Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM HERE ARE THE SPECIALTIES OF NIGHT BAZAR COURT IN VISAKHAPATNAM TAKE A LOOK AT SPECIAL DISHES FULL DETAILS HERE PRN VSJ NJ

Vizag News: వైజాగ్ వెళ్తే ఇక్కడికి వెళ్లడం అస్సలు మర్చిపోవద్దు.. ఫుడ్ లవర్స్ కి ఇదే బెస్ట్ ఛాయిస్

విశాఖలో

విశాఖలో నయా ట్రెండ్ నైట్ బజార్

విశాఖపట్నం (Visakhapatnam). ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో ఒకటి. ఇక్కడ ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. ఇటు బీచ్.. అటు ఏజెన్సీ ప్రాంతం కలగలిసిన ప్రాంతం విశాఖ. అందుకే అక్కడికి వెళ్లేందుకు చాలా మంది ఉత్సాహపడుతుంటారు.

ఇంకా చదవండి ...
  Setti Jagadeesh, News18, Visakhapatnam

  విశాఖపట్నం (Visakhapatnam). ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో ఒకటి. ఇక్కడ ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. ఇటు బీచ్.. అటు ఏజెన్సీ ప్రాంతం కలగలిసిన ప్రాంతం విశాఖ. అందుకే అక్కడికి వెళ్లేందుకు చాలా మంది ఉత్సాహపడుతుంటారు. ప్రకృతి అందాలతో పాటు వైజాగ్‌ (Vizag)లో ఫేమస్ అయిన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు తినడానికి .. అక్కడి స్పెషల్ రుచులను టేస్ట్ చేసేందుకు ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే. కేవలం మన వంటలే కాదు.. దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన కొన్ని వంటకాలు వైజాగ్‌లోనే అందుబాటులో ఉన్నాయి. చలికాలంలో బాగా కాల్చిన మొక్క జొన్న పొత్తుల నుంచి… ధమ్ బిర్యానీ వరకు ఇక్కడ అన్ని రకాల ఫుడ్‌ వెరైటీలు దొరుకుతాయి. ఇన్ని రకాల ఫుడ్‌లు మన కళ్ల ముందు కనిపిస్తుంటే…నోరూరుకుంటుందా…?

  జైల్‌ రోడ్డులో నైట్‌బజార్‌
  గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (UCD) విభాగం…ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర… మహిళా డిగ్రీ కాలేజీకి ఎదురుగా ఉన్న ఓల్డ్ జైలు రోడ్‌లో నైట్ బజార్ అనే డెడికేటెడ్ హాకర్స్ జోన్‌ను ప్రారంభించింది. ఇక్కడ లైసెన్స్‌ పొందిన ఫుడ్ ట్రక్కులు మాత్రమే ఉంటాయి. ఈ స్ట్రీట్ ఫుడ్‌లో దొరికే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రుచుల గుమగుమలకు ముగ్దులవకతప్పదు. తక్కువ బడ్జెట్లో వేడివేడిగా నోటికి నచ్చేలా రుచి చూడాలనుకుంటే స్ట్రీట్ ఫుడ్ను మించిన దారి మరొకటి లేదు. గుర్తింపు పొందిన, నాణ్యత గల స్ట్రీట్ ఫుడ్కు ప్రజాదరణ అంతా ఇంతా కాదు.

  ఇది చదవండి: విశాఖకే తలమానికం ఆ ప్రాంతం.. కానీ ఇప్పుడు శిథిలావస్థలో..


  కస్టమర్ల కోసం స్క్రీన్‌ షోలు
  ఓల్డ్‌ జైలు రోడ్డులో ఇంతకు ముందే వీధి వ్యాపారులు, ఫుడ్ ట్రక్కులు పెట్టుకుని…రాత్రి 10.30 గంటల దరకు ఫుడ్ జోన్‌ను నడిపేవాళ్లు. అయితే ఆ సమయాన్ని ఇంకాస్త పొడిగిస్తూ…నైట్‌ బజార్‌కి కొత్త రూపాన్ని ఇస్తూ, జివిఎంసి ఫుడ్ స్టాల్స్‌ కు ప్రత్యేక స్థలాలను కేటాయించింది. సరైన పార్కింగ్, సీటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఇడ్లీ, దోసె, నూడుల్స్‌, ఫ్రైడ్‌ రైస్‌, షావర్మాస్‌, మోమోస్‌, బిర్యానీలు, లస్సీ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ల నుంచి అనేక రకాల ఆహారాన్ని ఏర్పాటు చేశారు. అదనపు ఆకర్షణగా, క్రికెట్ మ్యాచ్‌లు, సినిమాలు మరియు పాటలను ప్రదర్శించేలా పెద్ద పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

  ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


  గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఫేమస్‌ వంటకాలన్నీ దొరుకుతాయ్‌..!
  నైట్‌ లైఫ్‌ను, మిడ్‌నైట్‌ ఫుడ్‌ను ఎంజాయ్‌ చేసే అభిరుచి ఉన్న వాళ్లకు ది బెస్ట్‌ ప్లేస్‌ ఇది. ఇక్కడ వెజిటేరియన్స్‌, నాన్‌వెజ్‌, చైనీస్‌..ఇలా ఎవరికి కావల్సిన ఫుడ్‌లు వాళ్లకు అందుబాటులో ఉంటాయి.నాన్ వెజ్ ప్రియులకు అన్ని వంటకాలు ఇక్కడ లభిస్తాయి. అందులో నగరవాసులకు చేపల పులుసు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ చేపలు పులుసు వైజాగ్‌ది అయితే ఇంకా ప్రత్యేకం అనే చెప్పాలి.

  ఇది చదవండి: ఆ ఇల్లే ఓ మాయాద్వీపం.. అంతకంటే పెద్ద మ్యూజియం.. అక్కడ అద్భుతాలెన్నో..


  అప్పుడే సముద్రతీరానికి వెళ్లి.. ఫ్రెష్‌గా పట్టిన చేపలతో ఈ పులుసును వండుతారు. అదొక్కటేనా… మటన్, చికెన్ కెబాబ్స్, చీకులు, నాటు కోడికి పులుసు, హైదరాబాద్ ధమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్, చిల్లీ చికెన్, తందూరీ… ఇలా ఎన్నో రకాల పసందైన వంటకాలు ఇక్కడ దొరుకుతాయి. అలాగే చైనీస్, మాక్‌టైల్స్, మిల్క్ షేక్స్, పానీ పూరి, డ్రింక్స్, సోడా, పిజ్జా పాయింట్, బొంబాయ్ చాట్ అన్ని రకాల దోశలు, ఆంధ్ర వంటలు ఇలా గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని రకాల వంటకాలు ఇక్కడ లభిస్తాయి. పరిశుభ్రంగా ఉండే వాతావరణంలో… నాణ్యమైన ఆయిల్‌, ఆహారపదార్థాలతో తయారు చేసే రెసిపీలను టేస్ట్‌ చేసేందుకు నగరవాసులు క్యూ కడుతుంటారు. సాయంత్రం అయిందంటే చాలు ఇక్కడ రద్దీ మొదలవుతుంది... తెల్లవారుజాము వరకు ఫుడ్‌ లవర్స్‌ తో ఈ ప్రాంత మంతా సందడిగా ఉంటుంది.

  ఇది చదవండి: మన ఇండియా గొప్పతనం అదే.. అందుకే ఈమె సప్తసముద్రాలు దాటి వచ్చేసింది..!  ఫుడ్‌ లవర్స్‌కు బెస్ట్‌ ఛాయిస్‌
  ఈ ఫుడ్‌ బజార్‌లో దాదాపు 90 స్టాల్స్‌ ఉండేలా అధికారులు ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం 50కు పైగా ఫుడ్‌ స్టాల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఫుడ్ ట్రక్కులు పెట్టి అమ్ముకునే వాళ్లందరికి ఒక ప్లేస్‌ ఇవ్వడంతో పాటు.. ఆహార ప్రియులకు అనేక రకాల రుచులను ఆస్వాదించేందుకు మంచి హ్యాంగ్అవుట్ స్పాట్‌ను అందించడమే లక్ష్యంగా ఈ నైట్‌ బజార్‌ను ఏర్పాటుచేశారు అధికారులు.
  చాలాసార్లు రాత్రిపూట ఆహారం దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ ఫుడ్ జోన్ తెల్లవారుజాము వరకు తెరిచి ఉంటుంది. సెకండ్‌ షో సినిమాకు వెళ్లి వచ్చే వాళ్లకు, నైట్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేయాలనునేవాళ్లు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చి ఇక్కడ ఫుడ్‌ ఎంజాయ్‌ చేయోచ్చు.  టైమింగ్స్‌: ఈ నైట్‌బజార్‌ సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల వరకు ఉంటుంది.
  అడ్రస్‌: జైలు రోడ్డు, ద్వారకానగర్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ - 530004

  Vizag Night Food Bazar

  ఎలా వెళ్లాలి?
  బస్టాండ్‌కు కూత వేటు దూరంలోని జైల్‌ రోడ్డులో ఈ నైట్‌ బజార్‌ ఉంటుంది. విశాఖపట్నం ఆర్టీసీ బస్టాండ్ పక్కన.. వైయస్ రాజశేఖర్ రెడ్డి వుడా సెంట్రల్ పార్క్ వెనక ఉన్న జైల్ రోడ్ లో ఫుడ్ కోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 2 నిమిషాలు నడిస్తే చాలు రకరకాల రుచులను ఆస్వాదించేయోచ్చు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Food Items, Local News, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు