Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM GVMC PLANNING TO SETUP MINI SEVEN WONDERS PARK IN VISAKHAPATNAM SOON PRN VSP

Seven Wonders at Vizag: ఏడు వింతలన్నీ విశాఖలోనే… ప్రభుత్వం వినూత్న ఆలోచన..

విశాఖపట్నం(ఫైల్)

విశాఖపట్నం(ఫైల్)

ఆగ్రాలో తాజ్ మహల్ (Taj mahal) విశాఖపట్నం (Visakhapatnam) వస్తోంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (Great wall of China) కూడా వైజాగ్ వస్తోంది. ఈజిప్ట్ గ్రీక్ గిజా పిరమిడ్స్ (Egypt Giza Pyramid) చూడాలంటే వైజాగ్ వెళ్తే సరిపోతోంది.

  P. Anand Mohan, Visakhapatnam, News18

  ఆగ్రాలో తాజ్ మహల్ (Taj mahal) విశాఖపట్నం (Visakhapatnam) వస్తోంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (Great wall of China) కూడా వైజాగ్ వస్తోంది. ఈజిప్ట్ గ్రీక్ గిజా పిరమిడ్స్ (Egypt Giza Pyramid) చూడాలంటే వైజాగ్ వెళ్తే సరిపోతోంది. ప్రపంచంలోని ఏడు వింతల్ని వైజాగిటీస్ ఒకేచోట చూడనున్నారు. అదెలా అంటారా..? విశాఖ జీవిఎంసీ ఆ ప్రయత్నం చేస్తోంది. ఏడువింతల్ని ఒకేచోట మినీ రూపంలో చూపించనుంది. మినీ అంటే మరీ చిన్నదేం కాదు. ఇరవై అడుగుల ఎత్తు వరకూ ఉంటుందంటున్నారు. వైజాగ్‌ (Vizag)లోనే ఉంటూ ఈ వింతలన్నింటినీ ఒకేసారి చూసి ఎంజాయ్‌ చేసే అవకాశం త్వరలోనే రానుందట. ఏడు వింతలను ప్రతి సృష్టి చేసి.. సరికొత్త అనుభూతిని అందించేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం ఏడు వింతల పార్కే కాదు.. విభిన్న రకాల థీమ్‌ పార్కులకు శ్రీకారం చుడుతోంది.

  విశాఖ అంటేనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని   అందాల నగరం. ఒకవైపు మహా సముద్రం. ఇంకో వైపు పచ్చని కొండలు. మరెన్నో అందాలు. అలాంటి విశాఖలో మరో మణిహారాన్ని అలంకరించేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ సమాయత్తమవుతోంది. నగరవాసులకు ఒత్తిడి దూరం చేసి.. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తోంది. విశాఖ నగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే ఏడు వింతలు ఒకే చోట ఉండే థీమ్ పార్కును ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ రెడీ చేసింది.

  ఇది చదవండి: జగన్ ను వదలని రఘురామ... సుప్రీం కోర్టులో మరో పిటిషన్...  వివిధ దేశాల్లో ఉన్న ఏడు వింతలను ఎంచక్కా.. సిటీలోనే సరదాగా ఎంజాయ్‌ చేసేలా సెవన్‌ వండర్స్‌ పార్క్‌ రానుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారీ స్థాయిలో థీమ్‌ పార్కులు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ సంకల్పించింది. ఇందులో భాగంగా మినియేచర్స్‌తో సెవన్‌ వండర్స్‌ పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వండర్‌ను 22 నుంచి 30 అడుగుల ఎత్తు ఉండేలా ఆవిష్కరించనున్నారు. అన్ని వింతలూ రాత్రి పూట విద్యుత్‌ కాంతుల్లో ధగధగలాడేలా ఈ పార్కు రూపుదిద్దుకోనుంది.

  ఇది చదవండి: సీఎం జగన్ వైజాగ్ టూర్ రద్దుకు కారణం ఇదేనా...? రాజకీయకోణం ఉందా..?  వీటితో పాటు ఇక పంచతత్వ పార్కులు, థీమ్‌ పార్కులు, స్వింగ్‌ గార్డెన్స్, నక్షత్ర వనాలు.. ఇలా విభిన్న పార్కులను విశాఖలోని అన్ని జోన్లలోనూ ఏర్పాటు చేసేందుకు జీవింఎసీ సిద్ధమవుతోంది. వివిధ రకాల ఫ్రూట్‌ షేప్‌లు ఏర్పాటు చేసి వాటిపై సేదతీరేలా ఫ్రూట్‌ థండర్‌ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, డాగ్‌ పార్కు, లేక్‌ పార్కు... ఇలా విభిన్న థీమ్‌ పార్కులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. వర్షపు నీటిని ఎన్ని రకాలుగా భూమిలోకి ఇంకించవచ్చు అనే అంశం వివరిస్తూ.. రెయిన్‌ వాటర్‌ హార్వెస్ట్‌ పార్కు కూడా రానుంది.

  ఇది చదవండి: అలా చేస్తే బీజేపీలో టీడీపీ విలీనం... చంద్రబాబు ప్రతిపాదన.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..  దాదాపు 9.88 ఎకరాల్లో రూ.10.92 కోట్లతో తొలివిడతలో 11 పార్కులు ఏర్పాటు చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయాలని జీవీఎంసీ ఆలోచన చేసింది. ఇందుకోసం కొన్ని జోన్లలో ఉన్న జీవీఎంసీకి చెందిన ఖాళీ స్థలాలను గుర్తించి ఆ స్థలాల్లో థీమ్‌ పార్కులను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా అటు భీమిలీ నుంచీ ఇటు గాజువాక.. ఇంకోవైపు సింధయా నుంచీ పెందుర్తి వరకూ కొన్ని చోట్ల పార్కుల ఏర్పాటుకు స్థలాల్ని పరిశీలిస్తోంది. వీటిలో కొన్నివార్డులకు సంబంధించి ఇప్పటికే స్థల సేకరణ కూడా జరుగుతోంది. విశాఖలోని ఎంవీపీ కాలనీ, సీతమ్మధార మొదలైన ప్రాంతాల్లో ఉన్న పార్కుల్లో కొన్నింటిని, మిగిలిన పార్కుల కోసం ఇప్పటికే గుర్తించిన ఖాళీ స్థలాలను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Visakhapatnam

  తదుపరి వార్తలు