Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM HERE IS THE LOOK OF RUTHERFORD GUEST HOUSE IN LAMBASINGI LOST ITS IDENTITY WHICH WAS FAMOUS DURING ALLURI SITARAMARAJU TIME INVISAKHAPATNAM AGENCY ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSJ NJ

Lambasingi: అల్లూరిని కాల్చిచంపిన రూథర్‌ఫర్డ్‌ బంగ్లా.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!

లంబసింగిలో

లంబసింగిలో రూథర్ ఫర్డ్ బంగ్లా

అల్లూరి సీతారామరాజు (Alluri Sitharama Raju). ఆయన పేరు చెబితేనే మన్యం పులకించిపోతుంది. మన్యం వీరుడ్ని తలుచుకొని ఇప్పటికీ అడవి బిడ్డలు స్ఫూర్తి పొందుతారు. స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన ఉద్యమం గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.

ఇంకా చదవండి ...
  Setti Jagadeesh, News18, Visakhapatnam

  అల్లూరి సీతారామరాజు (Alluri Sitharama Raju). ఆయన పేరు చెబితేనే మన్యం పులకించిపోతుంది. మన్యం వీరుడ్ని తలుచుకొని ఇప్పటికీ అడవి బిడ్డలు స్ఫూర్తి పొందుతారు. స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన ఉద్యమం గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. అల్లూరి సీతారామరాజు గురించి విశాఖ మన్యంలో ఏ చెట్టు పుట్టని అడిగినా చెబుతాయి. విశాఖ ఏజెన్సీలో ప్రకృతి అందాలతో పాటుచారిత్రాత్మక కట్టడాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో రూథర్ ఫార్డ్ బంగ్లా ఒకటి. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం, లంబసింగి గ్రామానికి కొద్ది దూరంలోనే ఉంటుంది. లంబసింగి నుండి పాడేరు మార్గమధ్యంలో ఉన్న ఈ బంగ్లాను చూసేందుకు ఒకప్పుడు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు ఈ భవంతి శిథిలావస్థకు చేరుకుంది. ఎందుకంటే..!

  లంబసింగి దగ్గరలో బ్రిటిష్‌ కలెక్టర్‌ భవంతి
  బ్రిటిష్ పరిపాలనలో కలెక్టర్‌గా వచ్చిన రూథర్ ఫార్డ్‌ (Rutherford) కి విశాఖపట్నం జిల్లా , లంబసింగిలో గల ఈ భవనం ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా బంగ్లా ఇచ్చి నియమించడానికి గల ప్రధాన కారణం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. అతన్ని పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం రూథర్‌ఫర్డ్‌ను పంపించారు.

  ఇది చదవండి: ఏపీలో వింత జంతువు కలకలం.. హడలిపోతున్న రైతులు.. అధికారుల హెచ్చరిక..


  బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి
  మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) మన దేశ స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పరిపాలన (British government)కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆంగ్ల విద్యను తిరస్కరించి భారతీయుల సనాతన యోగవిద్యను అభ్యసించాడు. దేశమంతా పర్యటించి బ్రిటీష్ పరిపాలనలో కష్టాలు సమస్యలు అర్థం చేసుకుని అహింసా విధానాన్ని(Non-violence) తిరస్కరించాడు. మన్యం ప్రాంతంలో శ్రమదోపిడీ, ప్రకృతి వనరుల దోపిడీ చూసి చలించిపోయి, అక్కడి ప్రజల్లో తిరుగుబాటను ప్రోత్సహించాడు అల్లూరి సీతారామరాజు. గంటదొర, మల్లుదొర వంటివారి సహకారంతో ప్రజలను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు.

  ఇది చదవండి: ఈ కోళ్లను కొనాలంటే ఆస్తులమ్ముకోవాలి.. వాటికున్న డిమాండ్ అలాంటిది మరి.. మీరే చూడండి..!


  బ్రిటీష్‌ వాళ్లకు చెందిన పోలీసు స్టేషన్ల (Police station)పై దాడిచేసి ప్రజలపై అక్రమంగా బనాయించిన కేసు పత్రాలను(case papers) చించి, ఆయుధాలను(arms) అల్లూరి స్వాధీనం చేసుకున్నాడు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజును బంధించాలని చాలా ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమై… విప్లవ వీరులు విజయం సాధించేవారు. దీంతో రామరాజును అరెస్ట్‌ చేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుని రూథర్‌ఫార్డ్‌ను కలెక్టర్‌గా మన్యంకు పంపింది.

  ఇది చదవండి: భీముడు కూర్చున్న కుర్చీ ఇక్కడే ఉంది.. పాండవులు నివాసమున్నదీ అక్కడే..!


  1924లో అల్లూరి కాల్చివేత
  బ్రిటీష్ కలెక్టర్ రూధర్ ఫర్డ్ కు ప్రత్యేక బంగ్లాను కేటాయించింది. ఈ బంగ్లాలో ఉంటూ చుట్టూ ప్రక్కల మన్యంలోని గ్రామాలపై దాడులు చేసి, ప్రజలను హింసించి సీతారామరాజును స్వయంగా బయటకు రప్పించాడు. రూధర్ ఫర్డ్, ఇతర అధికారులు వ్యక్తిగతంగా సీతారామరాజు సత్య నిష్ఠకీ, పోరాటంలోని నిజాయితీకి ఆకర్షితులైనా, వృత్తిధర్మంలో భాగంగా సీతారామరాజును 1924 మే 7న కాల్చి చంపుతారు.

  ఇది చదవండి: ఈ ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ అవసరం లేదు.. ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు..


  బ్రిటిషర్ల బంగ్లాని పేల్చేసిన నక్సల్స్‌
  అప్పట్లో రాజమందిరంలా ఉన్న ఈ బంగ్లాని.. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డిపార్ట్‌మెంట్‌ (AP tourism Department) టూరిస్ట్‌ ప్లేస్‌గా గుర్తించినా..కాలక్రమేణా పాత పడిపోయింది. బ్రిటిషర్ల మీద ఉన్న కోపంతో… మన్యంలో ఉన్న నక్సల్స్ వచ్చి ఈ భవనాన్ని పేల్చి వేశారు. దీంతో అప్పటి నుంచి ఈ భవనం ఇంకాస్త నిరాదరణకు గురైంది. పర్యాటకులు వచ్చి చూసినా కూలిన భవనం కాస్త చూసి వెనుతిరుగుతున్నారు.పర్యాటక శాఖ అధికారులు పట్టించుకుని ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. పర్యాటకులు (Tourists) వస్తే తమకు కాస్త ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: ముగ్గురు మిత్రుల వినూత్న ఐడియా.. ఇప్పుడు కాసులు కురిపిస్తోంది..!


  సూపర్‌ స్టార్‌ కృష్ణ సినిమా షూటింగ్‌ అంతా ఇక్కడే..!
  సూపర్‌ స్టార్‌ కృష్ణ (super star Krishna) తెలుగులో ఫస్ట్‌ కలర్‌ సినిమా (Color movie)గా అల్లూరి సీతారామారాజు చరిత్రను సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫిస్‌ వద్ద కలెక్షన్‌ల వర్షమే కాదు…రికార్డుల మోత మోగించింది. ఈ అల్లూరి సీతారామరాజు సినిమా అంతా ఈ బంగ్లా వద్దే చిత్రీకరించారు. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న ఈ బంగ్లా అప్పట్లో రాజభవనాన్ని తలపించేంది. ఈ బంగ్లా విశిష్టత , విశేషాలు అన్ని తెలియాలంటే మరోసారి అల్లూరి సీతారామరాజు సినిమాలో చూడండి.

  ఇది చదవండి: రాయలసీమ రతనాల సీమ ఎలా అయింది..? చరిత్ర తెలియాలంటే అక్కడికి వెళ్లాల్సిందే..!


  అక్కడ చూడదగ్గ మరో పర్యాటకప్రాంతం
  లంబసింగి..అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు. అల్లూరి సీతారమరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లంబసింగి (Lambasingi) గ్రామం ఆంధ్రా ఊటీగా పేరు గాంచింది. లంబసింగి గ్రామం సముద్ర మట్టానికి సుమారు 3600 అడుగుల ఎత్తులో ఉంది. ఏడాది పొడవునా ఈ ప్రాంతం శీతలంగా ఉంటుంది. అక్టోబరు మొదలుకుని ఫిబ్రవరి వరకు మంచు వర్షంలా (snow fall) కురుస్తూ… ఉదయం 10 గంటలకైనా మంచు వీడ కుండా శీతల గాలులు వీస్తు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో 1- 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు