హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

Vizag: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

విశాఖలో

విశాఖలో ఆకట్టుకున్న ప్లాస్టిక్ పూల మార్కెట్

మధ్యతరగతి వాళ్లకు రోజు పూలను కొని ఇంట్లో డెకరేట్‌ చేసుకోలేరు. ఆ ఖర్చు భరించలేరు. అలాంటి వాళ్ల కోసమే .తాజా పూల ఆకర్షణకు ఏ మాత్రం తీసిపోని ప్లాస్టిక్‌ ప్లవర్స్ (Plastic Flowers)‌ మార్కెట్‌లోకి వచ్చాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  ఎవరైనా అతిథులు ఇంటికొచ్చినప్పుడు.. మన ఇళ్లు కలర్‌ఫుల్‌గా ప్రశాంతంగా అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే డబ్బున్నవాళ్లు ప్రతిరోజు తాజా పూలతో ఇంటిని డెకరేట్‌ చేసుకుంటారు. కానీ మధ్యతరగతి వాళ్లకు రోజు పూలను కొని ఇంట్లో డెకరేట్‌ చేసుకోలేరు. ఆ ఖర్చు భరించలేరు. అలాంటి వాళ్ల కోసమే .తాజా పూల ఆకర్షణకు ఏ మాత్రం తీసిపోని ప్లాస్టిక్‌ ప్లవర్స్ (Plastic Flowers)‌ మార్కెట్‌లోకి వచ్చాయి. ఇప్పుడు వీటికే ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఇంకా చెప్పాలంటే కాస్త డబ్బున్నవాళ్లు కూడా ఈ కలర్‌ఫుల్‌ ప్లాస్టిక్‌ ప్లవర్స్‌నే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం (Visakhapatnam) మహానగరంలో ప్లాస్టిక్ ప్లవర్స్ క్రేజీ విపరీతంగా పెరిగిపోతుంది. మహిళలు ఎక్కువగా రియల్ ఫ్లవర్స్ కాదని ప్లాస్టిక్ ఫ్లవర్స్, మొక్కలతో ఇల్లు అంతా డెకరేట్‌ చేసుకుంటున్నారు. ఇంటి లోపల వాల్‌ హ్యాంగింగ్స్‌, డోర్‌ డేకరేషన్స్‌, ఫ్లవర్‌ వాజ్‌లు, షోకేజ్‌లలో, బెడ్‌రూమ్‌లలో, అద్దాల పక్కన.. ఇలా ఇళ్లంతా ప్లాస్టిక్‌ ప్లవర్స్ ‌తోనే నింపేస్తున్నారు.

  తక్కువ ఖర్చుతో అందగా కనిపించడంతో ప్లాస్టిక్ ఫ్లవర్స్, డెకరేషన్‌ ఐటమ్స్‌పై మక్కువ చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కలర్ ఫుల్‌గా ఉండే ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎక్కువ కొనుగోలు చేస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు. పండగలొచ్చినప్పుడు, ఫంక్షన్స్‌ అప్పుడు కాస్త తాజా బంతిపూలతో డెకరేట్‌ చేసినా.., ప్లాస్టిక్ పూల దండలు, గ్రాస్‌ మొక్కలు, చిన్న చిన్న చెట్లు లాంటివి ఏ ఇంట్లో అయినా అలంకరణ చేస్తే బహు సుందరంగా ఉంటాయి.

  ఇది చదవండి: ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ లో అదరగొడుతున్న స్వీపర్.. పిల్లలు మాట్లాడుతుంటే విని నేర్చుకుంది

  అయితే, తాజా పూల దండలు చాలా ఖరీదైనవి, అందులోనూ చాలా త్వరగా వాడిపోతాయి. ప్రతిసారి మార్కెట్‌కెళ్లి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, ప్లాస్టిక్ లేదా కాగితంతో చేసిన కృత్రిమ పూల దండ అయితే ఒక్కసారి పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తే చాలు. తక్కువ ఖర్చుతో కూడిన అలంకరణ వస్తువులుగా ఇంట్లో ఉండిపోతాయి. ఖర్చులో సగం అయినప్పటికీ నిజమైన పువ్వులతో సమానమైన ప్రయోజనాలను అందిస్తాయి అంటున్నారు విశాఖ నగరవాసులు.

  ఇది చదవండి: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట..!

  దసరా పండుగ సీజన్ మొదలైపోయింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు తమ ఇళ్లను గుమ్మం నుంచి మొదలుకొని ఇల్లంతా అలంకరించుకుంటారు. పండగకు ఇంటికి ఎక్కువగా బందువులు వస్తూ ఉంటారు. గుమ్మానికి అలంకరణ చాలా ముఖ్యం. అవి పువ్వులతో, వివిధ రకాల డేకరిటివ్ ఐటమ్స్‌తో అలంకరించుకుంటే మన ఇల్లు అందంగా కళకళలాడుతూ ఉంటుంది.

  ఇది చదవండి: ఆ కొండపైన రాయి కాదు కదా పూచికపుల్ల పట్టుకోవాలన్నా వణికిపోతారు..! కారణం ఇదే..!

  విశాఖ ప్రజల అవసరాలు గుర్తించిన విశాఖపట్నంకి చెందిన సాంబ శివ రియల్ ఫీల్ అని షాప్ ఏర్పాటు చేసి మార్కెట్‌లో ఎన్నో రకాల ఆకర్షణీయమైన డెకరేషన్ ఐటమ్స్ అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా నగరవాసులకు త‌క్కువ రేటుకు అన్ని రకాల ఐటమ్స్ ల‌భిస్తున్నాయి. దీంతో మహిళలు అధిక శాతం కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ 50 రూపాయలు నుండి 5000 వరకు అన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. పండగ సీజన్ కావడంతో అధిక శాతం కొనుగోళ్లు జరుగుతున్నాయిని నిర్వాహకులు శివ అంటున్నారు.

  అడ్రస్: వెంకోజిపాలెం, మెడికవర్ హాస్పిటల్‌ ఎదురుగా, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్‌- 530022. ఫోన్‌ నెంబర్‌: 832 818 4292

  Vizag Venkojipalem Map

  ఎలా వెళ్లాలి: విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వెంకోజి పాలెం సిగ్నల్ వద్దకు చేరుకోవాలి.. అక్కడ రియల్ ఫీల్ అనే బోర్డుతో ఈ కలర్‌ఫుల్‌ ప్లవర్‌ షాపు మనకు కనిపిస్తుంది. బస్సు, ఆటో సదుపాయం కలదు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు