Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM GVMC OFFICIALS FEELING ANGRY ON COLLECTOR FOR CLEANING VIZAG BEACH FULL DETAILS HERE PRN VSP

Vizag News: మాకేంటీ చెత్తపని.. కలెక్టర్ తీరుపై అధికారుల అసంతృప్తి.. వీకెండ్ లోనూ చాకిరీ..!

బీచ్ ను క్లీన్ చేస్తున్న అధికారులు

బీచ్ ను క్లీన్ చేస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అతిపెద్ద నగరం విశాఖపట్నం (Visakhapatnam). టూరిజం పరంగా, పరిశ్రమల పరంగా బాగా అభివృద్ధి చెందింది. విశాఖ సిటీ మాత్రం పర్యాటకులకు స్వర్గధామం. సిటీ ఆఫ్ డెస్టినేషన్ గా పేరొందిన వైజాగ్ ను నిత్యం క్లీన్ గా ఉంచుతారు అధికారులు. ఐతే అదే వారికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

ఇంకా చదవండి ...
  P Anand Mohan, News18,Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అతిపెద్ద నగరం విశాఖపట్నం (Visakhapatnam). టూరిజం పరంగా, పరిశ్రమల పరంగా బాగా అభివృద్ధి చెందింది. విశాఖ సిటీ మాత్రం పర్యాటకులకు స్వర్గధామం. సిటీ ఆఫ్ డెస్టినేషన్ గా పేరొందిన వైజాగ్ ను నిత్యం క్లీన్ గా ఉంచుతారు అధికారులు. ఐతే అదే వారికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మాకేంటీ చెత్త పని అంటూ అధికారులు అక్కడ విసిగిపోతున్నారు. బీచ్ క్లీనింగ్ అంటూ అధికారుల్ని పరుగెత్తిస్తుంటే.. ఆ కలెక్టర్ ను తిట్టుకుంటున్నారు. కార్పొరేషన్ చేయాల్సిన పనిని మాకెందుకు రుద్దుతున్నారంటూ చికాకు చూపిస్తున్నారు. ఆదివారం విశాఖలో జరిగిన బీచ్ వేస్ట్ క్లీనింగ్ తర్వాత అధికారుల మొఖాల్లో, వారి మాటల్లో ఇదే వినిపించింది. ఒక ప్రభుత్వ శాఖ పూర్తిగా విఫలమైతే ఆ భారం తమపై రుద్దుతారేంటని జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వ ఉద్యోగులు తిట్టుకుంటున్నారు.

  విశాఖలో ఆదివారం కలెక్టర్ బీచ్ క్లీనింగ్ ప్రారంభించారు. ఈ మధ్య ఓ విదేశీయుడు బీచ్‌ ఏంటి ఇంత డర్టీగా ఉందని అనడంతో ఆ మాటను సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బీచ్‌క్లీనింగ్‌ పేరిట ఆదివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు తప్పనిసరిగా హాజరై, బీచ్‌లో చెత్త ఏరాలని ఆదేశాలిచ్చారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌కే బీచ్‌, గోకుల్‌పార్క్‌, జోడుగుళ్లపాలెం, పెదజాలారిపేట బీచ్‌లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు చెత్త పనిచేశారు.

  ఇది చదవండి: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. రుతుపవనాలు ముందే వచ్చేస్తున్నాయ్..!


  బీచ్‌ క్లీన్‌లో భాగంగా జీవీఎంసీ పారిశుధ్య విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌లు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా, జిల్లా ఉద్యోగులతో చెత్త ఏరించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీచ్‌లో చెత్త ఎత్తడాన్ని, మద్యం సీసాలను ఏరాల్సి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని కొందరు వాపోయారు. రెండు గంటలపాటు చెత్త ఎత్తే కార్యక్రమంలో పాల్గొనడంతో కొంతమంది నీరసం వచ్చి కూలబడిపోయారు. ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టినప్పటికీ తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు.

  ఇది చదవండి: వేసవిలో మాత్రమే దొరికే ఫ్రూట్‌.. ఖర్చు తక్కువ.. ప్రయోజనాలెక్కువ.. తింటే వదిలిపెట్టరు..!


  బీచ్‌లో పూర్తిగా ప్లాస్టిక్‌ను నిషేధించినప్పటికీ, తీరంలోని అన్ని దుకాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. బీచ్‌కు వచ్చే సందర్శకులకు తినుబండారాలను ప్లాస్టిక్‌ వస్తువుల్లోనే విక్రయిస్తున్నారు. దీంతో బీచ్‌లో పాలిథిన్‌ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, వాటర్‌ బాటిల్స్‌ ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడి దుకాణాల నుంచి నెలవారీ మూమూళ్లు అందుకుంటున్న అధికారులు ప్లాస్టిక్‌ నిషేధంపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా బీచ్‌రోడ్డులో డస్ట్‌బిన్‌లు ఏర్పాటుచేసిన జీవీఎంసీ యంత్రాంగం సందర్శకులు ఎక్కువగా ఉండే సముద్రం ఒడ్డున మాత్రం ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో సందర్శకులు ప్లాస్టిక్‌ వస్తువుల్లో తినుబండారాలను తీసుకువెళ్లి, అవి ఖాళీ అయిన తరువాత అక్కడే పడేస్తునారు. అందుకే బీచ్‌ చెత్తతో నిండిపోతోంది.

  ఇది చదవండి: బస్సులో కునుకుతీస్తూ చేయి బయటపెట్టింది.. కాసేపటికే షాకింగ్ సీన్..


  ఇక బీచ్‌లు పరిశుభ్రంగా ఉంచడంలో జీవీఎంసీ వైఫల్యం కనిపించింది. పారిశుధ్య కార్మికుల కొరతతో పనులు చేపట్టడం లేదని తెలుస్తోంది. అందుకే జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో సాగరతీర స్వచ్ఛత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే వాదన వినిపిస్తోంది. జీవీఎంసీ పారిశుధ్య విభాగంలో 5,600 మంది కార్మికులు అవసరం. కానీ 5130 మంది మాత్రమే ఉన్నారు. అయితే వాస్తవంగా 4,500 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ సర్వీసెస్‌ ఏర్పడి 570 మంది కార్మికులను తొలగించింది. అంతేకాకుండా లేని కార్మికులను రిజిస్టర్లలో చూపించి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా సుమారు 500మంది కార్మికుల వరకు అదనంగా చూపుతున్నారని చెబుతున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు