Weather Report: ఓ వైపు వింటర్ సీజన్.. అదే సమయంలో కార్తీక మాసం దీంతో పర్యాటక ప్రాంతాలకు షికారుకు వెళ్దామనుకుంటున్న పర్యాటక ప్రేమికులకు బిగ్ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వానలు (Heavy rains) ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఆకాశానికి చిల్లు పడినట్లు నెల్లూరు జిల్లా (Nellore District) వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలోని కావలి, కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆ భయం నుంచి ఇంకా తేరుకోకముందే మరో హెచ్చరిక అందుతోంది.
దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో, ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంపై వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి క్రమంగా దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై తదుపరి 48 గంటల్లో వాయుగుండంగా కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీంతో రాబోయే మూడు రోజులు భారీ వానలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి : హిజ్రాలకు కూడా ఇకపై ఐడీ కార్డులు.. వాటితో లాభాలు ఏంటంటే?
మరోవైపు ఏపీవ్యాప్తంగా చలి తీవ్రత పెరగనుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాబోయే మూడు లేదా నాలుగు రోజులు ఉదయం వేళలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో ఉంటాయని.. కొన్ని ప్రదేశాల్లో పొగమంచుతో కూడిన తేమ వాతావరణ చూడొచ్చునని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఓల్డ్ ఈజీ గోల్డ్ అంటున్న ప్రజలు.. గానుగ నూనెకు పెరిగిన డిమాండ్.. కారణం ఇదే?
నవంబనఖ 17న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి.. అల్పపీడనం వచ్చే నాలుగు రోజుల వరకు చలి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. అల్పపీడన ఉత్తర భారత దేశ నుంచి చల్లటి గాలులను దిగువకు లాగుతుంది. ఈ మూడు రోజులు చిన్నపిల్లలంతా తప్పని సరిగా స్వెట్టర్లు, దుప్పట్లు, మప్లర్లు వేసుకోవాలి.. పెద్దవారు బయటకు వెళితే స్వెట్టర్ లేదా ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుని మాత్రమే బయటకు వెళ్లడం మంచిది. అయితే రేపటి నుంచి 20వ తేదీ వరకు చిలి అధికంగానే ఉంటుంది.
ఇదీ చదవండి: 100 కి ఫిర్యాదు వచ్చిందని వెళ్లిన ఎస్సైకు షాకింగ్ ఘటన.. ఏం జరిగింది అంటే?
ఈ నెల 20వ తేదీ నుంచి కాస్త చలి ప్రభావం మళ్లీ తగ్గుతూ ఉంటుంది. నవంబర్ 21 నుంచి దక్షిణ ఆంధ్రలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో చలి తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే పొడి గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చలి ఎక్కువగా ఉంటుంది. తేమ గాలులు ఎక్కువగా ఉంటే..? ఉక్కపోత ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Rains