Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM GVMC EMPLOYEES MUST USE PUBLIC PROPERTY TO OFFICE VSJ NJ ABH

Vizag: ఇకపై వీళ్లంతా ప్రజారవాణా ద్వారానే ఆఫీస్‌లకు రావాలి..! ఆదేశాలిచ్చిన విశాఖ మేయర్‌..!

కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిన విశాఖ మేయర్‌

కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిన విశాఖ మేయర్‌

చుట్టూ పచ్చని కొండలు, సుందర సాగర తీరంతో వైజాగ్‌ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అందమైన పకృతి పరిసరాలలో నెలకొన్న విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరం.అయితే ఇప్పుడు దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా కూడా ముందువరుసలోనే..!

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
     (Setti Jagadesh, News 18, Vizag)

    చుట్టూ పచ్చని కొండలు, సుందర సాగర తీరంతో వైజాగ్‌ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అందమైన ప్రకృతి పరిసరాలలో నెలకొన్న విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరం అని చెప్పుకోవచ్చు. రాజకీయ రాజధాని అమరావతిని అయితే, ఆర్థిక రాజధాని విశాఖ అంటున్నారు. అయితే ఇప్పుడు దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా కూడా వైజాగ్‌ ముందువరుసలో ఉంటుంది.

    విశాఖ నగర అభివృద్ధిలో భాగంగా అనేక చోట్ల నుండి విశాఖపట్నంకి ఉద్యోగరీత్యా , వ్యాపార రీత్యా అధిక సంఖ్యలో జనాలు వస్తూంటారు. పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాలు కూడా పెరిగాయి. రోజు వాహనాల నుండి వెలువడే కాలుష్యంతో విశాఖ నగమంతా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. అయితే సుందర విశాఖపట్నం అలా అవ్వకుండా చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు అని విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ గొలగాన హరి వెంకట కుమారి అంటున్నారు. అనడమే కాదు ఓ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

    ప్రతి సోమవారం జీవీఎంసీ ఉద్యోగులంతా తమ సొంత వాహనాల్ని వదిలి.. ఆఫీస్‌కు పబ్లిక్‌ వెహికల్‌ లేదా సైకిల్‌ మీద కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. కనీసం జీవీఎంసీ ఉద్యోగులైన ఇది పాటిస్తే కొంతవరకైనా కాలుష్య నియంత్రణ చేయవచ్చని మేయర్ ఈ ఆలోచన చేశారు. జీవీఎంసీ అధికారులను చూసైనా మిగతా ప్రజలు కొంతవరకు మారవచ్చు అని ఆమె అభిప్రాయం. వారానికి ఒకసారి ఉద్యోగులు ఇలా వస్తే వీరిని స్ఫూర్తిగా తీసుకొని కొందరు ప్రజలు మారినా తమ ఆలోచనకు ఫలితం ఉంటుందంటున్నారు మేయర్‌.

    జీవీఎంసీ ఉద్యోగులతో పాటు వివిధ సమస్యలతో ప్రతి సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి జీవీఎంసీ (GVMC)కి వచ్చే ప్రజలు కూడా అలాగే ప్రజా రవాణాలోనే రావాలని మేయర్‌ కోరారు. డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి వచ్చే ప్రజల ద్వారా ఈ సందేశాన్ని అందరికీ చేర్చే ప్రయత్నం చేస్తున్నారు మేయర్.

    పదిమందికి చెప్పేముందు తాము ఆచరించి చూపిస్తే మిగతావారు కూడా మారుతారని ముందుగా మేయర్ ప్రజా రవాణాలో రావడం ప్రారంభించారు. అందరికీ చెప్పడమే కాదు కొన్ని వారాలుగా తాము చేసి చూపిస్తున్నారు మేయర్. ముందుగా తాము ప్రజా రవాణాతో మొదలుపెట్టారు. సోమవారం ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి బస్టాపు వరకు వచ్చి అక్కడి నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అనంతరం డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో పాల్గొని బాధితుల సమస్యలు విన్నారు. మూడు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.

    అవసరానికి మించి సొంత వాహనాలు వాడడం ద్వారా నగరానికి కాలుష్యం అధికమవుతుందని.. ప్రతి ఒక్కరు కూడా అవసరమైతేనే తప్ప వాహనాలు తీసి ఎక్కడికి వెళ్ళవద్దని మేయర్‌ సూచించారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Local News, Visakhapatnam

    తదుపరి వార్తలు