AP Elections Winners: ఆ జిల్లాలో మహిళే మహారాణులు... పార్టీ ఏదైనా వారిదే రాజ్యం..

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇటీవలే పరిషత్ ఎన్నికల ఫలితాలు (Parishat Elections Result) వెలువడ్డాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party) 90శాతం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కైవసం చేసుకుంది.

  • Share this:
    P. Anand Mohan, Visakhapatnam, News18

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇటీవలే పరిషత్ ఎన్నికల ఫలితాలు (Parishat Elections Result) వెలువడ్డాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party) 90శాతం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కైవసం చేసుకుంది. టీడీపీ(Telugu Desham Party), జనసేన (Janasena Party) కూడా పలుచోట్ల విజయాలు సాధించాయి. ఐతే ఓ జిల్లాలో మాత్రం పార్టీలకతీతంగా మహిళళు విజయబావుటా ఎగురవేశారు. పార్టీ ఏదైనా తమదే రాజ్యమని నిరూపించుకున్నారు. ఆ జిల్లాలో మహిళలే నెంబర్ వన్ గా నిలిచారు. జిల్లా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మహిళలే సింహభాగం స్థానాల్ని గెలుచుకున్నారు. ఆ జిల్లాలనే రాష్ట్రంలో పెద్దదైన తూర్పుగోదావరి జిల్లా (East Godavari District). ఈ జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మహిళలే విజేతలుగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా జడ్పిటిసి ఎన్నికల్లో మహిళలే మహారాణులు అయ్యారు. ఎన్నికల్లో వాళ్ళ ప్రభంజనం దాదాపుగా అన్ని స్థానాల్లోనూ అంటే సింహభాగం స్థానాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

    తూర్పుగోదావరి జిల్లాలాని ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల్లో మహిళలే నెంబర్ వన్ అయ్యారు. 28 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలు బాగా రాణించారు. అటు వైఎస్ఆర్సీపీతో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో మహిళల ఆధిపత్యం కనిపించింది. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల విజేతల్లో అన్ని పార్టీల నుంచి ఈ దఫా మహిళలు సత్తా చాటారు. అధిక స్థానాల్లో విజయం సాధించి పాలన పగ్గాలు చేపట్టబోతున్నారు. వీరిలో చాలామంది నిన్నమొన్నటి వరకు సాధారణ గృహిణులు కాగా ఇప్పుడు జిల్లా పరిషత్‌ పాలనలో తమ దైన ముద్ర వేయబోతున్నారు.

    ఇది చదవండి: చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మంత్రి కొడాలి నాని సవాల్


    ముఖ్యంగా ఎంపీటీసీల విషయానికి వస్తే జిల్లాలో 999 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇందులో 412 మంది విజేతలు గృహిణులే కావడం విశేషం. వీరిలో అత్యధిక శాతం మందికి వివిధ పార్టీల నుంచి బరిలో దిగారు. అయితే ఆయా ప్రాంతాల్లో రిజర్వేషన్లు పరంగా కొందరు పోటీలో నిలబడాల్సిన వచ్చింది. మరికొందరు ఈ ఎన్నికలతోనే రాజకీయ ఆరంగ్రేటం చేశారు. గృహిణులు తర్వాత అత్యధిక ఎంపీటీసీ విజేతల్లో రైతులు, వ్యాపారులు ఉన్నారు. అటు ఎంపీటీసీల విద్యార్హతలు పరిశీలిస్తే డిగ్రీ, పీజీ చదివిన వాళ్లు కేవలం 50 మందిలోపే ఉన్నారు. పదిలోపు అర్హత అంటే రెండో తరగతి, నాలుగో తరగతి, అయిదు, ఆరు చదివిన వాళ్లు 315 మంది ఉన్నట్టు తేలింది. అసలేమీ చదువుకోని నిరక్షరాస్యులైన ఎంపీటీసీలు 120 మందిగా నామినేషన్ల లెక్కల ప్రకారం గుర్తించారు. మిగిలిన వారంతా ఇంటర్‌లోపే ఉన్నారు.

    ఇది చదవండి: ఆ విషయంలో ఏపీ నెంబర్ వన్... సీఎం జగన్ కీలక ప్రసంగం...


    అలాగే జడ్పీటీసీల విషయానికి వస్తే 61స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇందులో జడ్పీటీసీలుగా గెలిచిన మహిళల్లో 32 మంది గృహిణులే కావడం విశేషం. ఆతర్వాత 11 మంది రైతులు, ఇద్దరు రిటైర్డ్‌ ఉద్యోగులు ఉన్నారు. విద్యార్హతల విషయానికి వస్తే జడ్పీటీసీల్లో ఇంటర్‌ చదివినవారు 13, డిగ్రీ 21, పదిలోపు చదు వుకున్నవాళ్లు అయిదుగురు, ఐటీఐ 1, బీటెక్‌ 1, ఫార్మసీ చది విన వారు ఒకరున్నారు. కాగా శంఖవరం మండలం వైసీపీ జడ్పీటీసీగా విజయం సాధించిన మల్లేశ్వరి (28). జడ్పీటీసీలందరిలో పిన్నవయస్కురాలిగా నిలిచారు.
    Published by:Purna Chandra
    First published: