హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆంధ్రాలో హాంగ్ కాంగ్ చికెన్.. ఒక్కసారి తింటే అదే కావాలంటారు..

ఆంధ్రాలో హాంగ్ కాంగ్ చికెన్.. ఒక్కసారి తింటే అదే కావాలంటారు..

X
హాంగ్

హాంగ్ కాంగ్ చికెన్ టేస్ట్ అదుర్స్

ఈ రోజుల్లో వెరైటీ ఫుడ్ అంటే ఇష్టపడనివారుండరు. అందుకే విదేశీ వంటకాలకు కూడా ఇక్కడ డిమాండ్ ఉంటుంది. మన రెస్టారెంట్లలో మెనూ కార్డ్ చూస్తే చాలు దాదాపు అన్నీ వెస్టర్న్ డిషెస్ లిస్ట్ కనిపిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Narsipatnam | Visakhapatnam | Andhra Pradesh

Setti Jagadeesh, News 18, Visakhapatnam

ఈ రోజుల్లో వెరైటీ ఫుడ్ అంటే ఇష్టపడనివారుండరు. అందుకే విదేశీ వంటకాలకు కూడా ఇక్కడ డిమాండ్ ఉంటుంది. మన రెస్టారెంట్లలో మెనూ కార్డ్ చూస్తే చాలు దాదాపు అన్నీ వెస్టర్న్ డిషెస్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో అందరికీ నోరూరించే వంటకం హాంకాంగ్ చికెన్. చైనీస్ వంటకం అయిన స్టార్టర్ చేయడం చాలా సులభం అంటున్నారు అనకాపల్లి జిల్లా (Anakapalli District) నర్సీపట్నంలోని నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్ చెఫ్ హిబ్రం ఖాన్. ఈ హాంకాంగ్ చికెన్ చిన్నపిల్లలు, యుక్తవయసులో వారు కూడా చాలా ఇష్టపడతారు.. నర్సీపట్నంలో చికెన్ ప్రేమికుల ట్రెండ్ గా ఈ చికెన్ మారింది. ఈ చికెన్ ను వేయించి, కాల్చి, ఆవిరిలో ఉడికించండి - మీకు కావలసిన విధంగా తినవచ్చు అంటున్నారు.

చికెన్ ఏ విధంగా వండినా దాని రూపం, రుచి మారొచ్చుగానీ అందులోని ప్రొటీన్స్, పోషకాల్లో ఎలాంటి తేడా ఉంటుందంటున్నారు. ఈ హాంకాంగ్ చికెన్ కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు సులభంగా జీర్ణమవుతుందని చెఫ్ హిబ్రం ఖాన్ అంటున్నారు. ఈ వంట ను 6-10 నిమిషాల్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చట.

ఇది చదవండి: నాటుకోడి తెలుసు.. మ‌రి కోస మాంసం రుచి ఏలా ఉంటుందో తెలుసా..!

హాంకాంగ్ రెసిపీ కోసం కావలసినవి పదార్ధాలు.. బొన్ లెస్ చికెన్ బ్రెస్ట్ 400 గ్రాములు తీసుకోవాలి.. తర్వాత నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తగినంత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఈ చికెన్ కి రుచికి నల్ల మిరియాలు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కార్న్ పౌడర్ వేసుకోవాలి.. 400 గ్రాములకి కార్న్ స్టార్చ్ 3 టీస్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఆకుకూరలతో కూడిన ఉల్లిపాయలు వేసుకోవాలి.

ఇది చదవండి: రేగు పండ్లు తింటే ఆ సమస్యలకు చెక్.. వాటిలోని పవర్ ఇదే..!

తర్వాత ఎండు మిరపకాయలు 2-3 మరియు అల్లం 1 అంగుళం ముక్కలు వేసుకుంటే చాలా రుచి వస్తుంది. తర్వాత వెల్లుల్లి తరిగిన 1 టేబుల్ స్పూన్ మరియు గ్లే రెడ్ చిల్లీ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ మరియు రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ తర్వాత సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ మరియు చికెన్ స్టాక్ 4 కప్పు + 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.. చక్కెర 1 టీస్పూన్ • వెనిగర్ 1 టీస్పూన్ వేసుకుంటే మీ హాంకాంగ్ చికెన్ రెడీ అవుతుంది.

ఇది కొంచెం కారంగా స్పైసీగా ఉండడంతో అధిక శాతం యువకులు పార్టీలకు ముక్కు చూపిస్తున్నారని చెప్పమంటున్నారు. ఇటీవల నర్సీపట్నంలో కొత్తగా నాయుడుగారి కొండ బిర్యాని రెస్టారెంట్ పెట్టడంతో ఈ హాంకాంగ్ చికెన్ ఫేమస్ గా మారింది. అధిక సంఖ్యలో యువత వచ్చి కొనుగోలు చేసి టేస్ట్ అదుర్స్ అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Chicken, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు