Setti Jagadeesh, News 18, Visakhapatnam
తీపి లేనిదే శుభకార్యం జరగదు.. తీపి లేనిదే పండుగ కూడా జరగదు. అలాంటి తీపి వంటకాలు కావాలంటే బెల్లం ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బెల్లం పేరుచెబితే ఠక్కున గొర్తొచ్చేది అనకాపల్లి. అనకాపల్లి జిల్లా (Anakapalli District) లో రైతులు అధిక సంఖ్యలో బెల్లాన్ని తయారు చేస్తారు. రుచిలో తానే సాటి అంటుంది అనకాపల్లి బెల్లం.. ఏపీలో అనకాపల్లి బెల్లం చాలా ఫేమస్ . అనకాపల్లి బెల్లం (Anakapalli Jaggery) అంటే ఓ ప్రత్యేకత. ఈ అనకాపల్లి బెల్లం ఆంధ్ర రాష్ట్రాలకే కాదు విదేశాలలో కూడా ఎగుమతి అవుతుంది. ఆసియాలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ అంటే అనకాపల్లిదే. చాలా ప్రాంతాల్లో బెల్లం నిలువ ఉంచేందుకు వాటి సారాన్ని అనుగుణంగా కొంతవరకు రసాయనలు వాడుతూ ఉంటారు.
అనకాపల్లి జిల్లాలోని రసాయనాలు కలపకుందా బెల్లం వంట చేయడం జరుగుతుంది. అనకాపల్లి బెల్లం ఫేమస్ కావడం తో సంక్రాంతి , ఉగాది సీజన్లో బెల్లం కోసం క్యూ కడతారు. ఎందుకంటే స్వచ్ఛమైన బెల్లాన్ని రైతు తయారు చేస్తుంటారు. అందుకే ఇక్కడి బెల్లానికి ఎక్కడాలేని డిమాండ్ ఉంటుంది.
బెల్లం ఎలా తయారు చేస్తారు..
ఆరు నెలలో రైతులకు చెరకు పంట చేతికి వస్తుంది. ఆ చెరకు ను మొదటికి తొలగించి ముందుగా ఏర్పాటు చేసిన క్రషర్ వద్దకు తీసుకు వస్తారు. అలా తీసుకు వచ్చిన చెరకును క్రషర్ లో పెట్టి ముందుగా రసం తీసుకుంటారు. అనంతరం తోట్టెలోకి వచ్చిన చెరకు రసాన్ని పెనంలో వేస్తారు. పెనంలో వేసిన చెరకు రసంను కనీసం నాలుగు గంటల పాటు కింద మంట పెట్టి బాగా మరిగిస్తారు.
బాగా మరిగిన చెరకు రసం మధ్యలో వ్యర్థ పదార్ధాలు అన్ని పైకి తేలి రావడం జరుగుతుంది. అలా వచ్చిన వ్యర్థ పదార్థాలు తీసివేసి మరో గంట పాటు మంట పెడతారు. అప్పుడు బెల్లం పాకం తయారీ అవుతుంది. పాకం అయిన తరువాత బాగా పెనంలో చల్లార్చుతారు. అలా చల్లార్చిన బెల్లంను బుట్టలో వేసి వాటిని మార్కెట్ కి తరలిస్తారు.. 15 కేజీల బెల్లపు ముద్ద ఒక్కొక్కటి 600 రూపాయలు వరకు ధర పలుకుతుంది. ఈ బెల్లాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఇటీవల ధరల్లో హెచ్చుతగ్గులుండటంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. గతంలో కళకళలాడిన అనకాపల్లి బెల్లం మార్కెట్.. క్రమంగా కళను కోల్పోతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Jaggery, Local News, Visakhapatnam