Rain Alert: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై వరుణుడు శాంతించడం లేదా..? ఇప్పట్లో ఏపీని వదిలే అవకాశం లేదా.. ప్రస్తుతానికి వర్షాలు పడడం లేదు.. అయితే ఇది స్మాల్ బ్రేక్ మాత్రమేనా..? మళ్లీ ఏపీని భారీ వానలు ముంచెత్తనున్నాయా.. (Heavy Rains)? ఆ మధ్య సూపర్ సైక్లోన్ గా సిత్రాంగ్ తుఫాను భయపెడుతుంది అంతా భయపడ్డారు.. ఇదురు గాలులు..భారీ వానలు తప్పవని ఆందోళన చెందారు. కానీ ఆ ముప్పు తప్పింది. నేటి నుంచి వాయుగుండం ప్రభావం ఉంటుంది అనుకున్నా.. ఆ ప్రభావం కూడా కనిపించలేదు. దీంతో వానాకాలంతో పాటు.. వానలు వెళ్లిపోయాయని అంతా అనుకుంటున్న వేళ వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.
ఈశాన్య రుతుపవనాలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని ప్రకటించింది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడును అక్టోబర్ 20 లేదా అంతకు రెండు రోజులు అటుఇటుగా తాకుతాయి. కానీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈ నెల 23 వరకు పూర్తి కాలేదు. ఇంతలోనే బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సిత్రాంగ్’ తుపాను కూడా ఈశాన్య గాలులను నిలువరించడం ద్వారా రుతుపవనాల ఆలస్యానికి కారణమైంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి ఆగ్నేయ భారతదేశ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రవేశం సాధారణం కంటే వారానికి పైగా ఆలస్యమవుతోంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశమంతటా వర్షాలు కురిపిస్తే ఈశాన్య రుతుపవనాలు మాత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రభావం చూపుతాయి. అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల పాటు ఈ రుతుపవనాలు విస్తారంగా వర్షాలను కురిపిస్తాయి.
ఇదీ చదవండి : భూతల స్వర్గంలా ఆకట్టుకుంటున్న కొత్త పర్యాటక ప్రాంతం.. చేతులను ముద్దాడేలా మేఘాలు
ఈశాన్య రుతుపవనాల కారణంగా కోస్తాంధ్రలో 338.1 మిల్లీమీటర్లు, రాయల సీమలో 223.3 మిల్లీమీటర్ల సాధారణ సగటు వర్షపాతం నమోదవుతుంది. నైరుతి రుతుపవనాల సీజన్లో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలోనే బంగాళాఖాతంలో తపానులు ఎక్కువగా ఏర్పడతాయి. వాటిలో అధికంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులపైనే ప్రభావం చూపుతాయి.
ఇదీ చదవండి : ఎట్టకేలకు అలీకి కీలక పదవి.. అయినా అసంతృప్తి వీడలేదా..? పార్టీ మారుతున్నారా?
సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ల మధ్యలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా రెండు, మూడు తుపానులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ.. ఈ ఏడాది అంతకు మించి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా ఈ నెల 29 నుంచి రాష్ట్రంలో వర్షాలు మొదలు కానున్నాయి. 30వ తేదీ నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cyclone effect trains, Heavy Rains