హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Heavy Rains: మరో 24 గంటలు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్..

Heavy Rains: మరో 24 గంటలు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్..

ఏపీకి భారీ వర్షాలు (twitter)

ఏపీకి భారీ వర్షాలు (twitter)

Heavy Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్ మరోసారి భారీ వర్సాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా 24 గంటల పాటు వానలు దంచికొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. మరోవైపు వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఇంకా చదవండి ...

  Heavy Rains: నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో (Bay Bengal) ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ చాలా ప్రాంతాల్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నది (Godavari River)కి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తూ వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను విపత్తుల సంస్థ అప్రమత్తం చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో వరద విపత్తును ఎదుర్కోటానికి ముందస్తుగా అత్యవసర సహాయక చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్ధం చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  ఒడిశా (Odisha) తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అటు వరుసగా నాలుగో రోజూ వర్షం దంచికొడుతూనే ఉంది. దీంతో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజల్ని అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది. అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. భారీ వర్షాలకు గోదావరి అనేక చోట్ల ఉగ్రరూపం దాల్చింది.

  విజయవాడ ప్రకాశం బ్యారేజికి కూడా వరద నీరు వచ్చి చేరటంతో అధికారులు గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని ఏపీ విపత్తునిర్వహణ సంస్ధ అధికారులు సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయవద్దని వారు కోరారు.

  ఇదీ చదవండి : వైసీపీతో కలవనున్న తెలుగుదేశం.. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు

  ఈ ఏడాది జులైలో రికార్డు స్థాయిలో గోదావరికి వరద నీరు చేరుతోంది. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తి ఉంచారు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి 9లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. గంటగంటకు పెరుగుతున్న వరద ప్రవాహం కారణంగా ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. ఏలూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దాచారం – కుక్కునూరు మధ్య గుండేటి వాగు కల్వర్ట్ మునిగిపోయింది. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

  ఇదీ చదవండి: పయ్యావుల సెక్యూరిటీ తగ్గింపుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. మళ్లీ గన్ మెన్ల కేటాయింపు.. కారణం ఇదే

  ఇటు కోనసీమకు వరద భయపెడుతోంది. లంక గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందిని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద ప్రవాహానికి నదీపాయ రహదారులు తెలిగిపోయాయి. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం-కోటిపల్లి రేవులో వరద ఉధృతికి రహదారి కొట్టుకుపోయింది. ముక్తేశ్వరం-కోటిపల్లి రేవులో పంటు ప్రయాణాలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లా అన్నవరం వాగులో వంతెన కొట్టుకుపోయింది. కూనవరం దగ్గర 51 అడుగులకి చేరింది వరద నీటిమట్టం శబరి, గోదావరి నదులకి క్రమ క్రమంగా వరద పోటెత్తుతోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Visakhapatnam, Weather report

  ఉత్తమ కథలు