హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag : ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం ఎలా..? ఇంత ఈజీ అని చెబుతున్న మల్లెల సాహితి..

Vizag : ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం ఎలా..? ఇంత ఈజీ అని చెబుతున్న మల్లెల సాహితి..

X
ఇంట్లో

ఇంట్లో కూర్చొనే లక్షల్లో ఆదాయం

Vizag: ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించడం ఎలా అని చాలామంది ఆలోచిస్తుంటారు.. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే అలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తోంది సాహితి.. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇంట్లో ఉండే పనికిరావు అనుకుని వాటికి ప్రాణం పోస్తూ లక్షలు సాధిస్తోంది. ఎలాగో మీరే చూడండి.

ఇంకా చదవండి ...

Setti Jagadeesh, News 18, Visakhaptnam

Vizag: చాలామంది మహిళలు.. పురుషులు సైతం ఇంట్లో ఉండే సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు.. అలా డబ్బు సంపాదించడానికి మార్గాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.. అయితే అలా ఆలోచించే వారికి విశాఖ యువతి ఆదర్శం.. ఆమె ఇంట్లో కూర్చొనే లక్షలు లక్షలు సంపాదిస్తోంది. ఎలాగంట..? పనికి రావు అనుకుని మనం పారేసే చిన్న లగేజ్‌ పేపర్‌ నుంచి ఎగ్‌ ట్రే వరకు అన్నిటికీ  ప్రాణం పోస్తుంది.  ఆ కళాకృతులను చూసిన వాళ్లెవరైనా ఫిదా అవ్వాల్సిందే. మారుమూల ఉన్న నర్సీపట్నం నుంచి మిలియన్‌ వ్యూస్‌ పొందే స్థాయికి ఎదిగారు. ఒక చిన్న కెమెరా, చిన్న యూట్యూబ్‌ ఛానెల్‌తో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదించే వరకు చేరింది. యూట్యూబ్‌లో ఎన్‌ఎస్‌ క్రియేటివ్‌ కలెక్షన్స్ పేరుతో సెలబ్రెటీగా మారిన మల్లెల సాహితి గురించే మనం మాట్లాడుకుంటుంది.

సరదాగా నేర్చుకున్న క్రాఫ్ట్ వర్క్‌...!

చిన్నతనంలో సరదాగా నేర్చుకున్న క్రాఫ్ట్‌ వర్కు ..ఇప్పుడామెను సోషల్‌ మీడియా మహారాణిని చేసింది. అనకాపల్లి జిల్లా (Anakapalli District) నర్సీపట్నం (Narsipatnam) లో ఉంటున్న మల్లెల సాహితి (Mallela Sahithi) తన చేతులతో అద్భుతంగా క్రాప్ట్స్‌ వర్క్‌ చేస్తున్నారు. మల్లెల సాహితికి చిన్నప్పటి నుంచి చేతితో తయారు చేసే వస్తువులంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు పాఠశాల రోజుల్లో ఈ ఆకృతులు బాగా తయారు చేసేవారు. అప్పట్లో సరదాగా నేర్చుకున్న ఈ పనికి..ఇప్పుడు సృజనాత్మకత జోడిం చడంతో ఇవి అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.


భర్త ప్రోత్సాహంతో యూట్యూబ్‌ ఎంట్రీ..!

సాహితి భర్త నిశాంత్ నర్సీపట్నంలోని సౌత్ ఇండియన్ బ్యాంకు బ్రాంచి మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెళ్లయిన కొత్తలో సాహితి..ఇంట్లో పనికిరాని వాటిని, వేస్ట్‌ పేపర్లను సైతం అద్భుతంగా డిజైన్‌ చేయడాన్ని గమనించిన నిశాంత్‌ తన భార్యలో ఉన్న కళను గుర్తించారు. ఈ కళ ఇలా వేస్ట్ కాకుడదు అనే ఉద్దేశంతో సాహితిని ఎంకరేజ్‌ చేశారు. అలా భర్త సహకారం, ప్రోత్సాహంతో కాలక్షేపంగా మొదలైన ఈ కళ... వృత్తిగా మారి యూట్యూబ్‌లో ఎకౌంట్‌ ఓపెన్‌ చేసే వరకు వెళ్లింది.

ఇదీ చదవండి : ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. రాష్ట్ర నేతలకు ఏం చెప్పనున్నారు..

'ఎన్.ఎస్. క్రియేటివ్ కలెక్షన్స్ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌..!

కుటుంబపనులు చూసుకుంటూ జాబ్‌ చేయడం ఇష్టం లేని సాహితికి ఇది ప్రత్యాహ్నయంలా కనిపించింది. ఇంట్లో తను చేసే పనులనే వీడియో రికార్డ్ చేసి..యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం కొత్తగా అనిపించినా ఉత్సాహంగా చేసేవారు. 'ఎన్.ఎస్. క్రియేటివ్ కలెక్షన్స్  (NS Creative Collections) పేరిట యూట్యూబ్‌ ఛానల్ ప్రారంభించారు. అందులో తను తయారుచేసే క్రాఫ్ట్‌ వర్క్‌ను అంతా వీడియో తీసి అప్‌లోడ్‌ చేపేవారు. ఆ వీడియోలకు వ్యూస్‌ పెరగడం.. నెటిజన్ల నుండి అపూర్వ స్పందన రావడంతో... రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు. అలా తన ప్రయాణంలో మొదటి సంపాదన అందుకున్న రోజు మరువలేనిదని అంటున్నారు సాహితి. ఇక ఆ తర్వాత ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.

ఇదీ చదవండి : సొంత పార్టీపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. పవన్ పై గౌరవం ఉందన్న బాలినేని

అద్భుత కళాకృతులు తయారుచేస్తున్న సాహితి

మనకు రెగ్యులర్‌గా ఇంట్లో దొరికేవి మహా అయితే తక్కువ ఖర్చుకి లభించే వస్తువలతోనే క్రాప్ట్‌ మేకింగ్‌, డై (DIY) ఐడియాలు ఇస్తున్నారు. సాహితీ ఐడియాలకు మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. రంగురంగుల పేపర్స్, ఊలుదారాలు, అగ్గిపెట్టలు, కోడిగుడ్డు ట్రేలు, స్ట్రాలు, లగేజ్‌ పేపర్స్‌, సోప్‌ కవర్లు, టిష్యూపేపర్లు… ఇలా మనకు ఈజీగా దొరికే వాటితోనే ఇంట్లో అందంగా అలంకరించుకునేలా ఆకర్షణీయంగా తయారుచేస్తున్నారు.

ఇదీ చదవండి : ఎద్దుల కుమ్ములాటలో న్యాయవాదికి గాయాలు.. కార్పొరేషన్ అధికారులపై కేసు

ప్రతి పండుగకు ప్రత్యేక థీమ్‌తో వీడియోలు..

పండుగల సీజన్‌కు తగ్గట్లుగా సబ్‌స్క్రైబర్ల కోసం ప్రత్యేక వీడియోలు చేస్తుంటారు. అది క్రిస్మస్‌ సీజన్‌ అయితే… క్రిస్మస్‌ డెకరేషన్‌ క్రాఫ్ట్‌ ఐడియాలు.. అంటే క్రిస్మస్‌ ట్రీ, స్టార్‌ ఇలా ఆ పండుగకు సంబంధించిన డెకరేటివ్‌ క్రాఫ్ట్‌ మేకింగ్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తుంటారు. పాథర్స్‌ డే, సంక్రాంతి, మథర్స్‌డే, వాలింటన్స్‌ డే.. కలర్‌ఫుల్‌ పేపర్‌లతో ఎన్నో రకాల ఫ్లవర్స్‌, ఫ్లవర్‌ బుకే (Flower bouquet), పేపర్ వాల్‌ డెకర్‌ (Paper wall décor), గిఫ్ట్‌ కార్డులు( Gift cards), గిఫ్ట్‌ వ్రాపింగ్‌( Gift Wrapping), వాల్‌ హ్యాంగింగ్స్‌ (Wall hangings), డేకరేటివ్‌ ఐటమ్స్‌ (decorative Items), ఫ్లవర్‌ వాజ్‌లు తయారుచేస్తూ వ్యూయర్స్‌కు ఐడియలను ఇస్తుంటారు.

ఇదీ చదవండి : వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం.. అందుబాటులోకి ఇగ్లూ థియేటర్.. ప్రత్యేకతలు ఏంటంటే?

ఒక్క వీడియోకే 60M వ్యూస్‌..!

వాలెంటేన్స్‌ డేకు సాహితి తయారుచేసిన హార్ట్‌ షేప్‌ క్రాఫ్ట్‌ 60మిలియన్‌ వ్యూస్‌ అందుకుందంటే మాటలు కాదు. అది కేవలం రెడ్‌ కలర్‌ లగేజ్‌ బ్యాగ్‌తో చాలా సింపుల్‌గా హార్ట్‌ను తయారుచేశారు. దాన్ని నెటిజన్లు గొప్పగా ఆదరించారు. కొంతమంది అయితే తమ క్రాఫ్ట్‌ మేకింగ్‌ కాంపీటిషన్స్‌కు సాహితి చేసే వర్క్‌నే తీసుకుని గెలుస్తూ ఉంటారు.

1M సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకున్న సాహితి

దేశవిదేశాల్లో కలిపి ఇప్పుడు సాహితీ యూట్యూబ్‌ ఛానెల్‌కు 1 మిలియన్‌ అంటే అక్షరాల పది లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. 2018 డిసెంబర్‌లో ప్రారంభించిన సాహితీ యూట్యూబ్‌ ఛానెల్‌.. మూడున్నారేళ్లలోనే 10లక్షలమంది సబ్‌స్క్రైబర్స్‌ను పొందడం అంటే మాములు విషయం కాదు. అందులో 30శాతం మంది విదేశీయులు ఉన్నారు. మొదటిగా మూడు నెలలకే లక్ష వ్యూస్‌ రావడంతో యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అవార్డును సాహితి సొంతం చేసుకున్నారు. ఇవి మూడు సంవత్సరాలకు గాను పది లక్షలకు చేరిన తరువాత గోల్డ్ ప్లే బటన్ పురస్కారం దక్కింది. తద్వారా ప్రస్తుతం సాహితి నెలకు రూ. 50 వేల నుంచి లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు.

ఇదీ చదవండి : ఆ చేపల చెరువుకు ఏమైంది..? భారీ సంఖ్యలో ఎందుకు చనిపోతున్నాయి? స్థానికులు ఏం చేశారంటే

డైమండ్‌ ప్లే బటన్‌ అవార్డు సాధించడమే నా లక్ష్యం : సాహితి

ఎవ్వరికైనా ఇంటరెస్ట్‌ ఉంటే ఫ్రీగా నేర్చించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సాహితీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సబ్‌స్బ్రైబర్ల సంఖ్య పెంచుకునేలా ప్రజలకు మరింత చేరువయ్యేలా క్రాఫ్ట్ వర్క్‌ మేకింగ్‌లో మరింత సృజనాత్మకత జోడిస్తానంటున్నారు సాహితీ. ఆ తర్వాత డైమండ్ ప్లే బటన్ సాధించడమే లక్ష్యంగా మరిన్ని కళాకృతులతో ముందుకు వెళ్తానంటున్నారు సాహితీ.


అడ్రస్ : నర్సీపట్నం, అనకాలపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 531116

సాహితీ యూబ్యూబ్ ఛానెల్ : NS Creative Collections

ఫోన్ నెంబర్ : 9030824624

జీమెయిల్ ఐడీ : ns4creativecollections@gmail.com

URL ID : https://www.youtube.com/c/NSCreativeCollections

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag