P.Anand Mohan, Visakhapatnam, News18
చిన్నవయసులో మొదలయ్యే ఆకర్షణలు.. పశువులా మారిన యువకుడి కామవాంఛ వెరసి అభంశుభం తెలియని బాలిక ప్రాణాలమీదకు తెచ్చింది. తెలిసీ తెలియయని వయసులో యువకుడి ప్రేమలో బడిన బాలిక వాడు చెప్పినంద నమ్మింది. అసలేం చేస్తున్నానో తెలియనితనంతో లొంగిపోయింది. అసలు విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందేమోనన్న భయంతో నిండుప్రాణాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విశాఖపట్నంలోని (Visakhapatnam) అగనంపూడిలో చోటు చేసుకున్న బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే... బాలిక తల్లిదండ్రులు అగనంపూడిలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. తండ్రి అదే ఆపార్ట్ మెంట్ కు వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. వారికి కుమార్తె ఉంది. బాలిక కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ పక్కనే ఉండే ఆదిత్యా అపార్ట్ మెంట్ ఫ్లాట్ నెం.101లో విజయనగరం జిల్లా (Vizianagaram District) కొత్తపేట సమీపంలోని గొల్లపేటకు చెందిన కార్పెంటర్ దిగుమతి నరేష్ ఉంటున్నాడు.
మాయమాటలు చెప్పి..
బాలికపై కన్నేసిన నరేష్.., ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. ఆ తర్వాత ఆమెకు పోర్న్ వీడియోలు చూపిస్తూ శారీరకంగా అనుభవించేవాడు. దాదాపు రెండు నెలలుగా ఇద్దరి మధ్య వ్యవహారం నడుస్తోంది. ఇదే క్రమంలో తాము వచ్చిన పని అయిపోవడంతో స్వగ్రామానికి వెళ్లిపోతున్నామని.. చివరిసారిగా రమ్మని నరేష్ బాలికను కోరాడు. దీంతో ఆమె రాత్రి ఇంట్లో తల్లిదండ్రులు నిద్రించిన తర్వాత అతడివద్దకు వెళ్లింది. ఐతే కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతికారు. అదే సమయంలో బాలిక, నరేష్ కలిసున్నారు. కేకలు తల్లిదండ్రుల కేకలు వినించడంతో నరేష్ తప్పించుకున్నాడు.
ఏం చేయాలో తెలియక దూకేసింది...
ఒంటరిగా ఉన్న బాలిక అపార్ట్ మెంట్ టెర్రస్ పైకి వెళ్లింది. తల్లిదండ్రులు చూస్తారన్న భయంతో అక్కడి నుంచి దూకేసింది. ఆమెకు కాలి ఎముకలు విరగడంతో పాటు శరీరంలో నరాలు చిట్లిపోయి స్పాట్ లోనే చనిపోయింది. ఉదయం బాలిక మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమవివ్వగా కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేశారు.
నిందితుడ్ని పట్టించిన క్లూ...
ఎన్నికోణాల్లో విచారించినా క్లూ దొరక్కపోవడంతో మృతురాలు చివరిసారిగా మాట్లాడిన ఫోన్ కాల్ ను విశ్లేషించారు. దీంతో పక్క అపార్ట్ మెంట్లో ఉంటున్న నరేష్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. అప్పటికే అతడు తప్పించుకునేందుకు ప్లాన్ వేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం చెప్పాడు. నింధితుడిపై 174 సిఆరిపిఎఫ్ యాక్ట్ తో పాటు 376, సెక్షన్ 6 ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించడమే కాకుండా నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.