హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Snoring in Kids: చిన్నారుల్లో గురక ఎందుకు వస్తుంది..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!

Snoring in Kids: చిన్నారుల్లో గురక ఎందుకు వస్తుంది..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏడాదిలోపు చిన్నారులు గురక సమస్యతో (Snoring Problem) బాధపడుతున్నారా..? ఎన్ని మందులు వాడినా ఉపశమనం లభించడం లేదా..? అయితే అప్రమత్తం కావాల్సిందే అంటున్నారు డాక్టర్లు.

  P.Anand Mohan, Visakhapatanm, News18

  ఏడాదిలోపు చిన్నారులు గురక సమస్యతో (Snoring Problem) బాధపడుతున్నారా..? ఎన్ని మందులు వాడినా ఉపశమనం లభించడం లేదా..? అయితే అప్రమత్తం కావాల్సిందే అంటున్నారు చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) వైద్య నిపుణులు. ఈ సమస్యను ‘లారింగోమలాసియా’గా పేర్కొంటారని, ఒక్కొక్కసారి ఆకస్మిక మరణానికి కారణం కావచ్చట. నర్సీపట్నం ప్రాంతంలో ఈ తరహా సమస్యలతో వచ్చే చిన్నారులపై ఆయన పరిశోధన చేశారు. తన పరిశోధనలో గుర్తించిన అంశాలను ఈ నెల తొమ్మిదో తేదీన గీతం యూనివర్సిటీలో జరిగిన ‘అసోసియేషన్‌ ఆఫ్‌ ఓటోలారింగోలజిస్ట్స్‌’ సౌత్‌ జోన్‌ కాన్ఫరెన్స్‌లో ప్రజెంట్‌ చేశారు.ఈ సమస్య సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఏడాదిలోపు చిన్నారుల్లో కనిపిస్తుంది. చిన్నారులు తీవ్రమైన గురకతో బాధపడడం, డొక్కలు ఎగరేయడం వంటి లక్షణాలు ఉంటాయి.

  2,100లో ఒకరికి సమస్య..

  సాధారణంగా ప్రతి 2,100 మంది చిన్నారుల్లో ఒకరికి ఈ సమస్య వస్తుంది. నర్సీపట్నం ప్రాంతంలో 120 మంది చిన్నారులు ఈ తరహా సమస్యతో వచ్చినప్పుడు వారికి పరీక్షలు నిర్వహించగా... 48 మంది లారింగోమలాసియాతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ స్థాయిలో బాధితులు వుండడం కొంత ఆందోళన కలిగించే అంశంగా డాక్టర్లు చెబుతున్నారు.

  ఇది చదవండి: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?


  సమస్య ఎక్కడంటే..!

  మనం పీల్చే గాలి లోపలకు వెళ్లాలంటే... ముక్కు నుంచి ఒక ప్రధాన ద్వారం ఉంటుంది. ఈ ద్వారం మొదటి భాగాన్ని లారిన్స్‌ అంటారు. దీన్ని ప్రధాన గేటుగా చెప్పవచ్చు. అక్కడి నుంచే మాట కూడా వస్తుంది. ఇది (వాయిస్‌ బాక్స్‌) చాలా పలుచగా ఉంటుంది. అయితే ఈ లారింగోమలాసియా సమస్యతో బాధపడే చిన్నారుల్లో వాయిస్‌ బాక్స్‌ మరింత పలుచగా ఉంటుంది. ఊపిరి తీసుకున్నప్పుడు ఒత్తిడికి గురై లోపలకు వెళ్లిపోతుంది. అలా లోనికి వెళ్లిన వాయిస్‌ బాక్స్‌... బయటకు గాలి వదిలినప్పుడు అడ్డుపడుతుంది. దీనివల్ల రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌ ఏర్పడి చిన్నారులు మరణించే ప్రమాదం ఉంది. దీన్ని సడన్‌ ఇన్‌ఫాంట్‌ డెత్‌ సిండ్రోమ్‌ గా పేర్కొంటారు. కొందరు చిన్నారుల్లో ఈ సమస్య వల్ల ఎదుగుదల ఉండదు.

  ఇది చదవండి: గుడ్లు తినడం ఒక కళ.. అది న్యూట్రిషనిస్టులు చెప్పే వేళ.. అదేంటో తెలుసుకోండి.


  లక్షణాలు ఇవే..!

  ప్రధానంగా గురక, డొక్కలు ఎగరేయడం, మందులు వాడినా జలుబు తగ్గకపోవడం, ఎక్కిళ్లు రావడం, వాంతులు అవుతుండడం వంటివి దీని లక్షణాలు. ఈ సమస్య ఎనిమిదో నెల వచ్చేంత వరకు పెరుగుతుంటుంది. సమస్యతో వచ్చిన 48 మంది చిన్నారులు, వారి తల్లులతోపాటు ఈ సమస్య లేని మరో 48 చిన్నారులు, వారి తల్లులపై పరిశోధన చేశారు. గర్భిణిగా వున్న సమయంలో డేటాను స్టడీ చేశారు.

  ఇది చదవండి: బరువు తగ్గాలని అన్నం మానేస్తున్నారా.. ఫుడ్‌లో అన్నం ఉండాల్సిందే.. ఈమాటన్నది..


  సర్వేలో ఏం తేలిందంటే..!

  అందులో వారు వాడిన మందులు, ఎప్పుడు గర్భం దాల్చినదీ, ఎప్పుడు పెళ్లి జరిగిందన్న విషయాలపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా లెరింగో మలేసియాతో బాధపడుతున్న చిన్నారుల తల్లులు 18 నుంచి 19 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకున్నట్టు గుర్తించారు. అదేవిధంగా 20 ఏళ్లలోపు గర్భం దాల్చినట్టుగా గుర్తించారు. మొదటి, రెండో బిడ్డకు మధ్య ఎడం లేకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం, గర్భిణిగా వున్న సమయంలో రక్తహీనతతో బాధపడిన వాళ్లకు పుట్టిన చిన్నారుల్లో ఈ సమస్య వున్నట్టు గుర్తించారు.

  ఓరల్‌ కాల్షియం డ్రాప్స్‌ ఇవ్వడం ద్వారా చిన్నారులు ఈ సమస్య నుంచి రికవరీ అవుతారట. 16 రోజుల చిన్నారి తీవ్రమైన గురకతో వచ్చినప్పుడు ఎండోస్కోపీ చేయగా... మొదటిసారి లారింగోమలాసియా సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. అనంతరం పరిశోధన ప్రారంభించారు. సదరు చిన్నారికి మెరుగైన మందులు ఇవ్వడం వల్ల ప్రస్తుతం ఆరోగ్యంగా వున్నట్టు వెల్లడించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Health

  ఉత్తమ కథలు