Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM HERE ARE THE HEALTH BENEFITS OF ICE APPLES WHICH ARE AVAILABLE IN HOT SUMMER FULL DETAILS HERE PRN VSP NJ

Ice Apple: వేసవిలో మాత్రమే దొరికే ఫ్రూట్‌.. ఖర్చు తక్కువ.. ప్రయోజనాలెక్కువ.. తింటే వదిలిపెట్టరు..!

వేసవిలో తాటిముంజలకు గిరాకీ

వేసవిలో తాటిముంజలకు గిరాకీ

సమ్మర్ (Summer) వస్తే చాలు శరీరాన్ని చల్లబరిచే ఫుడ్ ఐటమ్స్ కు మంచి గిరాకీ వచ్చిపడుతుంది. జనం కూడా బాడీని కూల్ చేసే వాటికోసం తెగవెతికేస్తుంటారు. ఎన్ని కూల్ డ్రింక్స్ (Cool Drinks) తాగినా, ఎన్ని ఐస్ క్రీమ్ (Ice creams) లు లాగించినా.. సహజసిద్ధంగా దొరికే వాటితోనే ఆరోగ్యానికి మంచింది. హాట్ సమ్మర్లో బాడీ కూల్ కావాలంటే మాత్రం అది తాటి ముంజల (Ice Apples) తోనే.

ఇంకా చదవండి ...
  S Jagadeesh, News18, Visakhapatnam

  సమ్మర్ (Summer) వస్తే చాలు శరీరాన్ని చల్లబరిచే ఫుడ్ ఐటమ్స్ కు మంచి గిరాకీ వచ్చిపడుతుంది. జనం కూడా బాడీని కూల్ చేసే వాటికోసం తెగవెతికేస్తుంటారు. ఎన్ని కూల్ డ్రింక్స్ (Cool Drinks) తాగినా, ఎన్ని ఐస్ క్రీమ్ (Ice creams) లు లాగించినా.. సహజసిద్ధంగా దొరికే వాటితోనే ఆరోగ్యానికి మంచింది. హాట్ సమ్మర్లో బాడీ కూల్ కావాలంటే మాత్రం అది తాటి ముంజల (Ice Apples) తోనే. ఇవి పల్లెల్లో విరివిగా లభిస్తాయి. ఒకప్పుడు ఇవి నగరాల్లో పెద్దగా లభించేవి కాదు. అయితే, ఇటీవల కొంతమంది వ్యాపారులు సైకిళ్లపై ఆకుల్లో ముంజలు పెట్టుకుని విక్రయిస్తున్నారు. అయితే, గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ వీటి ప్రాముఖ్యత తగ్గలేదు. పెద్దలు, చిన్నారులు వేసవి సెలవులు వేస్తే చాలు కత్తి పట్టుకొని చెట్లు ఎక్కి.. తాటి కాయలు కొట్టుకొని తింటున్న వైనం చూడొచ్చు. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే, దీన్ని రుచి కోసం కాకపోయినా.. ఆరోగ్యం కోసమైనా ట్రై చేయండి. వేసవిలో ఎక్కువగా వచ్చే డీ హైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలతో ఇబ్బందిపడేవారికి తాటి ముంజులు మంచి ఔషదం.

  ఎన్నో పోషక విలువలు
  ఎంతో మృదువుగా.. ముట్టుకుంటే జారిపోయేంత సున్నింతగా ఉండే ఈ ముంజలను అలా నోట్లో పెట్టుకుంటే చాలు.. చల్లగా కడుపులోకి జారుకుంటాయి అందుకే వీటిని ‘ఐస్ యాపిల్స్’ అని కూడా అంటారు. ఈ ముంజుల్లో విటమిన్‌ ఏ, బీ, సీ, ఐరన్‌, కాల్షియంతో పాటు బి కాంప్లెక్స్, నియాసిస్, రిబో ప్లెవీస్, దయామిన్, జింకు పాస్పరస్, పొటాషియం తదితర పోషకాలు కూడా ఉంటాయి. కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ముంజుల్లోని పొటాషియం శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగిస్తాయి.

  ఇది చదవండి: నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. బొంగు చికెన్ కోసం అరకు వెళ్లక్కర్లేదు..!


  ఒంట్లో వేడిని ఇట్టే తగ్గిస్తాయి..
  ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటాయి.. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే!

  ఇది చదవండి: వీళ్ల చేతుల్లో ఏదో అద్భుతం ఉంది.. ఏం చెేసినా జీవం ఉట్టిపడాల్సిందే..!


  డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం..
  ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా డీహైడ్రేషన్‌ అయిపోవడం సర్వసాధారణం. కాబట్టి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. ఈ పండ్లు ఆకారంలో లీచీ పండును పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.

  ఇది చదవండి: అక్కడ ఏ టిఫిన్ అయినా 10 రూపాయలే..! ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..


  గర్భిణులకూ మంచిదే..
  గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి.

  ఇది చదవండి: కోస్తాకు సీమకు మధ్య స్వీట్ ఫైట్.. పూతరేకులకు పోటీ.. కాజాకు కాంపిటీషన్


  బరువు తగ్గిస్తాయి..
  తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. అలాగే చికెన్‌పాక్స్‌తో బాధపడే వారికి దురద నుంచి ఉపశమనం అందించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. వేసవి కాలంలో తాటి ముంజులతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారుకదా.. మరి మీరు ఎంచక్కా లాగించేయండి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Healthy food, Summer, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు