హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మన్యంలో ఆ తరహా దుస్తులకు గిరాకీ.. ఏడాదికి 9 నెలలపాటు డిమాండ్..!

మన్యంలో ఆ తరహా దుస్తులకు గిరాకీ.. ఏడాదికి 9 నెలలపాటు డిమాండ్..!

వైజాగ్

వైజాగ్ ఏజెన్సీలో ఉన్ని దుస్తులకు గిరాకీ

విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఎముకలు కొరికే విధంగా చలితో జనాలు గజగజా వణుకుతున్నారు. ఈ ఏడాది చలికాలం మొదలయిన నాటి నుండి నేటి వరకుచలిపులి పంజా విసరడం బాగా పెరిగింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam | Andhra Pradesh

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  అబ్బబ్బ ఓ వైపు వానలు.. మరోవైపు చలి తట్టుకోలేకపోతున్నాం.. ఈ మాటలు ప్రతి రోజు అందరి ఇళ్లలో వినే మాట..! మిగత రోజల కన్నా ఈ కార్తీకమాసంలో చలి ఎలా ఉందంటో.. ఎముకలు కొరికే చలి అంటారు కాదా! అలానే ఉంది. మిగత ప్రాంతాల్లో కంటే ఈ జిల్లాలో మాత్రం చలి మాములుగా ఉండదు. అబ్బబ్బ తట్టుకోలేము అనుకోండి. దీంతో అక్కడో చలి కోట్లకు వీపరీతమైన డిమాండ్ పెరిగిదంటా.. ఇంతకు మీరు చలికోటు కొనుక్కున్నారా.. ఏ స్పెషల్ గా విశాఖపట్నం (Visakhapatnam) ఏజెన్సీ వాసులు. అయితే వెళ్లి కొనండి. విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఎముకలు కొరికే విధంగా చలితో జనాలు గజగజా వణుకుతున్నారు. ఈ ఏడాది చలికాలం మొదలయిన నాటి నుండి నేటి వరకుచలిపులి పంజా విసరడం బాగా పెరిగింది.

  ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పడిపోతుంది. దీంతో తగ్గిన ఉష్ణోగ్రతలతో చలి మరింత విజృంభిస్తోంది. చలితీవ్రతకు మనుషులు తో పాటు మూగజీవాలు కూడా వణికిపోతున్నాయి. మన్యంలో చలి పెరగడంతో చలికోట్లు మంకీ క్యాప్లు అమ్మే దుకాణదారులకు గిరాకీ పెరిగింది అంటున్నారునిర్వాహకులు. అధిక సంఖ్యలో పర్యాటకులు మన్యం వస్తున్నారని ఎక్కువ సేల్ అవుతుందని అంటున్నారు.

  ఇది చదవండి: విన్యాసాలు చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ..! సాగర్ తీరంలో నేవీ డే శోభ

  సాధారణంగా చలికాలంలో అందరూ దుస్తులపై శ్రద్ధ వహిస్తారు. సాధ్యమైనంత వరకు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు చలికొట్లు, మకీ క్యాప్ లు వేసుకుంటారు. అయితే ఈ కాలంలోతమకు చాలా డిమాండ్ ఉంటుంది అంటున్నారు. చలికొట్లు అమ్మే నిర్వాహకులు. ప్రత్యేకంగా చలికివేసుకునే దుస్తులు తమ వద్ద అందుబాటులో ఉంటాయి అంటున్నారు.

  ఇది చదవండి: విశాఖ వాసులకు ఇది నిజంగా గుడ్ న్యూస్.. కీలక ప్రాంతానికి కొత్త హంగులు.. వివరాలివే..!

  చలిని తట్టుకోవడానికి మామూలుగా వేసుకునే డ్రెస్సులతోపాటు ఈ చలి కోట్లు స్పెటర్స్ ఎక్కువగా కొంటారు అంటున్నారు. శీతాకాలం అంతా తమకు చాలా డిమాండ్ ఉంటుందని తర్వాత సీజన్లో చాలా తక్కువ ఉంటుందని అంటున్నారు. ఈ సీజన్లో ఈ దుస్తుల విక్రయిస్తూ వేసవిలో సాధన దుస్తులు అమ్మకాలు చేస్తూ ఉంటామని అంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam