Paiditalli ammavari Panduga 2022: ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం.. ఆరాథ్య దైవం అయిన పైడితల్లమ్మ (Paiditalli Ammavaru) ఉత్సవం సందడిగా సాగుతోంది. మరోవైపు భక్త కోటి ఎదురుచూస్తున్న పైడితల్లమ్మ సిరిమానోత్సవం (Sirimanotsavam) సమయం వచ్చేసింది. కొద్ది గంటల్లో అపూర్వ సంబరం ఆవిష్కరణ కానుంది. వేయికన్నులతో ఎదురుచూస్తున్న భక్తుల చెంతకే అమ్మవారు రానున్నారు. ఈ సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ఊరేగింపు ఆరంభం కానుంది. రెండు గంటల పాటు అమ్మవారు తిరిగేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ 3 గంటలు అయ్యేసరికి సిరిమానోత్సవం ప్రారంభం అయ్యేలా చూడాలని భావిస్తున్నారు. సిరిమాను హుకుంపేట నుంచి చదురుగుడి వద్దకు చేరుకునేసరికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యే అవకాశం వుంది. ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు నిర్ణయించారు. హుకుంపేటలో ఉదయం 11 గంటలకే బయలుదేరాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 2 గంటలకు మూడులాంతర్ల వద్దకు చేరుకుంటే.. గంట సమయంలో అక్కడ మిగతా పూజాది కార్యక్రమాలు నిర్వహించి అనుకున్న సమాయానికి సిరిమాను ఊరేగింపు ప్రారంభం కానుంది.
పట్టువస్త్రాలను సమర్పించనున్న మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం తరుపున పైడిమాంబకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ , ఆయన సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ తదితరులు కూడా పైడిమాంబను మంగళవారం దర్శించుకోనున్నారు.
ఇదీ చదవండి : ప్రయాణం వారికి నరకంగా మారింది..? గ్రామస్తుల టెన్షన్ దేనికో తెలుసా..?
మరోవైపు సాంప్రదాయం ప్రకారం సిరిమానోత్సవాన్ని కోట బురుజుపై నుంచి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు వీక్షించనున్నారు. కోట వద్ద వున్న డీసీసీబీ కార్యాలయం ఎదుట నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు తిలకిస్తారు.
మగువలు మెచ్చే పట్టు చీరలకు ఆ ఊరు పెట్టింది పేరు..! ఆ డిజైన్స్ చూస్తే మతిపోవాల్సిందే..!
పైడి తల్లి అమ్మవారి చరిత్ర : మహారాజుల ఇంట ఆ కనకదుర్గమ్మ... పైడితల్లిగా జన్మించింది. ఐతే... ఎప్పుడూ సామాన్యురాలిలా ప్రజల మధ్యే బతికింది. అదే సమయంలో... విజయనగరం , బొబ్బిలి రాజ్యాల మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం వద్దని పైడితల్లి కోరినా... ఎవరూ ఆమె మాట వినలేదు. రెండు రాజ్యాల రాజులూ చనిపోవడంతో... తీవ్ర ఆవేదన చెందిన పైడి తల్లి... పెద్ద చెరువులో దూకి అంతర్థానమైంది. కొన్నాళ్లకు పతివాడ అప్పలనాయుడి కలలో కనిపించిన అమ్మ... తాను చెరువులో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పింది. వెంటనే ఊరంతా వెళ్లి చెరువులో వెతకగా పైడితల్లి అమ్మవారి విగ్రహం కనిపించింది. దాంతో అక్కడే అమ్మవారికి వనం గుడి కట్టి... పూజలు చేస్తున్నారు.
ఇదీ చదవండి : మగువలు మెచ్చే పట్టు చీరలకు ఆ ఊరు పెట్టింది పేరు..! ఆ డిజైన్స్ చూస్తే మతిపోవాల్సిందే..
ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో... మూడు లాంతర్ల ప్రాంతంలో మరో పెద్ద ఆలయాన్ని నిర్మించారు. అక్కడ ఏటా ఆరు నెలలు ఉత్సవాలు చేస్తున్నారు. వాటిలో ప్రసిద్ధమైనది సిరిమాను ఉత్సవం. సిరిమాను అనేది చింతలు తీర్చే చింతచెట్టు మాను. పైడి తల్లికి ప్రతిరూపంగా ఆలయ పూజారి సిరిమానుపైకి ఎక్కి భక్తులను దీవిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Hindu festivals, Vizianagaram