హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: సిక్స్ ప్యాక్ బాడీపై పెరుగుతున్న క్రేజ్.. కానీ అంత ఈజీ కాదంటున్న ట్రైనర్లు..!

Vizag: సిక్స్ ప్యాక్ బాడీపై పెరుగుతున్న క్రేజ్.. కానీ అంత ఈజీ కాదంటున్న ట్రైనర్లు..!

X
సిక్స్

సిక్స్ ప్యాక్ పై యూత్ లో పెరుగుతున్న క్రేజ్

ఇటీవలి కాలంలో యూత్‌కి శరీరంపై శ్రద్ధ పెరుగుతోంది. గడిచిన కొన్నేళ్లుగా సౌందర్య సాధనాలు, ఫిట్‌నెస్ మార్కెట్ (Fitness Market) విపరీతంగా పెరగడమే దీనికి నిదర్శనం. వాస్తవానికి సిక్స్‌ ప్యాక్ బాడీ అనేది ఆత్మవిశ్వాసానికి, ఆరోగ్యానికి ప్రతిరూపం అన్నది నేటి యువత భావన.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhaptnamఇటీవలి కాలంలో యూత్‌కి శరీరంపై శ్రద్ధ పెరుగుతోంది. గడిచిన కొన్నేళ్లుగా సౌందర్య సాధనాలు, ఫిట్‌నెస్ మార్కెట్ (Fitness Market) విపరీతంగా పెరగడమే దీనికి నిదర్శనం. వాస్తవానికి సిక్స్‌ ప్యాక్ బాడీ అనేది ఆత్మవిశ్వాసానికి, ఆరోగ్యానికి ప్రతిరూపం అన్నది నేటి యువత భావన. అందుకే ఎంత ఖర్చు అయినా, కష్టపడైనా సరే సిక్స్‌ ప్యాక్స్ సాధించాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. లేటేస్ట్‌గా వస్తున్న సినిమాలు, అందులో సిక్స్‌ ప్యాక్స్ చూపిస్తున్న హీరోలు కూడా వారిని ఇన్‌స్పైర్ చేస్తున్నారు. అయితే సిక్స్‌ ప్యాక్ అనేది రాత్రికి రాత్రి వచ్చే స్పెషల్ ప్యాకేజీ కాదంటున్నారు సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్ మహేష్. కఠినమైన శ్రమ, పట్టుదల అన్నింటికన్నా క్రమశిక్షణ ఉంటేనే సిక్స్ ప్యాక్ సాధ్యమవుతుంది. కఠోర శ్రమ, ప్రణాళికకు తోడు మరీ ముఖ్యంగా ఆహార నియమాలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సిక్స్‌ ప్యాక్ సాధించాలనుకుంటున్న వాళ్లు క్రింది ప్రణాళికలు చేయాలని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్.
వర్కవుట్ ప్లాన్ , డైట్ ప్లాన్
ప్రధానంగా ఈ ప్రణాళికలు సరిగ్గా ఉన్నప్పుడు ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకుండా సరైన పద్ధతిలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం అని సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్స్ అంటున్నారు. ట్రైనర్ ఆధ్వర్యంలో సరైన పద్ధతిలో ప్రతీ రోజూ రెండు కండరాలకు సంబంధించిన వర్కవుట్స్ మీ ప్రణాళికలో ఉండాలి అంటున్నారు. అంటే వారంలో ఒక కండరానికి సంబంధించిన వర్కవుట్ రెండుసార్లు చేసేలా మీ ప్లాన్ ను తయారు చేసుకోవాలి.

ఇది చదవండి: స్వయానా గాంధీజీ ప్రారంభించిన ఆశ్రమం.. మన నెల్లూరులో ఉందని మీకు తెలుసా..?


అప్పర్, లోయర్ బాడీ వర్కవుట్స్ తో పోల్చుకుంటే అధిక సమయాన్ని కార్డియో వర్కవుట్స్ చేయడానికి తప్పకుండా కేటాయించండి. కార్డియో ఎక్సర్‌సైజ్ లు చేయడం వలన కొవ్వు త్వరితగతిన కరిగి తద్వారా సిక్స్ ప్యాక్ కు అనుగుణంగా మీ శరీరం సమాయుత్తమవుతుంది. మీ రెగ్యులర్ మజిల్ వర్కవుట్ తో పాటు రోజూ కనీసం 20 నుంచి 40 నిమిషాల పాటు కార్డియో చేయడం మీ సిక్స్ ప్యాక్ లక్ష్యాన్ని సులభతరం చేస్తుంది.

ఇది చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి బిజినెస్‌లోకి ఎంట్రీ..! దేశీ లస్సీతో గుంటూరు కుర్రాడి సక్సెస్‌..!


యూత్ అంతా కార్డియో తో పాటు అబ్‌డామినల్ (పొట్ట) కు సంబంధించిన వర్కవుట్ కూడా రోజువారీ ప్లాన్‌లో ఉండేలా చూసుకోవాలి. వారంలో కనీసం 5 రోజులు కచ్చితంగా అబ్‌డామినల్ వర్కవుట్ చేయాల్సిందే. క్రంచెస్, బ్రిడ్జెస్ అలానే ప్లాంక్ ఎక్సర్‌సైజ్ లు మీ పొట్ట భాగాన్ని బలంగా, ఆకర్షణీయంగా చేస్తాయి.

ఇది చదవండి: ఆన్ లైన్ ఆర్డర్స్ పెరుగుతున్నా ఆదాయం సున్నా.. డెలివరీ బాయ్స్ లైఫ్ ఎంత కష్టమో చూడండి..!


సిక్స్ ప్యాక్ చేయాలనుకున్నప్పుడు అన్నింటికంటే ముఖ్యమైనది డైట్ అని ముందుగానే చెప్పుకున్నాం. ప్రధానంగా ప్రోటీన్ ఆధారిత ఆహారం యూత్ అధికంగా తీసుకోవాలి. దీని వలన ఫ్యాట్ తగ్గి కేవలం కండరాలు ఒక క్రమపద్ధతిలో వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా వర్కవుట్ పూర్తయిన వెంటనే నిర్దేశించిన సమయంలోగా ప్రోటీన్ ను శరీరానికి అందేలా చూసుకోవాలి. దీనివలన కండరాల టిష్యూలు త్వరగా రికవరీ అవుతాయి. పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, డైరీ ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, విత్తనాల్లో అధికంగా ప్రోటీన్ దొరుకుతుంది.

ఇది చదవండి: అగ్నిప్రమాదాలను అరికట్టే సెన్సార్‌ ఆవిష్కరణ..! ప్రయోగాలతో సత్తా చాటుతోన్న విద్యార్థులు.!


సిక్స్ ప్యాక్స్ లక్ష్యంలో డైట్, వర్కవుట్ ప్రణాళిక ఎంత ముఖ్యమో సరైన పద్ధతిలో తగినంత నీరు తాగడం అనేది కూడా చాలా ముఖ్యం అన్నది గుర్తుపెట్టుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయడంతో పాటు మలినాలను బయటకు పంపడంలో నీటిదే ప్రధాన పాత్ర. శరీర అవసరాలు, బరువు ఆధారంగా రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి.


ఆహారం విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఆహారాన్ని పూర్తిగా తినడం మానేయాలి. చిప్స్, క్రాకర్, సాఫ్ట్ డ్రింక్స్,జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ మీ లక్ష్యాన్ని పూర్తిగా దారి మళ్లిస్తుంది. ఆయా సీజన్ లో దొరికే పండ్లు, కాయగూరలు అధికంగా తీసుకోవాలి. అలాగే ప్రాసెస్డ్ కార్బ్స్ ను కూడా పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. వెజిటబుల్ సలాడ్స్ , అలాగే ఫైబర్ ఉండే ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకోవాలి. సిక్స్ ప్యాక్స్ సాధించేందుకు 80 శాతం ఏం ఆహారం తింటున్నామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. మిగిలిన 20 శాతం క్రమబద్ధమైన వర్కవుట్స్, కచ్చితమైన ఎక్సర్‌సైజ్ లు మంచి ఫలితాలను ఇస్తాయి.

First published:

Tags: Andhra Pradesh, Fitness, Local News, Visakhapatnam