కడ ఉన్న డిమాండ్‌ను బట్టి.. రూ. 4వేల నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. అయితే.. పక్క రాష్ట్రాల నుంచి సంక్రాంతి సంబరాలకు ఈ ప్రాంతానికి వచ్చిన వారు.. కోస (కోడిపుంజు) ను కొనుగోలు చేసుకొని.. వారి సొంత ఊర్లకు పట్టుకెళుతున్నారు. డిమాండ్ ఉన్నా.. కోస కావాలంటూ పందెం రాయుళ్ల చుట్టూ చేరుతున్నారు. దీంతో ఈ కోసకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఇక పందెం కాసి చనిపోయిన కోడి ఈ స్థాయిలో డిమాండ్ రావడం పందెం రాయుళ్లకే క్రేజ్ తెప్పిస్తోంది.
అందుకే డిమాండ్..
పందెం కోళ్లను ఏడాది పాటు పౌష్టికాహారం ఇచ్చి పెంచాతు. ముఖ్యంగా రాగులు, సజ్జల వంటి చిరుధాన్యాలతో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్, మటన్ కీమా, కోడి గుడ్లు వంటివి పెట్టి పోషిస్తారు. ఇక ఆయిల్ మసాజ్, ఈత లాంటి కసరత్తులు కూడా చేయిస్తారు. దీంతో ఎలాంటి కొవ్వులేకుండా నాణ్యమైన మాంసం పందెం కోళ్ల నుంచి లభిస్తుంది. అందుకే వాటి కోసం జనం ఎగబడుతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chicken, Cock fight