హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మీరు వైజాగ్ వెళ్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..! అధికారుల కీలక నిర్ణయం

మీరు వైజాగ్ వెళ్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..! అధికారుల కీలక నిర్ణయం

విశాఖపట్నం

విశాఖపట్నం (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రధాన నగరాల్లో విశాఖపట్నం (Visakhapatnam) ఒకటి. పారిశ్రామికంగానే కాకుండా పర్యాటకంగానూ విశాఖ అందరికీ నచ్చిన డెస్టినేషన్. వైజాగ్ వెళ్తే చాలు వెంటనే తిరిగిరావాలి అనిపించదు.

  Setti Jagadeesh, News18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రధాన నగరాల్లో విశాఖపట్నం (Visakhapatnam) ఒకటి. పారిశ్రామికంగానే కాకుండా పర్యాటకంగానూ విశాఖ అందరికీ నచ్చిన డెస్టినేషన్. వైజాగ్ వెళ్తే చాలు వెంటనే తిరిగిరావాలి అనిపించదు. అంత అందంగా ఉంటుంది విశాఖ నగరం. ఐతే ఆహ్లాదకర సుందర విశాఖ సాగరతీరం ప్లాస్టిక్ వలయంలో చిక్కుకు పోయింది. విశాఖ బీచ్‌లో ఉండే ప్లాస్టిక్‌ చూస్తే వామ్మె అనాల్సిందే. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఎన్నో పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అలా కాకూడదని ముందస్తుగా ప్లాస్టిక్ నిషేధిస్తే పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు అనే నినాదంతో ముందుకెళ్తుంది జీవీఎంసీ (GVMC).

  75 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ వాడితే చర్యలే

  ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World environment day) సందర్భంగా పూర్తిగా విశాఖ నగరంలో ప్లాస్టిక్ నిషేధం విధించారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మీ షా ప్లాస్టిక్ నిషేధంపై ఉక్కుపాదం మోపారు. నేడు 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్(plastic)ను ఎవరైనా వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  ఇది చదవండి: ఆ కోటకు వెళ్తే.. రాజులే చరిత్ర చెబుతారు.. అదుర్స్ అనిపిస్తున్న నయా టెక్నాలజీ..


  పెద్ద ఎత్తున ప్రచారం, అవగాహన కార్యక్రమాలు

  పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేటి నుండి నగరంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌ తెలిపారు. అమలుకు సంబంధించి ఇప్పటికే పెద్దఎత్తున ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్న రైతుబజార్లు, షాపింగ్‌మాల్స్‌ (shopingmalls), పార్కుర్లు (Parks), హోటళ్లు (Hotels), కూరగాయల మార్కెట్లు(vegetable markets) వంటి ప్రదేశాల్లో ప్రచారం చేశారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ను ఎవరైనా వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దశలవారీగా మిగిలిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ వివరించారు.

  ఇది చదవండి: రూపాయికి పది రూపాయల లాభం.. బీటెక్ స్టూడెంట్స్ బిజినెస్ ఐడియా అదిరిపోలా..!


  ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా మరెన్నో…

  ప్లాస్టిక్‌ బదులుగా గుడ్డ, నార సంచులు, అడ్డాకులు, అరటి ఆకులు వాడాలని సూచించారు. ప్లాస్టిక్‌ నిషేధంలో నగరవాసులంతా భాగస్వాములై నగరానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు సహకరించాలని కోరారు.

  ఇది చదవండి: అల్లూరిని కాల్చిచంపిన రూథర్‌ఫర్డ్‌ బంగ్లా.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!


  ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ఎనిమిది పర్యాటక ప్రాంతాలు

  నగరంలో ప్రధాన ప్రాంతాలైన బీచ్‌లోని కోకోనట్‌పార్కు, తొట్లకొండ, తెన్నేటి పార్కు, కైలాసగిరి, సెంట్రల్‌పార్క్‌, జూపార్క్‌, వుడా సెంట్రల్‌ పార్క్‌, ఆల్‌ ఎబిలిటీ పార్క్‌లను ‘ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌’లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. ఆయా ప్రాంతాల్లోకి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను, వాటర్‌ బాటిళ్లను అనుమతించబోమన్నారు. ప్రవేశద్వారాలు, గేట్లు, నోటీసు బోర్డులో సందర్శకులకు తెలిసేలా నిబంధనలను ప్రదర్శిస్తామన్నారు.

  ఇది చదవండి: ఈ కోళ్లను కొనాలంటే ఆస్తులమ్ముకోవాలి.. వాటికున్న డిమాండ్ అలాంటిది మరి.. మీరే చూడండి..!


  ఇప్పటికే వారం రోజుల పాటుపలు ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేటి నుండి ఎక్కడ ప్లాస్టిక్ విక్రయాలు జరిగిన కేసులు నమోదు చేసి, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Visakhapatnam

  ఉత్తమ కథలు