హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag ODI: భారత్-ఆసీస్ వన్డే మ్యాచ్.. వైజాగ్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..!

Vizag ODI: భారత్-ఆసీస్ వన్డే మ్యాచ్.. వైజాగ్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..!

భారత్-ఆస్ట్రేలియా వన్డే సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు

భారత్-ఆస్ట్రేలియా వన్డే సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు

విశాఖపట్నం (Visakhapatnam) లో భారత్-ఆస్ట్రేలియా సెకండ్ వన్డే (India vs Australia 2nd ODI 2023) మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండు జట్లు నగరానికి చేరుకోగా.. మ్యాచ్ కోసం పోలీసులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వైజాగ్ సిటీ పోలీస్ (Vizag City Police) కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ నగర ప్రజలకు, క్రికెట్ మ్యాచ్ ను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకు కొన్ని సూచనలు జారీ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

విశాఖపట్నం (Visakhapatnam) లో భారత్-ఆస్ట్రేలియా సెకండ్ వన్డే (India vs Australia 2nd ODI 2023) మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండు జట్లు నగరానికి చేరుకోగా.. మ్యాచ్ కోసం పోలీసులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వైజాగ్ సిటీ పోలీస్ (Vizag City Police) కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ నగర ప్రజలకు, క్రికెట్ మ్యాచ్ ను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకు కొన్ని సూచనలు జారీ చేశారు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ జరిగే 19న ప్రజల సౌకర్యం కొరకు సూచనలు పాటించాలని కోరారు. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 10:30 వరకు జరగనుండగా స్టేడియం కెపాసిటీ 28,000లుగా తెలిపారు. మ్యాచ్ కోసం 28 వేల మంది రానుండగా.. వాహనాలు కూడా వేల సంఖ్యలో రానున్నాయి. దీంతో మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.

మ్యాచ్ కోసం వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, రూట్ల వివరాలను వైజాగ్ పోలీసులు విడుదల చేశారు. మ్యాచ్ తో సంబంధం లేని వాహనదారులు మధురవాడ క్రికెట్ స్టేడియం వైపు ప్రయాణించకుండా, వేరే మార్గాలలో ప్రయాణించాలని కోరారు. శ్రీకాకుళం , విజయనగరం , ఆనందపురం వైపు నుండి విశాఖపట్నం నగరంలోకి వచ్చే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు, మారికవలస వద్ద ఎడమ వైపుకి తిరిగి.. జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం చేరి, కుడి వైపు తిరిగి బీచ్ రోడ్డు లో ప్రయాణించి, ఋషికొండ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా వెళ్లాలని కోరారు.

ఇది చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్తగా ఐదు నైపుణ్యశిక్షణ కేంద్రాలు.. వివరాలివే..!

శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుండి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొదలైనవి, కార్ షెడ్ వద్ద నుండి మిధిలాపురి కాలనీ మీదుగా, ఎంవీవీ సిటీ వెనుకగా వెళ్లి, లా కాలేజీ రోడ్డు మీదుగా ఎన్ హెచ్ 16 చేరి నగరంలోనికి రావచ్చని సూచించారు. లా కాలేజీ రోడ్డు నుండి పనోరమ హిల్స్ మీదుగా ఋషికొండ మీదుగా కూడా నగరంలోకి వెళ్ళవచ్చునని చెప్పారు. విశాఖపట్నం నగరంలో నుండి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు, హనుమంతవాక నుండి ఎడమ వైపు తిరిగి, ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్లి అడివివరం వద్ద కుడి వైపు తిరిగి ఆనందపురం మీదుగా వెళ్ళవచ్చని చెప్పారు.

విశాఖపట్నం నగరం నుండి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొదలైనవి హనుమంతవాక జంక్షన్ నుండి ఎడమ వైపు తిరిగి, అడివివరం మీదుగా ఆనందపురం వెళ్ళవచ్చు. లేదా హనుమంతవాక జంక్షన్, విశాఖ వాలీ జంక్షన్, ఎండాడ జంక్షన్ వద్దకుడి వైపు తిరిగి, బీచ్ రోడ్డు చేరి, తిమ్మాపురం వద్ద ఎడమవైపు తిరిగి, మారికవలస వద్ద ఎన్హెచ్ 16 చేరవచ్చునని చెప్పారు.

భారీ వాహనాలకు సూచనలివే..!

19వ తేదీన ఉదయం 06:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు ఎటువంటి భారీ వాహనాలు మధురవాడ స్టేడియం వైపు అనుమతించబడవు. అనకాపల్లి నుండి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్ళాలి. శ్రీకాకుళం, విజయనగరం, వైపు నుండి అనకాపల్లి వైపు వెళ్ళు వాహనాలు నగరంలోకి రాకుండా ఆనందపురం నుండి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్ళాలి. విశాఖపట్నం నగరంలో నుండి బయలుదేరి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు భారీ వాహనాలు అన్నీ అనకాపల్లి వైపు వెళ్లి, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్ళాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుండి విశాఖపట్నం నగరంలోకి వచ్చు భారీ వాహనాలన్నీ.. ఆనందపురం నుండి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి, విశాఖపట్నం నగరం చేరవచ్చు.

మ్యాచ్ చూడడానికి వచ్చు వాహనదారులకు సూచనలు:

విశాఖపట్నం నగరం వైపు నుండి స్టేడియంకు వచ్చు వీవీఐపీ, వీఐపీ వాహనదారులు, ఎన్ హెచ్ 16లో స్టేడియం వరకు ప్రయాణించి, ఏ గ్రౌండ్, బీ గ్రౌండ్, వీ కన్వెన్షన్ గ్రౌండ్ లలో వారి వారి పాస్ ప్రకారం చేరవచ్చు. విశాఖపట్నం వైపు నుండి స్టేడియంకు వచ్చు టికెట్ హోల్డర్స్, ఎన్హెచ్ 16లో ప్రయాణించి, స్టేడియం వద్ద గల హోల్డ్ ఏజ్ జంక్షన్ వద్ద ఎడమ వైపు తిరిగి, సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకోవచ్చు. సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో ఆన్ లైన్ టికెట్స్ ను, ఒరిజినల్ టికెట్స్ గా మార్చుకొనుటకు కౌంటర్లు ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది వైపు నుండి వచ్చు వారు, కార్ షెడ్ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి, సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ పార్కింగ్ గ్రౌండ్ చేరవలెను. కార్ షెడ్ జంక్షన్ నుండి ఎడమ వైపు తిరిగి, మిధిలాపురి కాలనీ మీదుగా వచ్చి, ఎంవీవీ సిటీ డబల్ రోడ్డు, పోలిశెట్టి వేణుగోపాలరావు గ్రౌండ్ ల లో పార్కింగ్ చేయవలెను. విశాఖపట్నం నగరం నుండి లేదా భీమిలి వైపు నుండి బీచ్ రోడ్డు మీదుగా స్టేడియంకు వచ్చు వారు ఐటీ సెజ్ మీదుగా వచ్చి ఎంవీవీ సిటీ డబల్ రోడ్డు చేరి పార్కింగ్ చేసుకోవాలి.

విశాఖపట్నం నగరం నుండి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఎన్హెచ్ 16లో రాకుండా, బీచ్ రోడ్డు లో వచ్చి, ఐటీ సెజ్ మీదుగా వచ్చి, లా కాలేజీ రోడ్డులో పార్కింగ్ చేయవలెను. శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుండి వచ్చు ఆర్టీసీ స్పెషల్ బస్సులు, మారికవలస, తిమ్మాపురం, ఐటీ సెజ్ మీదుగా వచ్చి, లా కాలేజీ రోడ్డు చేరి పార్కింగ్ చేయవలెను. మ్యాచ్ వీక్షించడానికి వేల సంఖ్యలో వచ్చే ప్రేక్షకులు తమ వాహనాలను తమకు పైన నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. పూర్తి భద్రతతో ఎటువంటి అపశ్రుతులూ జరగకుండా స్టేడియం చుట్టూ బారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రేక్షకులు తమకు టికెట్స్ తో తమకు నిర్దేశించిన గేట్ల ద్వారా స్టేడియంలోనికి ప్రవేశించాలని ఈ సందర్బంగా తెలియజేశారు. ముఖ్యమైన పాయింట్లలో ఏసిపి స్థాయి అధికారులను నియమించగా.. స్టేడియం చుట్టూ మూడు అంచల భద్రత ఏర్పాటు చేశారు.

First published:

Tags: Andhra Pradesh, India vs australia, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు